Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగా ఫ్యామిలీ కి ఇలాగైనా హిట్ దక్కేనా?!

మెగా ఫ్యామిలీ కి ఇలాగైనా హిట్ దక్కేనా?!

చిరంజీవి.. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కత్తి’ ని రీమేక్ చేస్తున్నాడు. రామ్ చరణ్ .. అదే భాషలో హిట్టైన ‘తనీ ఒరువన్’ ను రీమేక్ చేస్తున్నాడు. ఇక ట్రెండును సృష్టిస్తా అనే పవన్ కల్యాణ్ కూడా కొత్త గా చేస్తున్నదేమీ లేదు. ఆయన ఎస్ జే సూర్య దర్శకత్వంలో చేస్తున్నది కూడా తమిళ ‘వీరమ్’ సినిమా రీమేకే అని క్లారిటీ వస్తోంది! మరి ఏతావాతా.. మెగా ఫ్యామిలీలోని టాప్ ర్యాంక్ హీరోలు ముగ్గురూ రీమేక్ సినిమాల మీదే ఆధారపడ్డారని స్పష్టం అవుతోంది. ఒక కంఫర్ట్ జోన్లో ఉండి వీరు హిట్ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

‘బ్రూస్ లీ’ తో చరణ్, తన ఓన్ క్రియేషన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తో పవన్ కల్యాణ్ లు... డిజాస్టర్లను ఎదుర్కొన్నారు. ఇక చెర్రీ పరిస్థితి ‘బ్రూస్ లీ’ కి ముందు కూడా ఏమంత గొప్పగా లేదు. ఇక పవన్ ‘సర్దార్’కుముందు హిట్టున్నాయి కానీ.. ఆ హిట్టైన సినిమాలు కూడా వేరే భాషల్లో హిట్టైన సినిమాలకు రీమేక్ లే! దీంతోఇప్పుడు హిట్ ను పొందడానికి పవన్ మళ్లీ రీమేక్ బాటనే అనుసరించాల్సి వస్తోంది!

హిట్ కొట్టక తప్పని పరిస్థితుల్లో చెర్రీ రీమేక్ సబ్జెక్టును ఎంచుకుంటే.. తనకు హిట్ కావాలంటే రీమేక్ చేయాల్సిందే అనే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు పవన్ కల్యాణ్. ఇక రీఎంట్రీ కోసం చిరంజీవి కూడా రీమేక్ నే ఎంచుకుని కంఫర్ట్ జోన్లో ఉండటానికే ప్రాధాన్యతను ఇచ్చాడు. ధాటిగా కొత్త కథలను ఎంచుకునే ధైర్యం చేయక సేఫ్ సైడెడ్ యత్నాలు చేస్తున్న వీరికి ఇవైనా కలిసొస్తాయేమో చూడాలి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?