Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగార్జున రూటే సెపరేటు

నాగార్జున రూటే సెపరేటు

అక్కినేని అఖిల్‌ తొలి చిత్రాన్ని నాగార్జునే నిర్మిస్తారని అనుకుంటే... నితిన్‌ ఫాదర్‌ సుధాకర్‌రెడ్డి సీన్‌లోకి వచ్చారు. అఖిల్‌ మొదటి చిత్రానికి ఆయనే నిర్మాత అని న్యూస్‌ లీక్‌ అయింది. వినాయక్‌ డైరెక్షన్‌లో రూపొందే ఈ చిత్రం నవంబర్‌లో సెట్స్‌ మీదకి వెళుతుంది. 

నాగచైతన్య తొలి చిత్రాన్ని కూడా నాగార్జున నిర్మించలేదు. నాగచైతన్య సోలో హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై చేసిన మొదటి చిత్రం ‘ఒక లైలా కోసం’. తమకే అంతటి ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ ఉన్నప్పటికీ నాగార్జున బయటి నిర్మాతలకే తనయుల్ని పరిచయం చేసే అవకాశం ఇవ్వడం విశేషం. 

ఒక పెద్ద హీరో కొడుకు మొదటి సినిమా అంటే భారీ అంచనాలుంటాయి. అందుకు తగ్గట్టుగా సినిమా అన్ని హంగులతో తెరకెక్కాలి. మహేష్‌ని పరిచయం చేసిన బ్యానర్‌లో చరణ్‌ని పరిచయం చేయడానికి ఒక కారణం ఉంది. అశ్వనీదత్‌తో సత్సంబంధాలున్నా కానీ నాగార్జున ఆయన బ్యానర్‌లోను అఖిల్‌ని ఇంట్రడ్యూస్‌ చేయడం లేదు. సొంత సంస్థపై కూడా నిర్మించడం లేదు. ఎంతైనా నాగ్‌ రూటే సెపరేటు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?