Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాజమౌళికి గ్రాఫిక్స్ అంటే మొహం మొత్తిందా?

రాజమౌళికి గ్రాఫిక్స్ అంటే మొహం మొత్తిందా?

తెలుగు సినీ ప్రేక్షకుల్లో బాహుబలి మేనియా ముగిసిపోయింది. ఆ అధ్యాయం ముగిసిన తర్వాత.. ప్రేక్షకులు ఇప్పుడు మళ్లీ రాజమౌళి నుంచి కొత్త సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి రాజమౌళి ఎలాంటి అద్భుతాన్ని మనకు అందించబోతున్నాడా.. అనే ఆశతో ఉన్నారు. రాజమౌళి తర్వాతి సినిమా ఏమిటి? ఈసారి ఏ హీరోతో చేయబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తో రాజమౌళి సినిమా ఎప్పుడుంటుంది? మెగా కాంపౌండ్ రాజమౌళి తో ప్రాజెక్టుకోసం చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడిదాకా వచ్చాయి? ఇలాంటి ప్రశ్నలు తరచుగా సినీజీవుల మధ్య నడుస్తున్నాయి.

అయితే తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తు్న్న సంగతులు గమనిస్తోంటే.. రాజమౌళి.. గ్రాఫిక్స్ తో సంబంధం లేని కథతోనే తర్వాతి సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. గ్రాఫిక్స్ ఈ హడావిడి, ఈ గందరగోళం... మామూలుగా  మనం చూసి ఎరగని, ఊహకు కూడా అందని మరో ప్రపంచాన్ని మన ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేయడం... ఇలాంటి ఊసులేమీ లేకుండా రాజమౌళి తర్వాతి సినిమాను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చక్కటి సామాజిక సందేశం ఇచ్చే కథాంశంతో.. సింపుల్ గా ఉండే కథ కోసం ఆయన పురమాయించారుట. అయితే హీరో ఎవరనే సంగతి మాత్రం బయటకు రావడం లేదు. 

రాజమౌళి చిత్రాలకు  సాధారణంగా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తూ ఉంటారు. ఆయన మాటల్లోనే ఈ సంగతి కూడా బయటకు వచ్చింది. సామాజిక సందేశంతో కూడిన , గ్రాఫిక్స్ కు సంబంధం లేని కథ ఏదైనా తయారు చేయాల్సిందిగా విజయేంద్ర ప్రసాద్ ను రాజమౌళి కోరారుట. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారుట విజయేంద్ర ప్రసాద్. తమిళనాడులో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్న మెర్సల్ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించిన విజయేంద్ర ప్రసాద్.. ఆ సంచలనానికి తాను ఒక రకంగా కారణం అయ్యారు. అది పూర్తిగా సామాజిక సందేశంతోనే కథ తయారు కాబోతోందిట.

దర్శకుడిగా తన కెరీర్ ప్లాన్, దేని తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలనే ఎంపిక విషయంలో రాజమౌళి చాలా పరిణతి ప్రదర్శిస్తుంటారు. ప్రజలు విపరీతంగా ఆదరించిన ఒక బ్లాక్ బస్టర్ ను అందించిన తర్వాత, వారు తన మీద ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోకుండా.. ఒక సింపుల్ సినిమా తీసి.. తన మీద ప్రేక్షకుల ఇంటరెస్ట్ ను సస్టెయిన్ చేయడం ఆయనకు కొత్త కాదు. గతంలో మగధీర తర్వాత ఆయన అదేరీతిలో మర్యాద రామన్న చేసి హిట్ కొట్టారు. అదే క్రమంలో ఈసారి బాహుబలి తర్వాత.. సింపుల్ , చిన్న సినిమానే ఉండబోతోందన్నమాట. కాకపోతే.. దీనిలో సామాజిక సందేశాన్ని కూడా మేళవించి రాజమౌళి అలరిస్తారని ఆశించొచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?