అనిత కార్నర్ అయ్యారా?

జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్తే ఆయనను డిక్లరేషన్ అడిగిన టీడీపీ కూటమి నేతలకు వైసీపీ నేతలు వరసబెట్టి రివర్స్ లో కౌంటర్ చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ అయితే హోం మంత్రి అనిత…

జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్తే ఆయనను డిక్లరేషన్ అడిగిన టీడీపీ కూటమి నేతలకు వైసీపీ నేతలు వరసబెట్టి రివర్స్ లో కౌంటర్ చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ అయితే హోం మంత్రి అనిత తిరుమలకు వెళ్ళినపుడు డిక్లరేషన్ ఇచ్చారా అని మీడియా ముఖంగా ప్రశ్నించారు.

ఆమెకు గతంలో టీడీపీ బోర్డు లో మెంబర్ షిప్ ఎందుకు ఇవ్వలేకపోయారు అని ఆయన అడిగారు. ఆమె స్వయంగా తాను క్రిస్టియన్ అని చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తన ఇంట్లో, కారులో, చేతిలో ఎప్పుడూ బైబిల్ ఉంటుందని అనిత చెప్పారని గుర్తు చేశారు.

ఆమె క్రైస్తవ మత విశ్వాసాన్ని కలిగి ఉంటే తప్పు లేదని ఎవరి వ్యక్తిగత ఆరాధన వారివి అని గుడివాడ అన్నారు. అయితే మతాన్ని రాజకీయాన్ని కలిపి కూటమి నేతలు విమర్శలు చేయడం తోనే తాము అనిత డిక్లరేషన్ గురించి అడుగుతున్నామని అన్నారు.

ఆమె హోం మంత్రిగా అయ్యాక శ్రీవారిని దర్శించుకున్నారని ఆమె అప్పుడు డిక్లరేషన్ ఇచ్చారా అని కూడా మాజీ మంత్రి ప్రశించారు. ఇదే విషయం మీద వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కూడా అనితను ప్రశ్నించారు. ఆమె డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ ని అడగడం ఏ మేరకు సబబు అన్నారు.

జగన్ తొలిసారి తిరుమలకు రాలేదని ఇప్పటికి పది సార్లకు పైగా వచ్చి ఉంటారని అన్నారు. ఆయన అయిదు సార్లు వైఎస్సార్ మరో అయిదు సార్లు స్వామి వారి బ్రహ్మోత్సవాలలో పట్టు వస్త్రాలు సమర్పించారని కూడా అన్నారు.

హోం మంత్రి అనిత ఈ విషయం తెలుసుకోకుండా జగన్ ని పట్టుకుని విమర్శించడం మంచిది కాదని అన్నారు. ఇవన్నీ చూస్తూంటే జగన్ డిక్లరేషన్ కాదు కానీ అనితతో పాటు మరింతమందిని వైసీపీ నేతలు బయటకు తెస్తున్నారు. దాంతో కోరి ప్రశ్నించి ఇరుకున పడడం టీడీపీ నేతల వంతు అవుతోంది అని అంటున్నారు.

16 Replies to “అనిత కార్నర్ అయ్యారా?”

    1. —అరె—పిచ్చి—పుల్కా—జగన్MLA—అనిత-homeమినిస్టర్—ఎదవ—పతివ్రత—కబుర్లు—చెప్పకుండా—all are equil ani చెప్పడం నేర్చు కో

      1. All are equal అంట.. నేను, నీ తండ్రి పుల్కా, తాత పుల్కా, నీ ఇంటి ఆడ పుల్కాలు అందరూ నీ దృష్టిలో ఒక్కటే అనేగా!

  1. ja*** కార్నర్ అయ్యాడు అని రాయబోయి అనిత అని రాసినట్లున్నావ్ చూసుకో !! లడ్డూ విషయంలో ja*** support కి రాస్తున్న articles చాలా డోల గా ఉన్నాయి – for lake of substance, GA .. GA !!

Comments are closed.