Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

స్టార్ హీరోయిన్ పెళ్లి: మరో రెండేళ్ల తర్వాతే!

స్టార్ హీరోయిన్ పెళ్లి: మరో రెండేళ్ల తర్వాతే!

నయనతార-విఘ్నేష్ శివన్.. వీళ్లిద్దరి బంధం ఇప్పుడు ఓపెన్ సీక్రెట్. తాజాగా న్యూయార్క్ లో ఈ జంట దిగిన ఫొటోలు చూస్తే వీళ్లిద్దరి మధ్య బంధం ఎవరికైనా అర్థమౌతుంది. కేవలం ఈ ఫొటోలు మాత్రమే కాదు.. కొన్ని నెలలుగా నయన్-విఘ్నేష్ కు సంబంధించి వచ్చిన పిక్స్ చూస్తే వాళ్ల మధ్య సాన్నిహిత్యం "అంతకుమించి" అనే రేంజ్ లో ఉందనే విషయం తెలుస్తుంది.

అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. నయనతార కుటుంబసభ్యులు కూడా విఘ్నేష్ ను అంగీకరించడం. సో.. వీళ్లిద్దరూ పెళ్లిచేసుకుంటారనే గాసిప్ కోలీవుడ్ లో కాస్త గట్టిగానే వినిపిస్తోంది. అయితే నయన్ మాత్రం రెండేళ్లు గ్యాప్ తీసుకోవాలని అనుకుంటోందట.

ప్రస్తుతం సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది నయన్. కేవలం గ్లామర్ రోల్స్ కే పరిమితం కాకుండా.. తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇదే ఇమేజ్ తో మరో రెండేళ్లు సినిమాలు చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది.

గతంలో శింబుతో ప్రేమాయణం సాగించిన ఈ బ్యూటీ తర్వాత బ్రేకప్ అయింది. ఇక ప్రభుదేవాతో నయన్ వ్యవహారం పెళ్లిపీటల వరకు వచ్చి ఆగిపోయిన విషయం తెలిసిందే. మరి విఘ్నేష్ తో లవ్ మేటర్ ఈ రెండేళ్లలో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?