నాలుగు నెలల్లో జ‌గ‌న్‌కు ఎన్ని మార్కులు?

జ‌గ‌న్ చుట్టూ ఉన్న కోట‌రీనే ఆయ‌న‌కు న‌ష్టం క‌లిగిస్తున్నార‌నే అభిప్రాయం జ‌నంలో బ‌లంగా వుంది.

గ‌త నెల‌ 19వ తేదీకి చంద్ర‌బాబు స‌ర్కార్‌కు 100 రోజులు పూర్త‌య్యాయి. కూట‌మి అధికారంలో కొలువుదీరి నాలుగు నెల‌లు కావ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా బాబు పాల‌న‌పై జ‌నాభిప్రాయం ఏంటో మాట్లాడుకున్నాం. ఇదే సంద‌ర్భంలో మాజీ ముఖ్య‌మంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కూడా ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా నాలుగు నెల‌ల్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌య‌పాలైన జ‌గ‌న్, ఆయ‌న పార్టీ ప‌రిస్థితి ఎలా వుంది? అని తెలుసుకుందాం.

కూట‌మికి అప‌రిమిత‌మైన అధికారం ద‌క్క‌డం జ‌గ‌న్ పాలిట వ‌ర‌మైంది. ఇక త‌మ‌కు ఎదురే లేద‌న్న అహంకారం ముఖ్యంగా టీడీపీలో క‌నిపిస్తోంది. అందుకే చేయ‌కూడ‌ని త‌ప్పుల్ని టీడీపీ, జ‌న‌సేన నేత‌లు చేస్తున్నారు. ఇంకా అధికారంలో కొలువుదీర‌క‌నే అస‌లే ఘోర ఓట‌మితో కుంగిపోయిన వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై దాడికి టీడీపీ తెగ‌బ‌డింది. అంతేకాదు, వారి ఆస్తులు, వ్యాపారాల‌ను లాక్కోడానికి టీడీపీ వెనుకాడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా ఇదే తంతు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా పోలీసులు ప్రేక్ష‌క‌పాత్ర పోషిస్తున్నార‌నే విమ‌ర్శ‌ల్ని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. కొన్ని చోట్ల హ‌త్య‌లు, తీవ్ర‌గాయాల‌పాల‌య్యారు. ఇవ‌న్నీ వైసీపీపై సానుభూతిని క్రియేట్ చేయ‌డానికి దోహ‌దం చేశాయి. అంతేకాకుండా, సంక్షేమ ప‌థ‌కాల్ని నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేసిన జ‌గ‌న్ పార్టీ కేవ‌లం 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ సీట్ల‌కు ప‌డిపోవ‌డం కూడా ప్ర‌జ‌ల్లో సానుభూతికి కార‌ణ‌మైంది.

ఘోర ఓట‌మి నుంచి తేరుకోడానికి జ‌గ‌న్‌కు ఏడాదికి త‌క్కువ కాకుండా స‌మ‌యం తీసుకుంటుంద‌ని టీడీపీ, జ‌న‌సేన నేత‌లు భావించారు. కానీ నెల‌లోపే ఆయ‌న ఓట‌మి నుంచి తేరుకున్నారు. త‌మ పార్టీపై జ‌రుగుతున్న దాడుల్ని దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టికి తీసుకెళ్లి, చంద్ర‌బాబు స‌ర్కార్‌ను ఎండ‌గ‌ట్టేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు. ఢిల్లీ వేదిక‌గా త‌న పార్టీ నాయ‌కులతో క‌లిసి జ‌గ‌న్ ధ‌ర్నా చేప‌ట్టారు. ఈ ధ‌ర్నాకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్‌, మ‌మ‌తాబెన‌ర్జీ పార్టీకి చెందిన ఎంపీలు, అలాగే అన్నాడిఎంకే త‌దిత‌ర ఇండియా కూట‌మి నేత‌లు హాజ‌రై సంఘీభావం తెలిపారు.

