Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

లాస్ట్‌ వీక్‌ రిలీజ్‌ అయిన సినిమాల్లో 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' డీసెంట్‌ టాక్‌ తెచ్చుకుంది. పలు ఏరియాల్లో బ్రేక్‌ ఈవెన్‌ దిశగా సాగుతోన్న ఈ చిత్రం ఈ వీకెండ్‌లోను బాగా ఆడినట్టయితే సేఫ్‌ వెంఛర్‌ అయిపోతుంది. విజయ్‌ దేవరకొండ నటించిన 'ద్వారక' చిత్రానికి ఏ సెంటర్స్‌లో ఓపెనింగ్‌ ఫర్వాలేదనిపించింది.

కానీ సినిమా నిరాశ పరిచే సరికి ద్వారక బాక్సాఫీస్‌ వద్ద కష్టాలు పడుతోంది. మాస్‌ సినిమాతో బౌన్స్‌ బ్యాక్‌ అవుదామని చూసిన మంచు మనోజ్‌ని 'గుంటూరోడు' తీవ్రంగా నిరాశ పరిచింది. వరుస విజయాలు అందుకుంటోన్న సాయి ధరమ్‌ తేజ్‌కి 'విన్నర్‌'తో పెద్ద ఫెయిల్యూర్‌ ఎదురైంది. 

ఫిబ్రవరి సినిమాల్లో నేను లోకల్‌, ఘాజీ మాత్రమే హిట్‌ కాగా ఎక్కువ శాతం చిత్రాలు పరాజయం పాలయ్యాయి. కొన్ని మాత్రం యావరేజ్‌ అనిపించుకున్నాయి. సమ్మర్‌ స్టార్ట్‌ అయ్యేసరికి పెద్ద సినిమాల పరంపర మొదలవుతుంది కనుక ఈలోగా చిన్న చిత్రాలు పెద్ద సంఖ్యలో రిలీజ్‌ అవుతున్నాయి. ఈ వీకెండ్‌లో అయిదు గుర్తించదగ్గ చిన్న చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?