Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మీనా మళ్లీ తెరమీదకు...?

మీనా ఇప్పుడు మళ్లీ తెరమీదకు రావడం ఏమిటి? మొన్నటికి మొన్నే కదా దృశ్యం..మామ మంచు..అల్లుడు కంచు సినిమాల్లో కనిపించింది అని అనుకోవద్దు. ఇది ఆ మీనా సంగతి కాదు. ప్రముఖ రచయిత్రి యుద్దనపూడి సులోచనా రాణి ఫేమస్ నవల మీనా గురించి. అప్పట్లో విజయనిర్మల దర్శకత్వంలో సినిమాగా వచ్చింది. విజయవంతంగా ప్రదర్శితమైంది. 

ఇప్పుడు దాదాపుగా ఇదే కథను గుట్టుచప్పుడు కాకుండా తెరకెక్కించేస్తున్నారని వినికిడి. ఓ పెద్ద దర్ళకుడు..పెద్ద సంస్థ, కాస్త చెప్పుకోదగ్గ స్టార్ కాస్ట్ తో చేస్తున్న భారీ సినిమా కథకు, ఈ మీనా నవలకు చాలా అంటే చాలా దగ్గరి పోలికలు వున్నాయని టాలీవుడ్ లో గుసగుసలు గుప్పుమంటున్నాయి. 

అసలే ఇప్పుడు టాలీవుడ్ లో కథలపై 'కత్తు'లు నూరేస్తున్నారు. మరి మీనాకు ఆ సినిమా కథకు పోలిక వుంటే..హక్కులు వున్నవారు ఏమంటారో? రచయిత్రి యుద్దనపూడి లేదా సినిమా హక్కులు వున్న విజయనిర్మల గానీ ఎలా స్పందిస్తారో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?