జానీ మాస్టర్ తప్పు చేస్తే మాత్రం వదలొద్దు

నటుడు, నిర్మాత, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు, జానీ మాస్టర్ వ్యవహారంపై స్పందించాడు. ఈ వివాదంలోకి తనను లాగొద్దంటూనే, ఒకవేళ జానీ మాస్టర్ తప్పు చేస్తే అతడ్ని కఠినంగా శిక్షించాలన్నాడు. Advertisement…

నటుడు, నిర్మాత, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు, జానీ మాస్టర్ వ్యవహారంపై స్పందించాడు. ఈ వివాదంలోకి తనను లాగొద్దంటూనే, ఒకవేళ జానీ మాస్టర్ తప్పు చేస్తే అతడ్ని కఠినంగా శిక్షించాలన్నాడు.

“జానీ మాస్టర్ వివాదంలో నన్నెందుకు లాగుతున్నారు. నన్ను కాంట్రవర్సీలోకి లాగొద్దు. అది కోర్టులో ఉంది కదా వదిలేయండి. అయితే ఈ వివాదంలో జానీది నిజంగా తప్పు ఉన్నట్టయితే అది క్షమించరాని నేరం. టాలీవుడ్ అనేది ఓ సురక్షితమైన పరిశ్రమ. ఎంతోమంది ఆడబిడ్డలు రావాలి, దీన్ని ఒక కెరీర్ గా ఎంచుకోవాలి. ఎన్నో విజయాలు సాధించాలి, తెలుగు సినిమా గర్వపడాలి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం కఠిన శిక్షలుండాలి.”

ఇదే సందర్భంలో నటి హేమ అంశంపై స్పందించాడనికి మాత్రం మంచు విష్ణు నిరాకరించాడు. బెంగళూరు డ్రగ్స్ కేసులో హేమ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రిపోర్ట్ లో నెగెటివ్ వచ్చిందంటూ హేమ ప్రకటించడం, వెంటనే ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేయడం చకచకా జరిగిపోయాయి.

అయితే కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో మాత్రం నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు ఉందనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని హేమ ఖండించారు. దీనిపై స్పందించడానికి మంచు విష్ణు అంగీకరించలేదు. హేమ ఇష్యూకు సంబంధించి “నా పని పూర్తయింది” అనే అర్థం వచ్చేలా రియాక్ట్ అయ్యాడు.

3 Replies to “జానీ మాస్టర్ తప్పు చేస్తే మాత్రం వదలొద్దు”

Comments are closed.