తిరుప‌తిలో మ‌ద్య‌నిషేధం విధించాలి!

టీటీడీ అంటే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం. కలియుగ దైవం కొలువైన తిరుమ‌ల‌ను, శ్రీ‌వారి పాదాల చెంత ఉన్న తిరుప‌తిని వేర్వేరుగా చూడ‌లేం. అంతెందుకు టీటీడీ ప‌రిపాల‌న కార్యాల‌యం తిరుప‌తిలోనే వుంటుంది. అందుకే తిరుప‌తిని కూడా…

టీటీడీ అంటే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం. కలియుగ దైవం కొలువైన తిరుమ‌ల‌ను, శ్రీ‌వారి పాదాల చెంత ఉన్న తిరుప‌తిని వేర్వేరుగా చూడ‌లేం. అంతెందుకు టీటీడీ ప‌రిపాల‌న కార్యాల‌యం తిరుప‌తిలోనే వుంటుంది. అందుకే తిరుప‌తిని కూడా ఆధ్యాత్మిక క్షేత్రంగానే భ‌క్తులు చూస్తారు. ప్ర‌పంచ ఆధ్మాత్మిక క్షేత్రంగా తిరుప‌తికి పేరు.

అలాంటి తిరుప‌తిలో మ‌ద్య‌పాన నిషేధం విధించాల‌ని చాలా ఏళ్లుగా డిమాండ్ వుంది. అయితే అమ‌లుకు నోచుకోవ‌డం లేదు. ప్ర‌స్తుతం స‌నాత‌నం ధ‌ర్మం గురించి బాగా తెలిసిన ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో పాటు శ్రీ‌వారి ప‌ర‌మ భ‌క్తుడైన చంద్ర‌బాబునాయుడు సీఎం హోదాలో ఉన్నారు. వీళ్లిద్ద‌రికి తోడు హిందుత్వానికి తానే ప్ర‌తినిధిగా చెప్పుకునే బీజేపీ కూడా ప్ర‌భుత్వంలో భాగస్వామి. కావున తిరుప‌తిలో మ‌ద్య‌పానాన్ని నిషేధించేందుకు ఇంత‌కు మించిన మంచి స‌మ‌యం మ‌రెప్ప‌టికీ రాదు.

కూట‌మి ప్ర‌భుత్వం అక్టోబ‌ర్ ఒక‌టి నుంచి కొత్త మ‌ద్యం పాల‌సీని తీసుకొస్తున్న నేప‌థ్యంలో హిందువుల ఆధ్మాత్మిక రాజ‌ధాని అయిన తిరుప‌తిలో మ‌ద్య‌పాన నిషేధం అమ‌లుకు ముందుకు రావాల్సిన అవ‌స‌రం వుంది.

గాంధీ మ‌హాత్ముడు జ‌న్మించాడ‌ని గుజ‌రాత్‌లో ద‌శాబ్దాలుగా మ‌ద్య‌పాన నిషేధం అమ‌ల్లో వుంది. మ‌రి ప్ర‌పంచ వ్యాప్తంగా హిందువులు ఆరాధించే క‌లియుగ దైవం పాదాల చెంత ఉన్న తిరుప‌తిలో మ‌ద్య‌పాన నిషేధాన్ని అమ‌లు చేయ‌డానికి, మందుపై వ‌చ్చే ఆదాయాన్ని వ‌దులుకోడానికి ఈ ప్ర‌భుత్వం సిద్ధ‌ప‌డుతుంద‌ని ఆశించ‌డంలో త‌ప్పులేదేమో!

6 Replies to “తిరుప‌తిలో మ‌ద్య‌నిషేధం విధించాలి!”

  1. మక్కా లో చర్చి, గుడి లేవు.

    వాటికన్ లో మసీదు, గుడి లేవు.

    కనుక ఆ రూల్ ప్రకారమే

    తిరుపతి లో చర్చ్, మసీదు లు కూడా వుండకూడదు.

    కదా గ్రేట్ ఆంధ్ర.

  2. మంచి ఆలోచనే. ఇప్పుడు కొండ మీద ఆల్కహాల్, స్మోకింగ్ నిషిద్ధం అనే రూల్ వుందా?

Comments are closed.