Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగా హీరోల్లో మేటరుంది

మెగా హీరోల్లో మేటరుంది

ఇప్పటికే మెగా హీరోల్లో ముగ్గురు అగ్ర పథంలో దూసుకుపోతూ ఉండగా... కొత్తగా మరో ఇద్దరు ఆ ఫ్యామిలీ నుంచి రావాల్సిన అవసరం లేదు. కానీ నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ ‘హీరో మెటీరియల్‌’ అని ఎప్పట్నుంచో ముద్ర పడిపోయింది. దాంతో అతడిని హీరోగా పరిచయం చేస్తున్నారు. చూడ్డానికి బాగున్నా కానీ సినిమాలో ఎలా ఉంటాడనేది ఇంతకాలం తెలీదు. 

‘ముకుంద’ టీజర్‌లో ఆ కొద్ది క్షణాల్లోనే తన లుక్స్‌తో, ఛార్మ్‌తో వరుణ్‌ తేజ్‌ మంచి ఇంప్రెషన్‌ వేసాడు. ఈ చిత్రంతో మెగా ఫ్యామిలీ నుంచి మరో సాలిడ్‌ హీరో వచ్చినట్టే అని ఫాన్స్‌ నమ్మకాలు పెట్టేసుకుంటున్నారు. ఇక చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ అయితే ఇంతవరకు మొదటి సినిమా విడుదల కాకుండానే పలు ఆఫర్లు కైవసం చేసుకున్నాడు. 

ఇతడు చూడ్డానికి సాదా సీదాగా ఉన్నా కానీ మంచి టాలెంటెడ్‌ అని టాక్‌ ఉంది. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ టీజర్‌లో అతని కాన్ఫిడెన్స్‌, డాన్స్‌లో గ్రేస్‌ ఇంప్రెస్‌ చేసింది. ఈ ఇద్దరు కుర్రాళ్లలోను మేటర్‌ ఉందని, ఏదో ఫ్యామిలీ ఇమేజ్‌ ఉంది కదా అని హీరోల్ని చేసేయలేదని అర్థమైంది. ఇక వీరు తమ తొలి సినిమాల్తో ఎంతవరకు మెప్పిస్తారో, హీరోలుగా ఎంత ఎత్తుకి ఎదగలరో అనేది వేచి చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?