అధికారం శాశ్వ‌తం కాద‌ని, చంద్ర‌బాబు ప్ర‌భుత్వ తీరు బాగాలేద‌ని ప‌లువురు నేత‌లు హిత‌వు ప‌లికారు. ఢిల్లీలో ధ‌ర్నా వైసీపీ ఊహించిన దానికంటే మెరుగ్గా విజ‌య‌వంత‌మైంది. దీంతో వైసీపీలో జోష్ క‌నిపించింది. ఆ త‌ర్వాత పులివెందులలో జ‌గ‌న్ వ‌రుస ప‌ర్య‌ట‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌నం నుంచి విప‌రీత‌మైన స్పంద‌న క‌నిపించింది. నెల్లూరు జైల్లో పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని, వినుకొండ‌లో వైసీపీ కార్య‌క‌ర్త ర‌షీద్‌ను టీడీపీ కార్య‌క‌ర్త హ‌త్య చేయ‌గా బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్లిన‌ప్పుడు ప్ర‌జా స్పంద‌న వెల్లువెత్తింది. జ‌నంలో జ‌గ‌న్‌పై ఆద‌ర‌ణ త‌ర‌గ‌లేద‌ని, మ‌ళ్లీ అధికారంపై వైసీపీలో విశ్వాసం క‌లిగింది.

మ‌రోవైపు విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవ‌డంలో ప్ర‌భుత్వం అట్ట‌ర్ ప్లాప్ కావ‌డం వైసీపీకి రాజ‌కీయంగా క‌లిసొచ్చే అంశం. వ‌ర‌ద బాధితుల్ని రెండుసార్లు జ‌గ‌న్ ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్లారు. ఈ సంద‌ర్భాల్లో అనూహ్య స్పంద‌న ల‌భించింది. జ‌గ‌న్ ఓడినా జ‌నంలో మాత్రం ఆయ‌న ఉన్నార‌ని వైసీపీకి న‌మ్మ‌కం ఏర్ప‌డింది. ఇవ‌న్నీ పాజిటివ్ అంశాలు. ఇదే సంద‌ర్భంలో జ‌గ‌న్‌కు ఆద‌ర‌ణ చూసి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు క‌న్ను కుట్టింది. జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా శాశ్వ‌తంగా సమాధి చేయ‌డానికి తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదాన్ని జంతువుల కొవ్వుతో వైసీపీ ప్ర‌భుత్వం త‌యారు చేయించింద‌ని వంద‌రోజుల పాల‌న పూర్తి అయిన సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు పెద్ద బండ వేశారు.

దీంతో జ‌గ‌న్‌తో స‌హా వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. దీని నుంచి బ‌య‌ట ప‌డ‌డం అసాధ్య‌మ‌ని వైసీపీ భ‌య‌ప‌డింది. ఆ త‌ర్వాత వాస్త‌వాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట ప‌డ‌డంతో వైసీపీ ఊపిరి పీల్చుకుంది. మ‌రీ ముఖ్యంగా గ‌త నెల 30న సుప్రీంకోర్టు క‌ల్తీకి ఆధారాలు ఏవి? అని ప్ర‌శ్నించ‌డం, రాజ్యాంగ ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి బాధ్య‌తా రాహిత్యంగా మాట్లాడ్డం ఏంట‌ని చంద్ర‌బాబుకు మొట్టికాయ‌లు వేసింది. అంతేకాదు, క‌ల్తీ జ‌ర‌గ‌లేద‌ని సుప్రీంకోర్టు కామెంట్స్ చేయ‌డంతో దేశ వ్యాప్తంగా చంద్ర‌బాబునాయుడు, ప‌వ‌న్‌క‌ల్యాన్ దోషులుగా నిలిచారు. ఈ ప‌రిణామాలు వైఎస్ జ‌గ‌న్‌కు పాజిటివ్ అయ్యాయి. జాతీయ స్థాయిలో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇమేజ్ డ్యామేజీ అయ్యింది.

