టాలీవుడ్ లో కరెక్షన్ సాధ్యమేనా?

జ‌మానా కాలంలో హిట్ ఇచ్చి, వరుసగా నిర్మాతలు నష్టపోతున్నారని తెలిసి కూడా, అలాంటి హీరోలకు పది నుంచి పాతిక కోట్లు ఇచ్చి సినిమా తీస్తున్నారంటే ఏమనుకోవాలి?

ఒక్కో దశలో ఒక్క కుదుపు రావడం, సర్దుకోవడం అన్నది ఏ రంగంలో అయినా కామన్. ఈ సర్దుకోవడాన్నే కరెక్షన్ అని కూడా అంటారు. టాలీవుడ్ లో అలాంటి కరెక్షన్ ఇప్పుడు స్టార్ట్ అయిందని నిర్మాత, పంపిణీదారు, ఎగ్ఙిబిటర్, దిల్ రాజు ఇటీవల ఓ మీడియా మీట్ లో అన్నారు. అసలు ఈ కరెక్షన్ ఏమిటి? దాని అవసరం ఏమిటి? అసలు ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి ఏమిటి? కాస్త అటు చూస్తే..

ప్రస్తుతం టాలీవుడ్ లో అయితే భారీ సినిమాలు లేదంటే చిన్న సినిమాలు. కానీ మిడ్ రేంజ్ సినిమాలు అన్నవి మాత్రం తగ్గుతూ వస్తున్నాయి. మిడ్ రేంజ్ సినిమాలు వర్కవుట్ కావడం లేదు. పది కోట్ల లోపుతో సరైన చిన్న సినిమా తీస్తే, అది కూడా కాస్త పెద్ద బ్యానర్ అయితే సొమ్ము చేసుకోగలుతున్నారు. అదే పని కొత్త వాళ్లు చేస్తే వర్కవుట్ కావడం లేదు. మార్కెటింగ్ కష్టం అవుతోంది. అదే విధంగా భారీ సినిమా అయితే సమస్య పెద్దగా రావడం లేదు.

కానీ పది కోట్ల నుంచి పాతిక కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకునే మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తే మాత్రం సమస్య అవుతోంది. వాళ్లు తీసుకునే రెమ్యూనిరేషన్ రేంజ్ కు మార్కెట్ కావడం లేదు. చాలా మంది మిడ్ రేంజ్ హీరోల సినిమాలు కూడా జ‌నం పెద్దగా పట్టించుకోవడం లేదు. పది నుంది పదమూడు కోట్లు తీసుకునే హీరోలు దాదాపు అందరూ వరుసగా ఫ్లాపులు ఇస్తూ పోతున్నారు. అయినా కూడా నిర్మాతలు సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో వారికే తెలియాలి.

ఇప్పుడిప్పుడు మెలమెల్లగా కొంతమంది హీరోలను పక్కన పెడతున్నారు. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు చేతిలో వున్న ఈ రేంజ్ హీరోలు మరి కొంత మంది త్వరలో ఖాళీగా కూర్చునే టైమ్ వస్తున్నట్లు కనిపిస్తోంది. అది ఒక కరెక్షన్ అనుకోవాలి.

ఓటీటీకి ఎలా పడితే అలా సినిమాలు ఇస్తూ రావడం వల్ల థియేటర్ కు జ‌నాలు రావడం తగ్గింది అన్నదని అనుకుంటున్నారు నిర్మాతలు. కానీ మంచి సినిమా వస్తే మాత్రం జ‌నాలు వస్తున్నారు. ఇటీవల వచ్చిన కమిటీ కుర్రాళ్లు, ఆయ్, మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాలు ఓ రేంజ్ నుంచి కొంత వరకు నడిచాయి. నడుస్తున్నాయి. అయితే థియేటర్ కు చాలా సినిమాలకు రాకపోవడం వెనుక కంటెంట్ బాగా లేకపోవడం అన్న పాయింట్ వుంది. ఈ కంటెంట్ సమస్య అన్నది మిడ్ రేంజ్ సినిమాల దగ్గరే వస్తోంది. ఇప్పుడిప్పుడే అక్కడ కూడా సబ్జెక్ట్ ల దగ్గర జాగ్రత్త స్టార్ట్ అయింది. మిస్టిక్ థ్రిల్లర్లు, సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ లు తీసుకుంటున్నారు. ఇది కూడా ఓ రకం కరెక్షన్ అనుకోవాలి.

