Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ బయోపిక్ టీజర్ వుంటుందా?

ఎన్టీఆర్ బయోపిక్ టీజర్ వుంటుందా?

ఎన్టీఆర్ వర్థంతి రేపు. ఈ వర్థంతికి ఎన్టీఆర్ బయోపిక్ టీజర్ వుండబోతోందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ మేరకు రామకృష్ణ స్టూడియోలో కొద్ది రోజులు షూట్ కూడా చేసారు.ఈ షూట్ లో బాలయ్య కూడా పాల్గొన్నారు. ఎన్టీఆర్ చైతన్య రథం మీద వున్న సీన్లు టీజర్ లో వుంటాయని వార్తలు కూడా వినిపించాయి.

అయితే లేటెస్ట్ సంగతేమిటంటే, ఆ టీజర్ ఈ వర్థంతికి విడుదల కాదేమో అన్నది. దానికి సంబంధించి ఇంకా వర్క్ బ్యాలెన్స్ వుందని తెలుస్తోంది. బహుశా మాంచి రోజున, మాంచి ఫంక్షన్లో విడుదల చేస్తారేమో?

 బయోపిక్ ఫస్ట్ లుక్ లీకైంది

ఒక విధంగా ఎన్టీఆర్ బయోపిక్ కు ఇదే ఫస్ట్ లుక్ అనుకోవాలి. ఆ సినిమాకు సంబంధించి ఇంతవరకు అధికారికంగా ఏదీ బయటకు రాలేదు. వార్తలు వినిపించడమే తప్ప ప్రకటన లేదు.

అలాంటిది ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా రేపు (గురువారం) ఆ సినిమాకు సంబంధించిన ప్రకటన ఒకటి పత్రికల్లో రాబోతోంది. కానీ ఎవరో ఔత్సాహికులు ముందుగానే దాన్ని లీక్ చేసారు. దాంతో రేపు విడుదల చేయాల్సిన ఈ లుక్ ను ఈరోజే లేట్ నైట్ విడుదల చేసేసారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?