ఇక నెగెటివ్ అంశాల‌కు వెళితే… పార్టీ నిర్మాణానికి ఒక స‌ల‌హాదారుడిని నియ‌మించుకోవ‌డం. ఒకింత ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఓట‌మిపై ఆత్మ విమ‌ర్శ చేసుకుని, గుణ‌పాఠాలు నేర్చుకుంటే ఏ స‌ల‌హాదారుడు అవ‌స‌రం లేద‌నే మాట వినిపిస్తోంది. ఇప్ప‌టికీ జ‌గ‌న్ సామాన్యులు క‌ల‌వ‌డానికి ఇబ్బందే. తాడేప‌ల్లికి వెళ్లిన ఎవ‌రైనా జ‌గ‌న్‌ను క‌ల‌వాలంటే అపాయింట్‌మెంట్ లేకున్నా ఫ‌ర్వాలేద‌నే ప‌రిస్థితి రావాలి. కానీ తాడేప‌ల్లిలోని జ‌గ‌న్ క్యాంప్ కార్యాల‌యానికి వెళుతున్న సామాన్య ప్ర‌జ‌లు, జ‌గ‌న్ అభిమానుల‌కు తీవ్ర నిరాశే మిగులుతోంది. ఓడిపోయినా ఇంకా జ‌గ‌న్‌ను క‌ల‌వ‌నీయ‌రా? ఇక శాశ్వ‌తంగా ఆయ‌న‌కు దూరం కావాల‌నేంత‌గా విర‌క్తి, అస‌హ‌నం, ఆగ్ర‌హం వైసీపీ కార్య‌క‌ర్త‌లు, ద్వితీయ శ్రేణి నాయ‌కుల్లో క‌లిగిస్తున్నారు.

జ‌గ‌న్ చుట్టూ ఉన్న కోట‌రీనే ఆయ‌న‌కు న‌ష్టం క‌లిగిస్తున్నార‌నే అభిప్రాయం జ‌నంలో బ‌లంగా వుంది. ఓడిపోయినా జ‌గ‌న్‌ను ఇంకా తాడేప‌ల్లి ప్యాలెస్‌లోనే బంధించార‌నే ఆరోప‌ణ లేకపోలేదు. జ‌గ‌న్ మాస్ లీడ‌ర్ అని, ఆయ‌న్ను జ‌నంతో మ‌మేకం కానివ్వ‌క‌పోతే తీవ్రంగా న‌ష్టం క‌లిగించిన వార‌వుతార‌నే ఆగ్ర‌హం కార్య‌క‌ర్త‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్ర‌ధానంగా వైసీపీలో స‌మ‌న్వ‌య లోపం క‌నిపిస్తోంది. వైసీపీకి నాలెడ్జ్ సెంట‌ర్ లేదు. అలాగే కార్య‌క‌ర్త‌లు, ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌కు తాడేప‌ల్లిలోని పార్టీ పెద్ద‌ల‌తో సంబంధాలు ఉండ‌డం లేదు. జ‌గ‌న్ ఏనాడూ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో మాట్లాడిన దాఖ‌లాలు లేవు. పోనీ జ‌గ‌న్ నుంచి కార్య‌క‌ర్త‌లు కోరుకుంటున్న‌ది కూడా ఏమీ లేదు. జ‌స్ట్ ఆయ‌న‌తో సెల్ఫీ దిగితే మ‌హ‌దానంద‌ప‌డిపోతారు. ఆ మాత్రం ఆనందం నింప‌డానికి కూడా వైసీపీ పెద్ద‌ల‌కు చేత‌కావ‌డం లేదు, మ‌న‌సు రావ‌డం లేదు.

