Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

జవాన్‌ చిత్రానికి ఆరంభ వసూళ్లు బాగానే వచ్చినా కానీ ఈమధ్య వచ్చిన చాలా చిత్రాల్లానే సోమవారానికి డ్రాప్‌ అయిపోయింది. పరాజయం దిశగా పయనిస్తోన్న ఈ చిత్రం సాయి ధరమ్‌ తేజ్‌ ఆశలపై నీళ్లు చల్లేసింది. దసరా టైమ్‌కి రావాల్సిన ఈ చిత్రాన్ని ఇంత డిలే చేయడం, రాంగ్‌ టైమ్‌లో రిలీజ్‌ చేయడం కూడా తక్కువ వసూళ్లకి ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

గత వారమే విడుదలైన ఆక్సిజన్‌ చిత్రం డిజాస్టర్‌ అయింది. గోపిచంద్‌ కెరీర్‌కి ఈ చిత్రంతో మరో దెబ్బ తగిలింది. చాలా కాలం పాటు విడుదల కాకుండా నిలిచిపోయిన ఈ చిత్రం మరీ తొంభైల కాలం నాటి కథతో విసిగించింది. దీంతో పాటే విడుదలైన విజయ్‌ ఆంటోనీ చిత్రం ఇంద్రసేన కూడా ఫ్లాప్‌ టాక్‌ మూటగట్టుకుంది.

బిచ్చగాడుతో సంచలనం చేసిన విజయ్‌ ఆంటోని మళ్లీ అది రిపీట్‌ చేయలేకపోతున్నాడు. ఈవారం సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌, మళ్లీ రావా తదితర చిత్రాలు విడుదలయ్యాయి కానీ వేటికీ చెప్పుకోతగిన ఓపెనింగ్‌ రాలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?