Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

'పైసా వసూల్‌' టైటిల్‌కి తగ్గ సినిమా అవలేకపోయింది. చూసిన ప్రేక్షకులకి పైసా వసూలయిన ఫీల్‌ ఇవ్వలేదు, పెట్టుబడి పెట్టిన బయ్యర్లకీ పైసలు వసూలవడం లేదు. బాలకృష్ణని తేడా సింగ్‌గా విచిత్రమైన క్యారెక్టరైజేషన్‌తో కొత్తగా అయితే చూపించాడు కానీ పూరిజగన్నాధ్‌ షరా మామూలుగా కథ లేకుండా సినిమా తీసేసాడు. దీంతో పైసా వసూల్‌ ఒక రోజు ముచ్చట అయిపోయింది.

శనివారంతో మొదలు పెట్టి ప్రతి రోజూ వసూళ్లు తగ్గుతూనే పోయాయి తప్ప మళ్లీ పెరగలేదు. ఈ చిత్రం ఫ్లాప్‌ అవడం అర్జున్‌రెడ్డికి మరింత కలిసి వచ్చింది. రెండవ వారంలో కూడా డీసెంట్‌ షేర్లు రాబట్టుకుని అర్జున్‌ రెడ్డి మరిన్ని లాభాలు వెనకేసుకుంది. ఆగస్ట్‌ సినిమాల్లో ఆనందో బ్రహ్మ కూడా హిట్‌ స్టేటస్‌ తెచ్చుకోగా, జులైలో వచ్చిన ఫిదా యాభై రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుని దాదాపు యాభై కోట్ల షేర్‌ తెచ్చుకుంది.

ఈవారంలో యుద్ధం శరణం, మేడమీద అబ్బాయి చిత్రాలు రిలీజయ్యాయి. చైతన్యకి దక్కకుండా పోతున్న ఆ ఘన విజయం యుద్ధం శరణంతో వస్తుందో లేదో అనేది చూడాలి. అలాగే అల్లరి నరేష్‌ పరాజయాలకి మేడమీద అబ్బాయి బ్రేకులేయాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?