గడచిన రెండుమూడు వారాలుగా, ఈ వారంతో కలిపి దాదాపు 20కి పైగా చిన్న సినిమాలు విడుదలయ్యాయి. ఏవీ పెద్దగా టాక్ తెచ్చుకోలేదు. టాక్ తెచ్చుకున్న ఒకటి రెండు కలెక్షన్ల కోసం కిందా మీదా అవుతున్నాయి. ఇలాంటి సమయంలో పిడుగులా వచ్చి పడుతోంది సూపర్ స్టార్ రజనీ కాంత్ లింగా. ఇప్పుడు దీనికోసం థియేటర్ల వేట ప్రారంభమైంది.
దాదాపు కొన్నవాళ్లంతా గట్టివాళ్లే. అందువల్ల థియేటర్ల సమస్య రాదు. కనీసం 600 నుంచి 800 స్క్రీన్లు వేస్తారని అంచనా, అంతకన్నా ఎక్కువ వేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. అంటే దాదాపు ఈ చిన్న సినిమాలన్నీ థియేటర్ల నుంచి లేచిపోతాయి. కానీ లింగా తరువాత 19 న పెద్దగా సినిమాలు లేవు. 25న ఇప్పటికి రెండు ఖరారయ్యాయి. 19న కానీ, 25 న కానీ అవును 2 వేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు.
అంటే లింగా విడుదల తరువాత రెండు వారాలకు థియేటర్లు కొంత వరకు ఖాళీ చేయాలి. ఎందుకంటే ఈ రెండుసినిమాలకు కలిపి కనీసం వెయ్యి పన్నెండువందల స్క్రీన్లు కావాలి. లింగా, ఇంకా 25న వచ్చే సినిమాలు ఏ మాత్రం మంచి టాక్ తెచ్చుకున్నా కనీసం రెండు మూడు వారాలు థియేటర్లలో వుండిపోతాయి. అంటే పండుగకు వచ్చే టెంపర్ కు కాస్త ఇబ్బందే. గోపాల గోపాలకు అంటే సురేష్ వాళ్ల థియేటర్లు కొంత వరకు ఆదుకుంటాయి.