Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

'కాటమరాయుడు' చిత్రానికి ఊహించినట్టుగానే భారీ ఆరంభ వసూళ్లు వచ్చాయి. సరైన పబ్లిసిటీ లేకపోయినా, పేరున్న దర్శకుడు కాకపోయినా, అప్పటికే తెలుగులోకి అనువాదమైన చిత్రానికి రీమేక్‌ అయినా పవర్‌స్టార్‌ పేరు చెప్పి 'కాటమరాయుడు' ఓపెనింగ్‌కి మాత్రం లోటు రాలేదు. 

అయితే నాసిరకం కథా విలువలు, నిర్మాణ విలువలతో ఈ చిత్రం మంచి టాక్‌ తెచ్చుకోలేకపోయింది. పూర్తిగా పవన్‌ ఇమేజ్‌ బలం మీద డిపెండ్‌ అయి ముందుకి వెళుతోంది. తొలి వారంలోనే యాభై కోట్లకి పైగా షేర్‌ రాబట్టిన పవన్‌ కళ్యాణ్‌ తన ఇమేజ్‌ బలాన్ని చూపించాడు కానీ తననుంచి ఆశిస్తోన్న బ్లాక్‌బస్టర్‌ని మాత్రం ఇవ్వలేకపోయాడు.

ఇంకా రికవర్‌ కావాల్సిన మొత్తం చాలానే వుండడంతో రెండవ వారాంతంలోను కాటమరాయుడు జోరు కొనసాగుతుందని కొన్నవాళ్లు ఆశిస్తున్నారు. కొత్తగా వచ్చిన గురు, రోగ్‌, డోర లాంటి చిత్రాలు కాటమరాయుడుపై ఎంత ప్రభావం చూపిస్తాయనేది కూడా ఆసక్తికరమే. మాస్‌ ప్రేక్షకుల అండతో కాటమరాయుడుని సేఫ్‌ జోన్‌కి దగ్గరగా తీసుకెళతాడని బయ్యర్లు ఆశలు పెట్టుకున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?