Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

సన్నీలియోన్‌ కథలో అదే కీలకమట

సన్నీలియోన్‌ కథలో అదే కీలకమట

సన్నీలియోన్‌.. పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఇంటర్నెట్‌ సెర్చ్‌ ఇంజన్స్‌లో సన్నీలియోన్‌ పేరు టైప్‌ చేస్తే ఎడా పెడా బూతు బొమ్మలు కనిపించేస్తాయి. ఇప్పుడంటే బాలీవుడ్‌ హీరోయిన్‌గానీ, ఒకప్పుడు ఆమె పోర్న్‌ స్టార్‌. అడల్ట్‌ సినిమాల్లో నటించి, పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న సన్నీలియోన్‌, భారతదేశానికి చెందిన మూలాలున్నదే. 

భర్త డేనియల్‌ వెబర్‌ని వెంటేసుకుని ముంబైకి వచ్చి, ఇక్కడే సెటిలైపోయిన ఈ ఒకప్పటి పోర్న్‌స్టార్‌, సరదాగా తన జీవిత చరిత్రను వెండితెరపై చూసుకోవాలనుకుందట. ఏ సినిమా డిస్కషన్స్‌లో అయినాసరే, ఆమె తన జీవిత కథ గురించే ప్రస్తావిస్తూ వుండేదట. రొటీన్‌ కథల నుంచి కాస్త డిఫరెంట్‌గా ఆలోచిస్తే, సన్నీలియోన్‌ జీవితం వెండితెరపై సరికొత్త కథ అవకుండా వుంటుందా.? 

అందుకే, ఓ ఔత్సాహిక దర్శకుడు ఈ చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు. నిర్మాత ఎవరో కాదు, సన్నీలియోన్‌ భర్తేనట. సినిమా ఫంక్షన్లకు తనతోపాటు తన భర్తని తీసుకెళ్ళడం సన్నీలియోన్‌కి బాగా అలవాటు. అలా, సినిమా ప్రొడక్షన్‌పైనా, పబ్లిసిటీపైనా, మీడియా రిలేషన్‌పైనా సన్నీలియోన్‌, తన భర్తకి అవగాహన కల్పించింది. ఇంత పెద్ద కథ నడిచింది, సన్నీలియోన్‌ బయోపిక్‌కి సంబంధించి. 

త్వరలోనే సెట్స్‌ మీదకు రానున్న ఈ సినిమాలో, అత్యంత కీలకమైన విషయం సన్నీలియోన్‌ అడల్ట్‌ స్టార్‌గా పోర్న్‌ సినిమా రంగంలో వెలుగు వెలగడమేనట. మరీ అంత పచ్చిగా, బాలీవుడ్‌లో సినిమాలు తీయలేరు కదా.! అయినసరే, వున్నంతలో హద్దులు దాటేసేలా ఈ సినిమా వుండనుందని తెలుస్తోంది. సన్నీలియోన్‌తోపాటు ఆమె భర్త వెబర్‌ (ఈయనా ఒకప్పుడు పోర్న్‌ ఇండస్ట్రీలోనే వున్నాడు) ఈ సినిమాలో నటిస్తాడు. మొత్తంగా అన్ని భారతీయ భాషల్లోనూ విడుదలయ్యేలా ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారట. 

నవంబర్‌ లేదా డిసెంబర్‌లో పట్టాలెక్కే ఈ సినిమాకి 'సన్నీలియోన్‌.. పోర్న్‌స్టార్‌ బన్‌గయా బాలీవుడ్‌ స్టార్‌' కన్నా యాప్ట్‌ టైటిల్‌ ఇంకేముంటుంది.?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?