Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ముందు బిల్డింగ్ కట్టి తర్వాత పెళ్లి చేసుకుంటాడట

ముందు బిల్డింగ్ కట్టి తర్వాత పెళ్లి చేసుకుంటాడట

పెళ్లికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక్కో టార్గెట్ ఉంటుంది. మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత లేదంటే అనుకున్న క్వాలిటీస్ తో అమ్మాయి దొరికినప్పుడు పెళ్లి చేసుకోవాలని చాలామంది భావిస్తుంటారు.

హీరో విశాల్ కు కూడా పెళ్లితో అలాంటి లింక్ ఒకటి ఉంది. తన డ్రీమ్ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు పెళ్లిచేసుకోడట ఈ హీరో. ఆ డ్రీమ్ ప్రాజెక్టు సినిమా అనుకుంటే మీరు పొరబడినట్టే. అదొక బిల్డింగ్.

అవును.. ఎప్పట్నుంచో అపరిష్కృతంగా ఉన్న నడిగర్ సంఘం భవంతి నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు విశాల్.

నడిగర్ సంఘం బిల్డింగ్ కోసం దాదాపు ఆరేళ్లుగా ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఏదీ కార్యరూపం దాల్చలేదు. అలాంటి పెండింగ్ ప్రాజెక్టుతో తన పెళ్లికి లంకె పెట్టాడు విశాల్.

నిజానికి అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈపాటికి విశాల్ పెళ్లి అయి చాలా రోజులై ఉండేది. నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మిని విశాల్ పెళ్లి చేసుకుంటాడని అనుకున్నారంతా.

కానీ విశాల్-శరత్ కుమార్ మధ్య విబేధాల కారణంగా ఆ పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడేమో నడిగర్ సంఘానికి బిల్డింగ్ కట్టిన తర్వాతే పెళ్లి చేసుకుంటానంటున్నాడు విశాల్. అయితే ఎవర్ని చేసుకుంటాడో మాత్రం చెప్పడం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?