Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పుట్టిన రోజు తర్వాత పవన్ ఫారిన్ ట్రిప్

పుట్టిన రోజు తర్వాత పవన్ ఫారిన్ ట్రిప్

ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు పవన్ కల్యాణ్. అయితే పుట్టినరోజు తర్వాత పాలిటిక్స్ పై అంతగా ఫోకస్ పెట్టే సమయం పవన్ కు దొరక్కపోవచ్చు. ఎందుకంటే తన కొత్త సినిమాకు సంబంధించి ఈ హీరో భారీ ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేశాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 25వ సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. సెప్టెంబర్ 2న తన పుట్టినరోజు వేడుక పూర్తయిన వెంటనే ఈ మూవీకి సంబంధించి భారీ షెడ్యూల్ కోసం యూరోప్ వెళ్లబోతున్నాడు. 

కథ ప్రకారం సినిమాకు సంబంధించిన కీలకమైన షెడ్యూల్ ఇదే. ఈ షెడ్యూల్ లోనే మ్యాగ్జిమమ్ షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. నిజానికి ఈ ఫారిన్ షెడ్యూల్ ను చాలా రోజుల కిందటే ప్లాన్ చేశారు. కానీ పవన్ కు ఉన్న మిగతా కమిట్ మెంట్స్ కారణంగా అది వాయిదాపడుతూ వచ్చింది. మరోవైపు సినిమా బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోవడంతో ఈసారి వీలైనంత త్వరగా ఫారిన్ షెడ్యూల్ ను కంప్లీట్ చేయాలని నిర్ణయించారు. అది పూర్తయితే తప్ప సినిమా షూటింగ్ పై ఓ క్లారిటీ రాదు.

సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ లేదా ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారు. ఇక అక్కడ్నుంచి మూవీ అఫీషియల్ ప్రమోషన్ స్టార్ట్ అయినట్టే. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. పవన్ సరసన కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిరుథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?