Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సెన్సిటివ్ సమంత

సెన్సిటివ్ సమంత

రభస ఫలితం ఎవరికి ఎలా వుందో తెలియదు కానీ సమంత మాత్రం చాలా ఫీలవుతోందట. సహజంగానే సున్నితంగా వుండే సమంత, ఈ సినిమాకు సంబంధించి సమీక్షల్లో తనపై వచ్చిన కామెంట్లకు చాలా బాధపడుతోందట. ప్రణీతతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నపుడు ఏ మాత్రం ముందు వెనుక ఆడలేదు. కానీ ఇప్పడు తను బాగా చేయలేదని, బాగా లేదని కామెంట్ లు వస్తుంటే మాత్రం ఎందుకిలా జరిగిందని తెగ మధనపడుతోందట. 

సంతోషం అవార్డుల ఫంక్షన్ కోసం హైదరాబాద్ వచ్చిన సమంత ఈ తరహా కామెంట్ లు చదివి, తాను ది బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికే ఎప్పుడూ చూస్తానని, డైరక్టర్ ఎంత రాబట్టుకుంటే అంతా చేస్తానని, లేని దానికి తనను టార్గెట్ చేస్తున్నారని కొందరి దగ్గర బాధపడిందట. , అల్లుడు శీను, సికిందర్, రభస అన్నింట్లో స్క్రిప్ట్, డైరక్షన్ మేరకు తాను చేయడమే తప్ప, పాడుచేయలనో,. మరో ఉద్దేశమో తనకు లేదని ఆమె సన్నిహితుల దగ్గర చెప్పుకుందట. 

క్యారెక్టర్ ప్రకారం రభసలో తనది మోడ్రన్ క్యారెక్టర్ అని, దాని ప్రకారం ఎలా చేయమంటే అలా చేసానని, అన్ని సినిమాల్లో ఏమాయచేసావె, మనం లాంటి క్యారెక్టర్లే దొరకవని, దొరికిన వాటికి వీలైనంత న్యాయం చేయడానికే చూస్తానని ఆమె అంటోందట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?