Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగ్ కోడలయితే పక్కన పెట్టేస్తారా?

నాగ్ కోడలయితే పక్కన పెట్టేస్తారా?

చైతూ ఇల్లాలు పోస్ట్ కన్ ఫర్మ్ అయిపోయింది హీరోయిన్ సమంతకు. కానీ అప్పటి నుంచి కొత్త సినిమాల సంగతి తెలియడం లేదు. పైగా అప్పటికే సమంత తెలుగు టాప్ హీరోలందరితో దాదాపు ఒకటికి రెండు,మూడు సినిమాలు వంతున చేసేసింది. ఇప్పుడు కొత్త అమ్మాయిల టైమ్ స్టార్ట్ అయింది. అందువల్ల సమంత అవకాశాలు తగ్గడం జస్ట్ నాచురల్. 

కానీ సమంత ఆలోచన అలా వున్నట్లు లేదు. నాగ్ కోడలు అని ఫిక్స్ కావడమే తనకు అవకాశాలు రాకపోవడానికి కారణం అని ఆమె ఫీలవుతోంది. తనకు ఎందుకు అవకాశాలు తగ్గాయో, తనకు తెలియంది కాదని, నాగ్ కోడలు అనగానే సినిమాల్లోకి తీసుకోవడానికి జంకేస్తారని అంటోందట సమంత. 

అంతే కాదు, ప్రస్తుతం చేతిలో వున్న అడ్వర్టైజ్ మెంట్ల అసైన్ మెంట్లు కూడా ఆగిపోయినా ఆశ్చర్యం లేదంటోంది. ట్విస్టేమిటంటే, ఇప్పటికే బోలెడు సినిమాలు చేసి, బోలెడు సంపాదించిన సమంత, సినిమాలు లేకపోయినా, అడ్వర్ టైజ్ మెంట్లు లేకపోయినా, తనకేం భయం లేదని, చైతన్య అన్నీ చూసుకుంటాడని అంటోంది. 

ఏమాయె చేసావే టైమ్ లోనే తన దగ్గర పెద్దగా డబ్బులు లేకపోతే, చైతన్యే అన్నీ చూసుకున్నాడని వెల్లడించింది. ఏమాయ చేసావె టైమ్ లో అంటే సమంత దగ్గర డబ్బులు లేకపోయి వుండొచ్చు. ఇన్ని సినిమాలు చేసాక కూడా లేవంటే ఎలా? అయినా ఇంత బాధపడడం ఎందుకు? చైతూకు చెబితే, అతని సినిమాలో, వేరే వాళ్ల సినిమాలకో సమంతను రికమెండ్ చేయడంటారా ?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?