Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూరి ఇంకో ఛాన్స్‌ ఇస్తున్నాడా.?

పూరి ఇంకో ఛాన్స్‌ ఇస్తున్నాడా.?

'రోగ్‌' సినిమాతో వెలుగులోకొచ్చిన బ్యూటీ ఏంజెలా. అంతకు ముందే 'జ్యోతిలక్ష్మి' అనే సినిమాలో నటించినా, 'రోగ్‌' సినిమాతోనే ఈమెను హైలైట్‌ చేశారు. పూరి కనెక్ట్స్‌ ద్వారా ఏంజెలాని లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చారుగానీ, ఆశించిన స్థాయిలో ఏంజెలా వెండితెరపై సక్సెస్‌ కాలేకపోయింది. హీరోయిన్‌ గా తొలి సినిమా 'రోగ్‌' తేడా కొట్టేయడంతో, ఈ బ్యూటీ తెరమరుగైపోయింది. 

కానీ, పూరి  జగన్నాథ్‌ - ఏంజెలాకి మరో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడట.  అదేంటన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. టాలీవుడ్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడ్తోన్న గాసిప్‌ ప్రకారం  చూస్తే, బాలకృష్ణతో పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తోన్న సినిమా కోసం ఏంజెలాని ఎంపిక చేశారట. ఇదెంత నిజమో తేలాల్సి వుంది. అక్కడికేదో ఏంజెలా సూపర్బ్‌ పాపులర్‌ అన్నట్టు, 'సస్పెన్స్‌' మెయిన్‌టెయిన్‌ చేస్తోంది పూరి  కనెక్ట్స్‌. 

బాలకృష్ణతో పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తోన్న సినిమాకి పూరి కనెక్ట్స్‌ ద్వారానే చాలావరకు నటీనటుల ఎంపిక జరిగింది, జరుగుతోంది కూడా. సినిమా ప్రస్తుతం పోర్చుగల్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది.  చాలా పెద్ద షెడ్యూల్‌ ఇది. షూటింగ్‌ వ్యవహారాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తోంది పూరి కనెక్ట్స్‌లో భాగస్వామి అయిన ఛార్మి. ఈ సినిమాలో ఛార్మి కూడా కన్పించనుందనే గాసిప్‌ విన్పిస్తోందనుకోండి.. అది వేరే విషయం. 

ఇంతకీ, ఏంజెలా -  బాలయ్యతో కలిసి తెరపై కన్పించబోతోందా. ? అదే నిజమైతే, పూరి ఆమెకు ఈ సినిమాతో బ్రేక్‌ ఇస్తాడా.? వేచి చూడాల్సిందే. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?