ప్రపంచం వేగంగా మారిపోతోంది. ఆ క్రమంలో పాశ్చాత్య సంస్కృతి.. అందునా విష సంస్కకృతి మన దేశంలోకి విచ్చలవిడిగా చొచ్చుకుని వచ్చేస్తోంది. ప్రపంచానికే భారతీయ సంస్కృతి ఆదర్శప్రాయం.. అనే రోజులెప్పుడో పోయాయి. వెస్ట్రన్ కల్చర్, మన దేశంలో కలగలిసిపోయి.. ఇండియాలో వున్నామా.? లేదంటే ఇంకేదన్నా విదేశాల్లో వున్నామా.? అనేంతగా ఇక్కడి సంస్కృతి కలగాపులగం అయిపోయింది.
ప్రతి విషయంలోనూ మంచీ చెడూ రెండూ వుంటాయి. ఏది చెడు.? ఏది మంచి.? అని నిర్ణయించలేం. అది విజ్ఞతను బట్టి ఆధారపడి వుంటుంది. ఆ విజ్ఞత అనేదానికీ అర్థం లేకుండా పోతున్న రోజులివి. చెడుని చెడు అని చెప్పడమే చెడు అయిపోయింది. మంచిని మంచి అని చెప్పడం కూడా చెడుగా మారిపోయింది. చూసీ చూడనట్లు ఊరుకోవడమే మంచి ఇప్పుడు.
అసలు విషయంలోకి వద్దాం. 2009లో ఢిల్లీహైకోర్టు, స్వలింగ సంపర్కం నేరం కాదని తేల్చి చెప్పింది. అంతే, దేశంలోని స్వలింగ సంపర్కులంతా పండగ చేసుకున్నారు. అడపా దడపా దేశవ్యాప్తంగా స్వలింగ సంపర్కుల ప్రదర్శనలు చూస్తూనే వున్నాం. తమ హక్కుల కోసం స్వలింగ సంపర్కులు నినదిస్తున్న రోజులివి. ‘నేను స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డాను.. అలాగే జీవించాలనుకుంటున్నాను..’ అని బాహాటంగా చెబుతున్నవారు ఎక్కువయ్యారు. ‘స్వలింగ సంపర్కం’ అనే కాన్సెప్ట్‌తో సినిమాలూ విచ్చలవిడిగా తెరకెక్కుతున్నాయి.
సరిగ్గా ఈ టైమ్‌లోనే సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కంపై సంచలన తీర్పు వెల్లడించింది. స్వలింగ సంపర్కం నేరమేనని తేల్చింది. అంత కాదు, యావజ్జీవ శిక్షకూ అర్హమయ్యే నేరమది.. ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు.
చట్టాల్లో మార్పులు చేయాలంటే అది చట్ట సభలతో వీలవుతుందనీ న్యాయస్థానం అభిప్రాయపడింది. ఢిల్లీకోర్టు గతంలో ఇచ్చిన కోర్టును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇప్పుడిక స్వలింగ సంపర్కులు ఏం చేస్తారు.? నిరసన ప్రదర్శనలతో రెడ్డెక్కుతారా.? వేచి చూడాల్సిందే.