మనోజ్ హీరోయిన్ జంప్

ఇందులో పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. మనోజ్ తో పోటుగాడు నటించిన అమ్మడు కు ప్రమోషన్ వచ్చి బాలీవుడ్ జంపయింది అంతే. అసలు ఒక్క తెలుగు సినిమాలో నటించడం భయం, బాలీవుడ్ చాన్స్ కోసం…

ఇందులో పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. మనోజ్ తో పోటుగాడు నటించిన అమ్మడు కు ప్రమోషన్ వచ్చి బాలీవుడ్ జంపయింది అంతే. అసలు ఒక్క తెలుగు సినిమాలో నటించడం భయం, బాలీవుడ్ చాన్స్ కోసం ఆల్బమ్ పట్టుకు తిరిగేయడం మన హీరోయిన్లకు అలవాటే. 

అలాగే పోటుగాడు హీరోయిన్ సాక్షి చౌదరి కూడా ఓ రాయి విసిరింది. దెబ్బకి జాన్ అబ్రహామ్ సినిమా రాలిపడింది. పోటుగాడు త‌ర్వాత తెలుగులో చిన్న చిన్న అవ‌కాశాలొచ్చినా తన టార్గెట్ ఇది కాదన్నట్లు బాలీవుడ్ లో ట్రయ్ చేసింది. 

జాన్ అబ్రహామ్ క‌థానాయకుడుగా న‌టిస్తున్న `హేరా ఫేరి 3`లో క‌థానాయిక‌గా అవ‌కాశాన్ని పట్టేసింది.. త్వర‌లోనే ఆచిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది. దాంతో సాక్షి బాలీవుడ్ హీరోయిన్ అయిపోతుంది. అది కానీ హిట్ అయితే మళ్లీ మనవాళ్లే పెద్ద చాన్సులు పట్టుకుని వెంటపడతారు.