ఓటీటీకి సినిమాలు ఇవ్వడంలో మిగిలిన భాషల నిర్మాతలు కట్టుగా వున్నారు. కొంత గ్యాప్ ఇచ్చి, జ‌నాల్లోకి ఇన్ని వారాల వరకు రాదు అనే క్లారిటీని సక్సెస్ ఫుల్ గా పంపారు. కానీ తెలుగులో అలా కాదు. రెండు మూడు వారాల నుంచి ఓటీటీలోకి రావడం స్టార్ట్ అయిపోయింది. దాంతో జ‌నాలు వెయిట్ చేస్తున్నారు థియేటర్ కు వెళ్లకుండా. టాలీవుడ్ లో కూడా కనీసం నాలుగు వారాలు కనీసం గ్యాప్ ఇవ్వాలనే పద్దతిని తీసుకువచ్చే ప్రయత్నాలు, డిస్కషన్లు జ‌రుగుతున్నాయి. ఇది కూడా ఓ కరెక్షన్ అనుకోవాలి.

ఇవన్నీ ఇలా వుంచితే విడుదల డేట్ ల విషయంలో అసలు సిసలు కరెక్షన్ లు రావాల్సి వుంది. పెద్ద సినిమాలు సరైన డేట్ లు చూసి బ్లాక్ చేస్తున్నాయి. అది చూసి మిగిలిన సినిమాలు దూరంగా వుండిపోతున్నాయి. తీరా చేసి డేట్ బ్లాక్ చేసిన సినిమా రాకపోతే మంచి డేట్ లు మిస్ అయిపోతున్నాయి. లేదూ, పెద్ద సినిమా రావడం లేదని లాస్ట్ మినిట్ లో తెలిసి, తన ప్రొడెక్ట్ ను హర్రీ బుర్రీగా రెడీ చేసి వదలుతున్నారు. దాంతో హాఫ్ బేక్డ్ ప్రొడెక్ట్ బయటకు వచ్చి దెబ్బతింటున్నారు. అందువల్ల ఈ డేట్ లు ఫిక్స్ చేసుకోవడం దగ్గర నిర్మాతలు ఓ సిస్టమ్ అనేది డెవలప్ చేయాల్సి వుంది. ఈక్వెల్ గా రిలీజ్‌లు ప్లానింగ్ పెర్ ఫెక్ట్ గా వుంటే, ఏడాది పొడవునా థియేటర్లకు ఫీడింగ్ పద్దతిగా వుంటుంది. లేదంటే థియేటర్ల వ్యవస్ధ ఇబ్బందుల్లో పడుతుంది. సినిమా షో వుంటుందా.. క్యాన్సిల్ అవుతుందా అన్న పరిస్థితి వుంది ఇప్పుడు. ఇలాంటి నేపథ్యంలో ప్రేక్షకుడు థియేటర్ కు ఎలా వస్తాడు?

ఇక ఎప్పటికి సాధ్యం కాని కరెక్షన్ కూడా వుంది. అదే హీరోల రెమ్యూనిరేషన్. అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి రెమ్యూనిరేషన్లు. నిర్మాతలు ప్రాజెక్ట్ ల కోసం పోటీ పడి రెమ్యూనిరేషన్లు పెంచేస్తున్నారు. ఒకప్పుడు పది కోట్లు వున్న హీరోలు ఇప్పుడు పాతిక కోట్లకు పైన తీసుకుంటున్నారు. ఒకటి రెండేళ్ల క్రితం కోటి, రెండు కోట్లు తీసుకుంటున్న వారు ఇప్పుడు అయిదు కోట్లకు చేర్చేసారు తమ రెమ్యూనిరేషన్ ను. ఒక నిర్మాత ఇవ్వనంటే మరో నిర్మాత ఇస్తున్నారు. జ‌మానా కాలంలో హిట్ ఇచ్చి, వరుసగా నిర్మాతలు నష్టపోతున్నారని తెలిసి కూడా, అలాంటి హీరోలకు పది నుంచి పాతిక కోట్లు ఇచ్చి సినిమా తీస్తున్నారంటే ఏమనుకోవాలి?

