Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగ్ కేరాఫ్ ముంబాయి

నాగ్ కేరాఫ్ ముంబాయి

నాగార్జున-రామ్ గోపాల్ వర్మ సినిమా అంటేనే సంచలనం. అలాంటి సినిమా స్టార్ట్ అయింది. రెండు చిన్న షెడ్యూళ్లు జరుపుకుంది. అంతలోనే కాస్త గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో ఆర్జీవీ ఊరుకుంటారా? ఓ పోర్న్ స్టార్ తో వెబ్ మూవీ అంటూ హంగామా.

దాంతో టీవీలు, డిస్కషన్లు, విమర్శలు, కేసులు. సరే, ఆ మాత్రం హడావుడి లేకుంటే ఆర్జీవీకి తోచదు కదా. మరి ఇంతకీ నాగ్ సినిమా సంగతేమిటి? ఇది అయిపోతే నాని కాంబినేషన్ లో చేసే మల్టీ స్టారర్ మీదకు వెళ్లాలి కదా?

నాగ్-ఆర్జీవీ సినిమా కోసం ఓ లెంగ్తీ షెడ్యూలు ముంబాయిలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూలు రెండు, మూడు వారాలకు పైగానే వుంటుందని తెలుస్తోంది. ఈ షెడ్యూలుతో ఆర్జీవీ-నాగ్ సినిమా దాదాపు ఫినిష్ అయిపోతుందట. ఆ షెడ్యూలు తరువాత హైదరాబాద్ లో చేసే చిన్న షెడ్యూలుతో సినిమా పూర్తయిపోతుంది.

ఇంతకీ ఈ ముంబాయి షెడ్యూలు ఎప్పుడు? బహుశా ఫిబ్రవరి సెకెండ్ వీక్ నుంచి వుండే అవకాశం వుందట. అంటే మార్చి చివరకు లేదా ఏప్రియల్ ఫస్ట్ వీక్ కు నాగ్-ఆర్జీవీ సినిమా టాకీ పార్ట్ ఫినిష్ అయి, పోస్ట్ ప్రొడక్షన్ లో పడుతుందనుకోవాలి. ఆర్జీవీ గుట్టుచప్పుడు కాకుండా సినిమా ఫాస్ట్ గానే కానిచ్చేస్తాడు. కానీ ఎటొచ్చీ ఎలా తీస్తాడన్నది కాదు, ఎలా వస్తుందన్నదే సమస్య.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?