Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రైతు కథ అదుర్స్ అంట

రైతు కథ అదుర్స్ అంట

బాలకృష్ణ 101 వ సినిమా రైతు. ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించబోతున్నది, సాక్షి రామ్ రెడ్డి కథ అందిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య వందో సినిమా మరో రెండు మూడు నెలల్లో ఫినిష్ కాగానే ఈ ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది. ఆ లోగా కృష్ణవంశీ తన నక్షత్రం సినిమాను పూర్తి చేసేస్తారు. 

ఇదిలా వుంటే గతంలో కేవలం బాలయ్యకు మాత్రమే వినిపించిన ఈ కథను సాక్షి రామ్ రెడ్డి ఇప్పుడు సినిమా నిర్మాతలయిన 14 రీల్స్ వాళ్లకు కూడా వినిపించినట్లు తెలుస్తోంది. సినిమా కథ సూపర్ గా వుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.  బాలయ్యకు సూటయ్యే అన్ని ఎమోషన్లు, షేడ్స్ కథలో వున్నాయని, ఇది మంచి సినిమా అవుతుందని కథ విన్నవాళ్లు భావిస్తున్నట్లు వినికిడి. 

బహుశా కథ ఇంత బాగా వున్నందునే కావచ్చు, 100 వ సినిమాగా చేయాలనుకున్నారు బాలయ్య. కానీ అనుకోకుండా గౌతమీ పుత్ర శాతకర్ణి ఫీల్డ్ లోకి వచ్చింది. మరి ఇలాంటి కథను కృష్ణవంశీ మరి ఇంకెంతగా డీల్ చేస్తారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?