పాపం పిఠాపురం వర్మ.. బాబు గారికి గుర్తురాలేదా?

అదేమిటి బాబుగారు ప్రజలకు ఇచ్చిన హామీలను చాలా కన్వీనియెంట్ గా తనకు అనుకూలంగా మరచిపోతూ ఉంటారు సరే.. కానీ సొంత పార్టీ నాయకులకు, ఆ పార్టీలో త్యాగాలు చేసిన వారికి ఇచ్చిన హామీలను కూడా…

అదేమిటి బాబుగారు ప్రజలకు ఇచ్చిన హామీలను చాలా కన్వీనియెంట్ గా తనకు అనుకూలంగా మరచిపోతూ ఉంటారు సరే.. కానీ సొంత పార్టీ నాయకులకు, ఆ పార్టీలో త్యాగాలు చేసిన వారికి ఇచ్చిన హామీలను కూడా మరచిపోతుంటారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సీన్ చూస్తే మాత్రం అవుననే అనిపిస్తోంది.

ఎమ్మెల్సీలు అవకాశాలు వచ్చినప్పుడు తొలిచాన్స్ వర్మకే ఇస్తానని చెప్పారు చంద్రబాబు. పవన్ కల్యాణ్ కోసం పిఠాపురంలో చేసిన త్యాగానికి ప్రతిఫలం మొదటి ఎమ్మెల్సీ సీటు అన్నారు. మొదటి ఎమ్మెల్సీ సీటు కూడా దాటిపోయింది గానీ.. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్యారంటీగా గెలిచే సీటు వచ్చినప్పుడు కూడా చంద్రబాబుకు పిఠాపురం వర్మ గుర్తొస్తున్నట్టు లేదు.

పిఠాపురం వర్మ.. తెలుగుదేశంలో చంద్రబాబు రాజకీయ లౌక్యం కారణంగా నష్టపోయిన వారిలో మొదటివరుసలోని వ్యక్తి. అలాంటి మరొక నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా. జనసేనలో సేఫ్ సీట్లు మాత్రం చూసుకున్న అగ్ర నాయకులు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ కోసం వీరు త్యాగాలు చేశారు.

ఇప్పుడు గుంటూరు కృష్ణా జిల్లాలు, ఉభయగోదావరి జిల్లాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఆలపాటి రాజాకు మాత్రం చంద్రబాబు న్యాయం చేస్తున్నారు. అందులో కులసమీకరణలు పనిచేశాయేమో తెలియదు. ఆయన కమ్మ కావడం వల్లనే న్యాయం చేస్తున్నారేమో తెలియదు. అయితే గోదావరి జిల్లాల విషయానికి వచ్చేసరికి పిఠాపురం వర్మకు హ్యాండ్ ఇచ్చారు.

ఇక్కడి నుంచి కాపు లేదా ఎస్సీ అభ్యర్థిని పెట్టాలని ప్లాన్ చేసినట్టుగా ఒక ప్రచారం సాగించారు. కెఎస్ జవహర్ వంటి పేర్లను కూడా పరిశీలించి.. చివరకు పేరాబత్తుల రాజశేఖర్ కు టికెట్ ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. పిఠాపురం వర్మ విషయానికి వచ్చేసరికి బాబు గారికి కుల సమీకరణాలు అడ్డు వచ్చాయా అని విమర్శలు వస్తున్నాయి. ఆయన చేసిన త్యాగానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా అని అంటున్నారు. మరి వర్మ ఏం చేస్తారో చూడాలి.

11 Replies to “పాపం పిఠాపురం వర్మ.. బాబు గారికి గుర్తురాలేదా?”

  1. మంగళగిరి లో గెలిచించండి మంత్రిని చేస్తా అని మన లెవెనోడు అనలా..ఇదీ అలాంటిదే ఎంకటి..

  2. వర్మగారి అన్యాయం గారంటీ గ చెయ్యరు అదే విధంగా టీడీపీ మాదిగలకు కచ్చితం గ మంచి పథకం పెట్టాలి ప్రతిమండల కేంద్రం లోను వాళ్లకు మాదిగ భవన్ కట్టి దాంట్లో వ్యవసాయ ఇతర మెషినరీ మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు లోన్స్ ఇవ్వాలి పేద బీసీ లకు పల్లెల్లో కనీసం 2 సెంట్ ల ఇళ్లస్థలం ఇవ్వాలి రెవిన్యూ ఆఫీస్ లలో అవినీతికి కచ్చితం అదుపు చెయ్యటానికి మంచి వ్యవస్థ ఉండాలి

Comments are closed.