Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి ఏమయ్యింది.?

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి ఏమయ్యింది.?

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తాజా చిత్రం 'కబాలి' విడుదలకు సిద్ధమవుతోంది. తమ అభిమాన హీరో సినిమా విడుదలవుతోందంటే రజనీ అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆ సందడి స్థానంలో ఇప్పుడు ఆందోళన కన్పిస్తోంది. కారణం, రజనీకాంత్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారనే ఊహాగానాలే. 

ప్రస్తుతం రజనీకాంత్‌ విదేశీ పర్యటనలో వున్నారు. వైద్య చికిత్స కోసమే ఆయన విదేశాలకు వెళ్ళారంటూ గుసగుసలు గుప్పుమంటున్నాయి. ఆ మధ్య రజనీకాంత్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చెన్నయ్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకుని, ఆ తర్వాత విదేశాలకు వెళ్ళి, అక్కడా ట్రీట్‌మెంట్‌ తీసుకుని.. ఎలాగైతేనేం కోలుకున్నారు. 

ఇంతకీ, రజనీకాంత్‌ అనారోగ్య సమస్య నిజమేనా.? నిజమే అయితే, ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్య వెంటాడుతోంది.? ఇలా మళ్ళీ కొత్త కొత్త ప్రశ్నలు. అన్నిటికీ సమాధానం, కిడ్నీ సమస్యతో ఆయన బాధపడుతున్నారనీ, ట్రాన్స్‌ప్లాంట్‌ తప్ప ఇంకో మార్గం లేదని వైద్యులు స్పష్టం చేయడంతో, దాని కోసమే రజనీకాంత్‌ విదేశాలకు వెళ్ళారనే గాసిప్‌ విన్పిస్తోంది. 

ఈ గాసిప్స్‌ని ఇప్పటికే రజనీకాంత్‌ కుటుంబం ఖండించేసింది. కానీ, రజనీకాంత్‌ స్వయంగా తమకు విషయం తెలియజేస్తే తప్ప తమ మనసు కుదుటపడదని అభిమానులు అంటున్నారు. రజనీకాంత్‌ కూడా మనిషే కదా. కానీ, ఆయన సూపర్‌ స్టార్‌. లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులు ఆయన ఆరోగ్యంగానే వున్నారనే వార్త వినేందుకు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరి, రజనీకాంత్‌ వారి ఉత్కంఠకు తెరదించుతారా.? ఆరోగ్యంగానే వున్నానని సమాచారమిస్తారా.? వేచి చూడాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?