దేవర – హిందీ మార్కెట్ నే టార్గెట్

దాదాపు రెండున్నరేళ్లు అయింది ఎన్టీఆర్ ను అభిమానులు తెరపై చూసి. ఎప్పుడెప్పుడు చూస్తామా అని వున్నారు. ఈ నెల 27 దేవర సినిమా విడుదలవుతోంది. కానీ అంతకన్నా ముందు 10న ట్రయిలర్ వస్తోంది. Advertisement…

దాదాపు రెండున్నరేళ్లు అయింది ఎన్టీఆర్ ను అభిమానులు తెరపై చూసి. ఎప్పుడెప్పుడు చూస్తామా అని వున్నారు. ఈ నెల 27 దేవర సినిమా విడుదలవుతోంది. కానీ అంతకన్నా ముందు 10న ట్రయిలర్ వస్తోంది.

రెండు నిమిషాల 50 సెకెండ్ల ట్రయిలర్ ను దర్శకుడు కొరటాల శివ కట్ చేసినట్లు తెలుస్తోంది. ట్రయిలర్ ను ముంబాయిలో మీడియా ముందు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. దేవర సినిమాతో ఎన్టీఆర్ హిందీ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారు. జాన్వి కపూర్ ను హీరోయిన్ గా తీసుకున్న దగ్గర నుంచీ ప్రతి పాయింట్ లో అదే జాగ్రత్త తీసుకుంటున్నారు.

ట్రయిలర్ ను ముంబాయిలో విడుదల చేయడం వెనుక కూడా అదే రీజ‌న్. అంతే కాదు దర్శకుడు కొరటాల, హీరో ఎన్టీఆర్ కొన్ని ఇంటర్వూలు అక్కడి మీడియాకు ఇస్తున్నారు. అలాగే దర్శకుడు సందీప్ వంగా హీరో ఎన్టీఆర్ ను ఇంటర్వూ చేయబోతున్నారు. ఇది కచ్చితంగా వైరల్ అవుతుంది. ఎందుకంటే సందీప్ వంగా కు వున్న క్రేజ్‌ అలాంటిది.

ఎన్టీఆర్ పాన్ ఇండియా భవిష్యత్ కు ఆర్ఆర్ఆర్ కన్నా కూడా దేవర నే అసలైన పునాది. దీని తరువాత ప్రశాంత్ నీల్ సినిమా కనుక పెద్దగా సమస్య వుండదు. ఈ సినిమాతో ఎన్టీఆర్ నార్త్ లో ప్రూవ్ చేసుకుంటే ఇక ఫిక్స్ అయిపోతుంది మార్కెట్. ఇప్పటికే ప్రభాస్, బన్నీ ఫిక్స్ చేసుకున్నారు. చరణ్ చేసుకోవాల్సి వుంది.

5 Replies to “దేవర – హిందీ మార్కెట్ నే టార్గెట్”

  1. ప్రభాస్ ఓకే బన్నీ ఎలా ఫిక్స్ చేసుకున్నాడు రా వైసిపి కుక్క..ఒక సినిమా ఆడటానికి వంద కారణాలు ఉంటాయి.. దేవిశ్రీప్రసాద్ సమంత ఐటమ్ సాంగ్ వల్ల పుష్ప నార్త్ లో ఆడింది.. అయితే కార్తికేయ 2 ఆడింది.. నిఖిల్ కి ఫిక్స్ అయినట్లా రా?

Comments are closed.