జ‌గ‌న్ కోరుకుంటున్న నాయ‌కులు ఆయ‌న‌కు దూర‌మ‌వుతున్నారు. జ‌గ‌న్ కావాల‌ని కోరుకుంటున్న కార్య‌క‌ర్త‌లు, ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌కు ఆయ‌న దూరంగా ఉన్నారు. ఇద్ద‌ర్నీ క‌లిపే వ్య‌వ‌స్థ ఏర్ప‌డేంత వ‌ర‌కూ వైసీపీకి మంచి రోజులు లేన‌ట్టే. నిజానికి చంద్ర‌బాబు స‌ర్కార్ వంద రోజులు పాల‌న పూర్త‌య్యేస‌రికి జ‌నంలో వ్య‌తిరేక‌త టాక్ తెచ్చుకుంది. దీన్ని రాజ‌కీయంగా సొమ్ము చేసుకునే వ్య‌వ‌స్థ వైసీపీ వ‌ద్ద లేనేలేదు.

నెమ్మ‌దిగా చంద్ర‌బాబు స‌ర్కార్‌పై వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ఈ వ్య‌తిరేక‌త అంతా వైసీపీకి సానుకూలంగా మారాలి. అలా మారుతున్న వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం లేదు. దొందు దొందే అనే నిట్టూర్పు జ‌నం నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికిప్పుడే జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త పోయేలా లేదు. ఘోరంగా ఓడిపోయిన పార్టీకి ఒక్క‌సారిగా అనుకూల వాతావ‌ర‌ణం ఉండ‌దు. కానీ అయ్యో పాపం జ‌గ‌న్ అనే సానుభూతి క్ర‌మంగా బిల్డ‌ప్ కావాలి. అది చాలా త‌క్కువ‌గా అవుతోంది.

మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబు స‌ర్కార్ ఒక ప‌థ‌కం వైసీపీ ప్ర‌భుత్వంపై దారుణ‌మైన నిందారోప‌ణ‌లు వేస్తోంది. వీటికి గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చే అధికార ప్ర‌తినిధులు క‌రువ‌య్యారు. జ‌గ‌న్‌కు తెలుస‌నో, లేక మ‌రో ముఖ్య నాయ‌కుడికి స‌న్నిహిత‌మ‌నో అధికార ప్ర‌తినిధి ప‌ద‌వుల్ని క‌ట్ట‌బెట్టారు. అంతే త‌ప్ప‌, కాసింత రాజ‌కీయ‌, సామాజిక‌, ఆర్థిక అంశాల‌పై జ్ఞానం ఉన్న వాళ్ల‌ను పార్టీ వాయిస్‌ను బ‌లంగా వినిపించ‌డానికి ప‌ద‌వులు ఇవ్వ‌క‌పోవ‌డం అతి పెద్ద లోపం.

ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌కాశం బ్యారేజీని మూడు బోట్ల‌తో ధ్వంసం చేసి, ల‌క్ష‌లాది మంది విజ‌య‌వాడ ప్ర‌జ‌ల ఉసురు తీయ‌డానికి జ‌గ‌న్ పార్టీ నాయ‌కులు కుట్ర‌ప‌న్నార‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆరోపించ‌డం, దాన్నే కూట‌మి నేత‌లు అందుకుని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఎద్దు ఈనిందంటే గాటికి క‌ట్టేయ‌మ‌ని టీడీపీ నేత‌లు చెబితే, క‌ట్టేస్తామ‌ని ముందుకొచ్చే వాళ్ల‌ను చూస్తున్నాం. కానీ ఎద్దు ఎలా ఈనుతుంద‌నే ప్ర‌శ్న‌ను జ‌నం మెద‌ళ్ల‌లో మొల‌కెత్తించ‌డంలో వైసీపీ అధికార ప్ర‌తినిధులు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. ఇలాగైతే భ‌విష్య‌త్‌లో గ‌ట్టు ఎలా ఎక్కుతారో ప్ర‌శ్నించుకోవాలి.

