Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

టామ్ బాయ్ హీరోయిన్.. సిట్టింగుల్లో కంపెనీ ఇస్తుందా!

ఆమె ఇప్పుడు తెలుగు బాగానే ఆఫర్లు ఉన్న ఒక హీరోయిన్. పశ్చిమ భారతదేశం నుంచి టాలీవుడ్ వైపు వచ్చిన భామ. తన నటనతో ప్రేక్షకులను, దర్శక నిర్మాతలను కట్టి పడేస్తూ ఆఫర్లను సంపాదించుకొంటోందామె. అంతే కాదు... ఆమెలో దర్శక, నిర్మాతలను కట్టిపడేసే గుణాలు మరికొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే..ఆమె చాలా సోషల్ గా ఉండటం! సోషల్ గా అంటే... ఆమెతో సినిమా చేసే వాళ్లకు తన కంపెనీని మంచి ఆస్వాదనగా మారుస్తుందామె. ఏ విధంగా అంటే.. కలిసి మందుకొట్టడం వరకూ వెళ్లిపోతుంది వ్యవహారం! 

ఆమె కంపెనీ ఆ విధంగా సినిమా యూనిట్ లోని ముఖ్యులకు ఆనందమయంగా మారుతుంది. అయినా ఆమె వచ్చిన నేపథ్యాన్ని బట్టి చూస్తే  ఒక హీరోయిన్ మందు కొట్టడం అనేది పెద్ద విడ్డూరమైన విషయం ఏమీ కాదు. సన్నిహితులైన మగాళ్ల కంపెనీలో మందు కొట్టడం చాలా కామన్. ఆమె అలా న్యాచురల్ గా నడుచుకోవడమే టాలీవుడ్ లో ఆమెకు మరింత గ్రిప్ ను పెంచుతోంది.

ఏదో పార్టీల్లో వైన్ పుచ్చుకొని డాన్సులు వేసే హీరోయిన్లను టాలీవుడ్ చాలా మందినే చూసింది. అయితే ఇలా ప్రొఫెషనల్ లా కూర్చొని కంపెనీ ఇచ్చే భామను మాత్రం ఇప్పుడిప్పుడే చూస్తున్నామని ఆమె కంపెనీని పంచుకొన్న వాళ్లు అంటున్నారు. అయితే హీరోయిన్ కు మాత్రం ఇవన్నీ అర్థం కావడం లేదు. అంత సోషల్ తను. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?