ఓ సీనియర్ హీరో వరుసగా 60 రోజులే డేట్ లు ఇస్తా.. చకచకా మూడు నెలల నుంచి నాలుగు నెల్లలో సినిమా తీసేయాలి. ఓ స్పెషల్ ఇంటర్వూ, ఓ ఈవెంట్ మినహా దేనికీ రాను. కానీ పాతిక కోట్ల రెమ్యూనిరేషన్ ఇవ్వాలి అన్నా నిర్మాతలు సరే అంటూ సమర్పించుకుంటున్నారు. నష్టపోతున్నారు. ఇలాంటివి మాత్రం ఎప్పటికి కరెక్షన్ జ‌రగవు.

జ‌నవరిలో హనుమాన్ తో మంచి లాభాలు సంపాదించి అగస్ట్ లో డబుల్ ఇస్మార్ట్ కొని మొత్తం సమర్పించేసుకున్నారు. సినిమా ఎలా వస్తుందో తెలియకుండా జ‌స్ట్ పాటలు, ఫైట్లు, కొన్ని సీన్లు చూసి కొనుగోలు చేసేసారు. ఇప్పుడు నలభై కోట్లు వన్ డే లో పోగొట్టేసుకున్నారు. ఇది కరెక్షన్ అవసరం లేని సంగతి. సినిమా వ్యాపారాన్ని బ్లైండ్ ఫోల్డ్ జూదంగా కాకుండా ప్లాన్డ్ వ్యాపారంగా చేయాలన్న సంగతి ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే. ఇక్కడ కరెక్షన్ ఎవరికి వారిలో రావాలి.

అన్నింటికన్నా కరెక్షన్ డైరక్టర్ ఏం తీస్తున్నాడు.. ఏం చుట్టేస్తున్నాడు.. కబుర్లు భూమి బద్దలయ్యేలా చెప్పడం తప్ప చేతల్లో ఏమైనా వుందా లేదా అన్నది నిర్మాతలు చూసుకోవాలి. డైరక్టర్ల మాయలో పడి, హీరోలకు కోట్లు సమర్పించుకుని సినిమాలు చేస్తే ఏ కరెక్షన్ ఏమీ చేయలేదు.

16 Replies to “టాలీవుడ్ లో కరెక్షన్ సాధ్యమేనా?”

  1. హీరో, డైరెక్టర్ లకు అసలు రెమ్యునరేషన్ అనే పద్ధతి రద్దు చేసి, సినిమా విడులల అయ్యాక వచ్చే ప్రతి టికెట్టు లో వాటా పద్ధతి పెడితే సరి. హిట్ ఐతే డబ్బు లేకపోతే ఫట్.

      1. Cinema హాల్ వ్యవస్థ లో ఆల్రెడీ ప్రతి షో కి ఎన్ని టిక్కెట్లు అమ్ముడు పోయాయి అనే ట్రాకింగ్ వింది. ప్రభుత్వం కి కూడా లెక్కలు చెప్పాలి, టాక్స్ కోసం. పైగా డిస్ట్రిబ్యూటర్ కూడా మానిటర్ చేసుకుంటాడు. నేను చెప్పినట్లు కొత్త పద్ధతి ఫాలో అయితే, హీరో కూడా తన మనుషులని పెట్టుకుంటాడు, సరైన టిక్కెట్లు లెక్క కోసం.

  2. దిల్ రాజు ఎప్పుడో కుడిసిపోయాడు వాడు నోటికొచ్చినట్టు కరెక్షన్ అని కరప్షన్ అని మాట్లాడితే దాని మీద సొల్లు వ్యాసం రెడ్డి కాబాట్టి

Comments are closed.