Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సుకుమార్ పైనే భరోసా

సుకుమార్ పైనే భరోసా

రంగస్థలం స్టిల్స్ గతంలో చాలా బయటకు వచ్చాయి. ఇప్పుడు ఇంకా వస్తున్నాయి. రామ్ చరణ్ గళ్ల లుంగీ, ముతక చొక్కా, అది కూడా అంతగా గ్లామరస్ గా లేని డ్రెస్ లతో, గెటప్ తో కనిపిస్తున్నాడు. సుకుమార్ ఎంత చెపితే అంతా, ఎలా చెపితే అలా నిర్మాతలు, రామ్ చరణ్ నమ్మి చేసుకుంటూ వచ్చారు. ఏడాదికి పైగా సినిమాను చెక్కుకుంటూ వచ్చారు. 

పైకి ఎన్ని చెప్పినా సినిమా లోగో డిజైన్ చూసి కాస్త ఆలోచనలు మొదలైన మాట వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ముఫైలు దాటిన వారికి కూడా 1985నాటి జ్ఞాపకాలు పదిలంగానే వుంటాయి. ఆనాటి జ్ఞాపకాలు జస్ట్ అలా ఓ సారి చూసుకుంటే బాగానే వుంటుంది. ఇప్పటికే ఇలాంటి జ్ఞాపకాలు ఫేస్ బుక్ లో, వాట్సప్ లో వందలాది పోస్ట్ ల రూపంలో చక్కర్లుకొడుతూనే వుంటాయి. కానీ సమస్య ఒక్కటే రాను రాను జనం అభిరుచులు మారుతున్నాయి. 

ఇప్పుడు జనం వినోదం, కొత్తదనంతో కూడిన సినిమాలు ఇష్టపడుతున్నారు. పెళ్లి చూపులు, మెంటల్ మదిలో వంటి నాచురల్ టేకింగ్ ను ఇష్టపడుతున్నారు. మెలోడ్రామాను చూడ్డం లేదు. పైగా విలేజ్ పాలిటిక్స్, విలేజ్ డ్రామా అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ విషయంలో సుకుమార్ భరోసా ఏదో వుండే వుంటుంది. సినిమాలో ఏమోషన్స్ పీక్స్ లో వుంటాయని, కామెడీ అదిరిపోతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. సుకుమార్ ఓ అద్భుతమైన సబ్జెక్ట్ తయారుచేసారని, దాని కోసం ఏడాది పాటు కిందా మీదా అయిపోయారని అంటున్నారు.

కానీ ఇప్పుడు బయటకు వస్తున్న ఏ స్టిల్ చూసినా రామ్ చరణ్ గళ్ల లుంగీ, ముతక చొక్కా, మాసిన గడ్డంతోనే కనిపిస్తున్నారు. సమంత స్టిల్స్ ఇంకా బయటకు రాలేదు. అవి వస్తే ఏమైనా గ్లామర్ వుంటుందేమో చూడాలి. సినిమాలో చాలా వరకు ఓ మాంటేజ్ సాంగ్ అలా అలా తరచు వెన్నాడుతూ వుంటుందని తెలుస్తోంది. ఆ సాంగ్ అంతా పల్లెటూరు, పాలిటిక్స్, సమస్యలు వుంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమాలో విలేజ్ పాలిటిక్స్ కూడా బాగానే వుంటాయని వినికిడి.

అయితే ఇదే సమయంలో మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. రంగస్థలం పక్కా కమర్షియల్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ మూవీ అని. అయితే గ్లామర్ పార్ట్ తక్కువ వుంటుందని అంటున్నారు.

మరి వినిపిస్తున్న గుసగుసలు, వార్తలు నిజమైతే రంగస్థలం సినిమా ఎలా వుండబోతుందో అన్న ఆసక్తితో పాటు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ జనరేషన్ ప్రేక్షకులు ఈ ఓల్డ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ ను, డీ గ్లామర్ వ్యవహారాలను ఏ మేరకు ఆదరిస్తారు అన్నది అనుమానం. సుకుమార్ టేస్ట్ మీద అనుమానం లేదు. సామర్థ్యం మీద అనుమానం లేదు. కానీ ఆయన టేస్ట్ ను ప్రేక్షకులు ఏ విధంగా స్వీకరిస్తారన్నదే చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?