బికినీలో ప‌వ‌న్ హీరోయిన్‌

పాపం.. ప్రణీత‌కు అన్నీ రెండో నాయిక పాత్రలే ద‌క్కుతున్నాయి. అత్తారింటికి దారేది సూప‌ర్ హిట్ త‌ర‌వాత ప్రణీత ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకొన్నారంతా. కానీ ఎక్కడికీ వెళ్లలేదు. ఇంకా రెండో క‌థానాయిక పాత్రలే వ‌స్తున్నాయి.  Advertisement…

పాపం.. ప్రణీత‌కు అన్నీ రెండో నాయిక పాత్రలే ద‌క్కుతున్నాయి. అత్తారింటికి దారేది సూప‌ర్ హిట్ త‌ర‌వాత ప్రణీత ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకొన్నారంతా. కానీ ఎక్కడికీ వెళ్లలేదు. ఇంకా రెండో క‌థానాయిక పాత్రలే వ‌స్తున్నాయి. 

ర‌భ‌స‌లో క‌థానాయిక పాత్రని స‌మంత‌తో పంచుకొంది. పాండ‌వులు పాండ‌వులూ తుమ్మెద‌లోనూ ప్రణీత రెండో నాయికే.  నెంబ‌ర్ 2 అయినా త‌న పాత్రపై అంద‌రి దృష్టీ ప‌డాల‌ని భావిస్తోంది ప్రణీత‌. స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా క‌నిపించ‌క‌పోతే.. గుర్తింపు సంపాదించ‌డం క‌ష్టమ‌ని త‌న‌కీ అర్థమైంది. 

అందుకే పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌లో బికినీ వేయాల‌ని డిసైడ్ అయ్యింద‌ట‌. బికినీలో త‌న అందాల‌కు అందరూ దాసోహ‌మ‌వ్వడం ఖాయ‌మ‌ని ప్రణీత భావిస్తోంది. ఈ సినిమాతో అయినా సోలో నాయిక‌గా అవ‌కాశాలు ద‌క్కుతాయ‌ని ఆశిస్తోంది. చూద్దాం.. బికినీ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో..?