వైసీపీ సోష‌ల్ మీడియాలో లాజిక్‌గా, దీటుగా కౌంట‌ర్ ఇచ్చే పోస్టులు క‌నిపించ‌డం లేదు. ఎవ‌రైనా స్వ‌చ్ఛందంగా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకంగా ఒక పోస్టు లేదా వీడియో పెడితే, అలాంటి వాటిని మాత్ర‌మే వైర‌ల్ చేసుకుంటున్నారు. అస‌లు సోష‌ల్ మీడియాను శ‌క్తిమంతంగా వాడుకోవ‌చ్చ‌నే స్పృహే వైసీపీ పెద్ద‌ల‌కు లేన‌ట్టుంది. ముఖ్యంగా జ‌గ‌న్ త‌న‌కు తెలిసిన వాళ్ల‌కు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌కుండా, కాసింత జ్ఞానం ఉన్న వాళ్ల‌ను కీల‌క ప‌ద‌వుల్లో నియ‌మించాలి. ఇది జ‌రిగిన‌ప్పుడే టీడీపీని లేదా కూట‌మిని దీటుగా ఎదుర్కోగ‌ల‌రు.

అన్నింటికంటే ముఖ్యంగా అధికారం మ‌ళ్లీ మ‌న‌దే అనే అతి విశ్వాసం నుంచి వైసీపీ దూరంగా వుండాలి. అతి విశ్వాసం నిర్ల‌క్ష్యాన్ని, ప్ర‌త్య‌ర్థుల‌పై త‌క్కువ అంచ‌నాను క‌లిగిస్తుంది. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబునాయుడిని జ‌నం న‌మ్మ‌ర‌నే భ్ర‌మ నుంచి జ‌గ‌న్ బ‌య‌ట‌ప‌డాలి. రాజ‌కీయాల్లో వ్య‌క్తిగ‌త ప్రేమాభిమానాల‌కు చోటు వుండ‌దు. లాభ‌న‌ష్టాలు మాత్ర‌మే గెలుపోట‌ముల‌ను నిర్ణ‌యిస్తాయి. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును జ‌నం న‌మ్మ‌ర‌నే అతి విశ్వాస‌మే జ‌గ‌న్ కొంప ముంచింది.

ముందుగా బ‌త‌క‌డం నేర్చుకో
ఆ త‌ర్వాత నీతిగా బ‌త‌కొచ్చు
అనే గ్రీకు సామెత‌ను జ‌గ‌న్‌, వైసీపీ నాయ‌కులు స్ఫూర్తిగా తీసుకోవాలి.

ముందు అధికారంలోకి వ‌చ్చే మార్గం చూసుకోవాలి. ఆ త‌ర్వాత ఏమైనా చేయొచ్చు అని వైసీపీ గ్ర‌హించాలి. నీతి సూక్తులు చెబుతూ కూర్చుంటా అని జ‌గ‌న్ భీష్మించుకుని కూచుంటే, వైసీపీ నేత‌లు త‌మ దారి తాము చూసుకుంటారు. ఎన్నిక‌ల హామీలు అమ‌లు చేయ‌క‌పోయినా స‌రే, కూట‌మి మ‌ళ్లీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించ‌క త‌ప్ప‌దు.

ప్ర‌తిప‌క్ష పార్టీగా వైసీపీకి 100కు 45 మార్కులు వేయొచ్చు. అది కూడా టీడీపీ చేష్ట‌ల వ‌ల్ల వైసీపీ గ్రాఫ్ పెరిగింది. ఇందులో జ‌గ‌న్ కృషి 20 శాతం మాత్ర‌మే. మిగిలిందంతా చంద్ర‌బాబు అడ్మినిస్ట్రేష‌న్ ఫెయిల్యూర్‌, లోకేశ్ రెడ్‌బుక్ పుణ్య‌మే అని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రీ ముఖ్యంగా తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంపై చంద్ర‌బాబు అబ‌ద్ధాలు చెప్పార‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో కూట‌మి ప్ర‌భుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తోంది.

54 Replies to “నాలుగు నెలల్లో జ‌గ‌న్‌కు ఎన్ని మార్కులు?”

  1. 100 కి 175 వచ్చేస్తాయని డప్పులు కొట్టుకుని.. 11 కి చతికిలపడ్డాడు..

    ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాడు.. బెంగుళూరు లో సేద తీరుతున్నాడు..

