ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ని రగులుస్తారా?

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నది నిన్నటి మాట. అది కాస్తా కేంద్ర ప్రభుత్వ హక్కుగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అని దాని బాధ్యత మాది అని అంటున్నారు. అయితే విశాఖ…

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నది నిన్నటి మాట. అది కాస్తా కేంద్ర ప్రభుత్వ హక్కుగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అని దాని బాధ్యత మాది అని అంటున్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ వల్ల ఉత్తరాంధ్రకే ఎక్కువ మేలు జరిగింది.

మూడు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందారు. అలాగే అనుబంధ సంస్థల వల్ల కూడా చాలా మంది లాభపడ్డారు. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తే ఆ సంస్థలు లాభం వస్తే నడుపుతారు, లేకపోతే ఎత్తివేస్తారు. దాని వల్ల ఉత్తరాంధ్రకు ప్రత్యేకించి విశాఖకు లాభం మాట కంటే నష్టమే ఎక్కువ. అందుకే అత్యంత వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆశాకిరణం లాంటి విశాఖ ఉక్కుని కాపాడుకోవాల్సిన అవసరం ఆ ప్రాంత ప్రజలదిగా ఉంది.

ఈ విషయంలో గతంలో సెంటిమెంట్ రాజేసి టీడీపీ ఇటీవల ఎన్నికల్లో అతి పెద్ద లాభాన్ని అందుకుంది. వైసీపీ ఇపుడు టీడీపీని లక్ష్యంగా చేసుకుంటోంది. అంతే కాదు ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ని కూడా రాజేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు.

ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తే ఊరుకోమని ఆయన చెప్పడం ద్వారా స్టీల్ ప్లాంట్ కి కొత్త సెంటిమెంట్ ని జత చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి 35 వేల ఎకరాల భూములను ఇచ్చారు అని గుర్తు చేశారు. అమరావతికి 32 వేల ఎకరాల భూమి ఇచ్చారని గొప్పలు చెప్పుకుంటారని విశాఖ విషయంలో ఎందుకు మాట్లాడరని ఆయన టీడీపీ కూటమిని ప్రశ్నించారు

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తమ వైఖరి ఏంటో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం వేగంగా పావులు కదుపుతూంటే ఇంకా మీనమేషాలు లెక్కపెడతారా అని ఫైర్ అయ్యరు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలంటే టీడీపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని ఆయన సూచించారు. టీడీపీ ఎంపీల మీద మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉందని ఆ మాత్రం ఒత్తిడి చేయలేరా అని ప్రశ్నించారు.

వైసీపీ అయితే ప్లాంట్ ని కాపాడుకోవడానికి ఎంతటి ఉద్యమానికైనా సిద్ధపడుతుందని బొత్స స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ పోరాటం ఆగదని అన్నారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ని స్టీల్ ప్లాంట్ తో ముడి పెట్టడం ద్వారా వైసీపీ కూటమికి సరైన సవాల్ నే విసిరిందని అంటున్నారు.

8 Replies to “ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ని రగులుస్తారా?”

  1. హమ్మయ్య బొత్స సత్యనారాయణ నీ రంగం లోకి దింపి మంచి పని చేశారు లేకపోతే టీడీపీ ఇబ్బందిలో పడి ఉండేది అదే బొత్స ఐతే ఏం మాట్లాడాడో అర్థం కాక విశాఖ ప్రజలు తేలికగా తీస్కుని నవ్వి వదిలేస్తారు

  2. 😂😂… ఎందుకు GA… రేపు మళ్ళీ అధికారం వస్తే స్టీల్ ప్లాంట్ లేపేసి CAPITAL CITY కట్టడానికా….

Comments are closed.