Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మురళీ శర్మకు మళ్లీ మరో చాన్స్

మురళీ శర్మకు మళ్లీ మరో చాన్స్

మురళీ శర్మ మంచి నటుడు. అయితే తెలుగులో సరైన బ్రేక్ రాలేదు. అలాంటిది మారుతి తన భలే భలే మగాడివోయ్ తో మంచి చాన్సిచ్చాడు. అది సక్సెస్ అయింది. అయినా వెంటనే మురళీ శర్మకు అవకాశాలు తెలుగులో వెల్లువెత్తింది లేదు. నిజానికి రావురమేష్, ప్రకాష్ రాజ్ ఇలా రొటీన్ వ్యవహారాల నుంచి మంచి రిలీఫ్ మురళీ శర్మ. 

అందుకే ఇప్పుడు మారుతినే మరో చాన్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాడు. వెంకీ-నయనతారలతో, సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే సినిమాలో కీలక పాత్ర ఒక దానికి మురళీ శర్మను తీసుకుంటున్నారు. సినిమాలోని నాలుగైదు కీలక పాత్రల్లో అది ఒకటంట. ఇది కూడా క్లిక్ అయితే అప్పుడన్నా టాలీవుడ్ జనాలు డిఫరెంట్ రోల్స్ కోసం మురళీ శర్మ వైపు చూస్తారేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?