కోటీశ్వరుడు నేపథ్యంలో సినిమా?

నాగార్జునకు సినిమాలు ఎంత పాపులారిటీ ఇచ్చాయో, అంతకు అంతా పేరు తెచ్చిన షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఆ షో కాన్సెప్ట్, దాన్ని నాగార్జున తనదైన స్టయిల్ తో తెలుగులోకి మార్చిన విధానం అన్నీ…

నాగార్జునకు సినిమాలు ఎంత పాపులారిటీ ఇచ్చాయో, అంతకు అంతా పేరు తెచ్చిన షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఆ షో కాన్సెప్ట్, దాన్ని నాగార్జున తనదైన స్టయిల్ తో తెలుగులోకి మార్చిన విధానం అన్నీ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఆ షో రెండో రౌండ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ షో బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తే ఎలా వుంటుందన్నఆలోచనలో నాగార్జున వున్నట్లు తెలుస్తోంది. 

ఓ యువ ప్రేమ జంట..పెళ్లి చేసుకోవాలనుకోవడం, డబ్బులు అవసరం పడడం, దాంతో ఈ షో లో పాల్గొని గెలవాలనుకోవడం..అందుకు పడ్డ టెన్షన్లు..ఇలా ఓ కథ అల్లితే ఎలా వుంటుందని తన స్టూడియో స్టోరీ డిపార్ట్ మెంట్ కు చెప్పాడని వినికిడి. వారు ఆ మేరకు ఆలోచిస్తున్నారట. సరైన కథ తయారైతే, ఈ సినిమా సెట్ మీదకు వెళ్లిపోతుంది. నాగార్జన ఈ సినిమాలో కోటీశ్వరుడు షో చేసిన పాత్రనే పోషిస్తారు. యువజంటగా ఎవరైనా కావచ్చు.