అబ్బా… చంద్ర‌బాబు గొప్ప మ‌న‌సున్న నాయ‌కుడ‌ని!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు గొప్ప మ‌న‌సున్న మ‌నిష‌ని అనుకోవాల‌ని రాజ‌గురువు మీడియా ప్ర‌తి అక్ష‌రాన్ని, అలాగే తన చాన‌ల్‌లో చూపే ప్ర‌తి వీడియో వుండాల‌ని త‌పిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ ఆ ప‌త్రిక రాసిన ఓ…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు గొప్ప మ‌న‌సున్న మ‌నిష‌ని అనుకోవాల‌ని రాజ‌గురువు మీడియా ప్ర‌తి అక్ష‌రాన్ని, అలాగే తన చాన‌ల్‌లో చూపే ప్ర‌తి వీడియో వుండాల‌ని త‌పిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ ఆ ప‌త్రిక రాసిన ఓ చిన్న మాన‌వీయ వార్త‌ను చ‌దివితే అర్థమ‌వుతుంది.

తిరుమ‌ల శ్రీ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌డానికి చంద్ర‌బాబు వెళ్లారు. తిరుగు ప్ర‌యాణంలో రేణిగుంట విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. అక్క‌డ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న యువ‌కుడి కుటుంబం ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తోంది. మాన‌సిక వైక‌ల్యంతో బాధ‌ప‌డుతున్న సురేంద్ర‌బాబు కొంత కాలంగా క్యాన్స‌ర్‌తో పోరాడుతున్నాడు.

శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి ద్వారా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిని క్యాన్స‌ర్ బాధిత యువ‌కుడి కుటుంబం క‌లుసుకుంది. ఆ యువ‌కుడి వైద్యానికి రూ.5 ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని చంద్ర‌బాబు అంద‌జేశారు. పెద్ద మ‌న‌సుతో ఆర్థిక సాయం అంద‌జేసిన చంద్ర‌బాబును అభినందించాలి.

అయితే రాజ‌గురువు ప‌త్రిక‌లో వార్త‌ను చ‌దివితే, చంద్ర‌బాబు వ్య‌క్తిగ‌తంగా సాయం అందించార‌ని ఎవ‌రైనా అనుకుంటారు. కానీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నుంచి రూ.5 ల‌క్ష‌ల ఆర్థిక సాయం చేశారు. ఈ విష‌యాన్ని రాజ‌గురువు ప‌త్రిక రాయ‌క‌పోవ‌డం వెనుక ఉద్దేశం… చంద్ర‌బాబు గొప్ప మ‌న‌సున్న మ‌నిషిగా పాఠ‌కుల‌కు చూపే ప్ర‌య‌త్నం. రాజ‌గురువు స్వామి భ‌క్తిని ఈ ర‌కంగా అక్ష‌ర రూపంలో ప్ర‌ద‌ర్శించ‌డం గ‌మ‌నార్హం.

30 Replies to “అబ్బా… చంద్ర‌బాబు గొప్ప మ‌న‌సున్న నాయ‌కుడ‌ని!”

  1. అంతే కదా.. మా జగన్ రెడ్డి అయితే.. లక్షల కోట్ల సంక్షేమం తన తాడేపల్లి పాలస్ ఖజానా నుండి తీసి పంచేసాడు..

    వాడు చేసిన దాన ధర్మాలను సాక్షి లో సొంత ఖర్చుతో ప్రచారం చేసుకొన్నాడు .. కదా..

    జగన్ రెడ్డి మా గొప్ప మనసున్న నాయకుడు.. అనుకోవాలని.. నీలి లంజలా తాపత్రయం..

  2. డబ్బె కాదు, అక్కడ ఆ అబ్బాయి తన చివరి కొరికగా చంద్రబాబు ని కలవాలి అని కొరాడు.

    దానికి చంద్రబాబె సమయం చూసుకొని స్వయంగా వెళ్ళి కలిసాడు, అలానె 5 లక్షల సాయం కూడా చెసాడు. అదె మన జగన్ అయితె, CM గా పలెసె వదిలింది లెదు కదా అంటవా!!

  3. మీ మీడియా అయినా అంతేగా, జగన్ ఏమైనా చేస్తే వరాలు ఇచ్చినట్లు ప్రభుత్వం సొమ్ము అయినా, ఎదుటి వాళ్ళు అయితే మా ప్రజల సొమ్మే కదా మాకు తిరిగి ఇచ్చేది!

  4. మరి మన అన్న కూడా తన సొంత జేబు నుండి తీసి ఇచ్చారా డబ్బులు….అన్న ది మంచి మనసు….చేతికి ఎముక లేదు అన్నట్టు విశేషనాలు అన్ని తగిలించి ఇన్నాళ్లు ఆర్టికల్స్ తెగ వడ్డించి వార్చారు మొన్నటి వరకు ….సరే ఇంతకీ అన్న ప్రకటించిన విరాళం సీఎం ఫండ్ లోని జమ చెయ్యలేదు పార్టీ పరం గ ఏమి చేసినట్టు కనపడలేదు ..అదంతా ప్రచార ఆర్భాటమేనా

  5. ముందు తన హెలికాప్టర్ ట్రిప్ ఖర్చు లని, కాన్వాయ్ దేశిల్ ఖర్చును ఇంకా ఫ్యాన్ పార్టీ వాళ్ళ మీదా వెయ్యకుండా, సొంత జేబులో డబ్బుతో తిరగమను.

Comments are closed.