Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వాళ్లు వాళ్లు ఒక్కటే జనమే వెర్రాళ్లు

వాళ్లు వాళ్లు ఒక్కటే జనమే వెర్రాళ్లు

మెగా జనాల ఫంక్షన్ ఎక్కడ జరిగినా అభిమానుల గోల ఒకటే..పవర్ ..పవర్..పవర్ స్టార్. చిరంజీవి కూడా ఒకటి రెండు సార్లు ఈ విషయమై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు వున్నాయి. అలాగే చిరు వస్తే పవన్ రాకపోవడం, చిరు పవన్ ఎడమొహం..పెడమొహం వంటి సందర్భాలు గతంలో వున్నాయి. ఇది గమనించి చాలా మంది అన్న దమ్ములకు చెడిందని రకరకాలుగా అనుకున్నారు.

 అయితే పవన్ కు అన్న ఇంటితో సంబంధాలు శుభ్రంగా, భద్రంగా వున్నాయని, అవి చెడిపోలేదని గతంలోనే గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది.  గడచిన కొంతకాలంగా పవన్ వైఖరిలో మార్పువచ్చింది. తరుచు అన్న చిరంజీవి ప్రస్తావన తేవడం, ఆయనను ప్రశంసించడం జరగుతోంది. ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ హీరో సినిమా ప్రకటించారు.

 మరి ఇప్పుడు ఇన్నాళ్లు అన్న దమ్ముల వైఖరి గమనించి రెండుగా చీలిన మెగాఫ్యాన్స్ ఏమనుకుంటారో? వాళ్లు కలిసాక మనకేంటి అనుకుని హాయిగా కలిసిపోవడమే. అవును ఇంతకీ ఇన్నాళ్లు మెగా ఫంక్షన్లకు దూరంగా వున్న పవన్ ఇప్పుడు రామ్ చరణ్ సినిమా ఓపెనింగ్ కు అన్న పక్కన నిల్చోవాల్సిందేగా. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?