అవి చూసుకుని చిన్నతనంలో బెంగపడేదాన్ని

‘‘మన దేహంలో కూడా మనకి నచ్చని అంశాలెన్నో ఉంటాయి. నూరు శాతం ఎవరూ ఆనందంగా తమ దేహాన్ని ప్రేమించుకోలేరు. నేను చిన్నతనంలో లావుగా నా పెదాలను అద్దంలో చూసుకుని ఎంతో వ్యధకు గురయ్యేదాన్ని’’ అని…

‘‘మన దేహంలో కూడా మనకి నచ్చని అంశాలెన్నో ఉంటాయి. నూరు శాతం ఎవరూ ఆనందంగా తమ దేహాన్ని ప్రేమించుకోలేరు. నేను చిన్నతనంలో లావుగా నా పెదాలను అద్దంలో చూసుకుని ఎంతో వ్యధకు గురయ్యేదాన్ని’’ అని చెబుతుంది హిందీ సుందరాంగి ప్రియాంక చోప్రా. 

‘‘నా పై పెదవి ఉబ్బుగా, చీమలు కుట్టి వాచిపోయినట్టుండడం నాకు నచ్చేది కాదు. పెద్దయ్యాక ఆపరేషన్‌ చేయించుకోవాలని కూడా అనుకున్నాను. లక్కీగా ఆ పెదాలే నన్ను మిస్‌ ఇండియాగా నిలబెట్టాయని తెలుసుకుని గర్వపడ్డాను. ఇవ్వాళ నాలో ఏదన్నా సెక్సప్పీల్‌ ఉందంటే అది నా పెదాలే అని అందరూ చెబుతారు. నా చెల్లాయి కూడా ఇలాంటి పెదాలు నాకు రాలేదెందుకని బాధపడుతుంటుంది. పొరపాటున సర్జరీ చేయించుకుని ఉంటే నేను ఇలా పైకొచ్చేదాన్ని కాదేమో. నా పెదాలు అనేక భావాలు పలికిస్తాయని ఫోటోగ్రాఫర్స్‌ చెబుతుంటారు’’ అని బడాయిపోతున్న ప్రియాంక చోప్రా పెదవులు వల్లనే పైకొచ్చానంటుంది. కాబట్టి ఆవిడ లిప్స్‌కి జోహార్లు.