ఆశియన్ నా?..దిల్ రాజునా?

లయన్ సినిమా అమ్మకం ఇంకా మాటల స్టేజ్ లోనే వుంది. అన్ని ప్రాంతాలకు మాట ఇచ్చిన జనాలు వున్నారు కానీ ఇంకా రేట్లు ఫైనల్ కాలేదు. మరోపక్క ఎలాగైనా సినిమాను ఫస్ట్ వీక్ లో…

లయన్ సినిమా అమ్మకం ఇంకా మాటల స్టేజ్ లోనే వుంది. అన్ని ప్రాంతాలకు మాట ఇచ్చిన జనాలు వున్నారు కానీ ఇంకా రేట్లు ఫైనల్ కాలేదు. మరోపక్క ఎలాగైనా సినిమాను ఫస్ట్ వీక్ లో విడుదల చేయాలని డీటీఎస్, డబ్బింగ్ చేయిస్తున్నారు. నైజాం లో సినిమా ఎవరి చేతికి వెళ్తుందన్నది ఆసక్తి కరంగా వుంది. 

నిన్న మొన్నటి దాకా ఆశియన్ సునీల్ పేరు ఒక్కటే వినిపించింది. సునీల్ నిర్మాతకు భరోసా ఇచ్చాడని, సినిమాను తాను పంపిణీ చేస్తా అంటున్నాడని వార్తలు వినవచ్చాయి. అయితే ఇప్పుడు సీన్లో కి దిల్ రాజు కూడా వచ్చారు. నైజాం కు తాను కొంటానని అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే రేటు మాత్రం నిర్మాత ఆశించినంత కోట్ చేయలేదని వినికిడి. మరి ఈ లెక్కన ఆశియన్ సునీల్ చేత విడుదల చేయిస్తారా? లేక దిల్ రాజుకు అమ్ముతారా అన్నది తేలాల్సి వుంది.