వ‌న్‌తో లెజెండ్‌

అవును.. మహేష్‌బాబు వ‌న్ సినిమాకి వెళ్తే అక్కడ బాల‌య్య లెజెండ్‌నీ చూసే అవ‌కాశం ద‌క్కనుంది. అదెలా అంటారా…?  వ‌న్ సినిమా ప్రద‌ర్శించే థియేట‌ర్లలో లెజెండ్ సినిమా థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్ ప్రద‌ర్శించ‌నున్నారు.  Advertisement బాల‌కృష్ణ –…

అవును.. మహేష్‌బాబు వ‌న్ సినిమాకి వెళ్తే అక్కడ బాల‌య్య లెజెండ్‌నీ చూసే అవ‌కాశం ద‌క్కనుంది. అదెలా అంటారా…?  వ‌న్ సినిమా ప్రద‌ర్శించే థియేట‌ర్లలో లెజెండ్ సినిమా థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్ ప్రద‌ర్శించ‌నున్నారు. 

బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను క‌ల‌యిక‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం లెజెండ్. ఈ సినిమాకీ మ‌హేష్ బాబు – సుకుమార్ క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతున్న వ‌న్‌కీ నిర్మాత‌లు ఒక్కరే. 14 రీల్స్ ఎంట‌ర్ టైన్ మెంట్ సంస్థ‌. లెజెండ్ ఫ‌స్ట్ లుక్ ని ఎలాగూ సంక్రాంతికే విడుద‌ల చేయాల‌ని చిత్రబృందం నిర్ణయించింది. 

వన్ సినిమా జ‌న‌వరి 10న ప్రేక్షకుల ముందుకు వ‌స్తుంది. వ‌న్ సినిమా ప్రద‌ర్శించే థియేట‌ర్ల‌లో లెజెండ్ ట్రైల‌ర్ నీ చూపించ‌బోతున్నారు. అంటే ప్రిన్స్ సినిమాకెళ్తే అక్కడ బాల‌య్యా క‌నిపిస్తార‌న్నమాట‌. వ‌న్ గెట్ వ‌న్ ఫ్రీ ఆఫ‌ర్ అంటే ఇదే.