    ఇక్కడ నేను కామెంట్స్ పెడితే.. నా పెళ్ళాం ఎవడితోనో లేచిపోయింది అని రాసుకుని సంతోషపడిపోయే నీలి మూకకి..

    ఇప్పుడు నీ జగన్ రెడ్డి ట్విట్టర్ లో ట్వీట్లు చేసుకుంటూ గడుపుతున్నాడు.. వాడి పెళ్ళాం ఎవడితో లేచిపోయిందో .. వెళ్లి చూసుకోండి..

    1. కొత్తగా లేచిపోవడం ఏంటి… ఎప్పుడో అవినాష్ గాడితో రంకు లో మునిగి తేలుతుంటేను

  2. జగన్ రెడ్డి పెంచి పోషిస్తున్న వైసీపీ సోషల్ మీడియా.. ఇప్పుడు జగన్ రెడ్డి మీద ఆశలు వదిలేసుకొని.. తమిళనాడు ఉదయనిధి స్టాలిన్ ని లేపుతున్నారు..

    కుక్కల తాపత్రయం ఇలా ఉంటుంది..

    ఇంట్లో పెంచుకొనే కుక్కలే జగన్ రెడ్డి ని దేకడం లేదు.. ఇక వాడికి మార్కులు ఆశిస్తున్నావా..?

    1. Anniyya daggara chala kukkalu vunnai….!

      Gutka thine kukkalu

      Video calls lo matadukune variety kukkalu

      Bhoothulu matlade kukkalu

      Bags Balasina oka Aada kukka

      Guddlu pette kukka

      Paleru kukka

      Adultery kukkalu ……😁

  3. ప్యాలెస్ పులకేశి మొన్నే బెంగళూర్ డాక్టర్ దగ్గరకి వెళ్లు అంట.

    కొత్త జబ్బు ఏంది అని అడిగాడు ఆ డాక్టర్.

    నిద్రలో కేకు బదులు “లడ్డూ కావాలా నాయనా” అనే కల ప్రతి రోజూ వస్తుంది.

    హిందూ ఓట్లు కోసం వేరే దేముడి పేరు నా నాలుక మీద పలికనుందుక్ శిక్ష గా, మా ఆవిడ మా ప్రతిరోజూ మోకాళ్ళ ప్రార్థన చెపిస్తుంది ” అని చెప్పారు అంట.

  4. మన అన్నయ్య కు నిజం గా మంచి జరగాలని కోరుకునే వాడివి ఐతే….అధికారం లో వున్నప్పుడు కళ్ళు మూసుకుపోయి , కమిషన్ల మత్తులో పడి నీచమైన అరాచకాలు , దౌర్జన్యాలు చేస్తున్నప్పుడే హెచ్చరించేవాడివి…..ఎన్ని ఘోరాలు చేసినా ఆహా వోహో అని పొగిడి…ఇప్పుడు పార్టీ మూసేసే టైం లో నీతులు చెప్తున్నావా GA…..😂😂😂

  5. చంద్రబాబు గారి ఫెయిల్యూర్ లు గత ప్రభుత్వం లో అవినీతి సొమ్మును కక్కించకపోవటమే బాబాయ్ హత్య తేలనివ్వక పోవటం జగన్ గారి మీద అవినీతి కేసులు త్వరగా తేల్చి ఆ సొమ్మును ఖజానాకు జమ చెయ్యక పోవటమే ఇప్పుడు త్వరలో ఉభయగోదావరి కృష్ణ గుంటూరు జిల్లాలలో గ్రాడ్యుయేట్స్ ఎన్నుకొనే మ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి మనోడి స్కోర్ అప్పుడు పాత 40 % వుందా లేదా అనేది తేలిపోతుంది

  6. Vaaadoka psycho. Vaadiki 45 marks? Next time 1 as per Pawan. Realistically speaking ,the sympathy that Jag got is nothing compared Pawan got when he won 1 MLA That is why ,they gave him 11. Next time only 1 as GOD ordained and Pawan prophecies, because J is injurious to society. In Indian Govt ,a case like jetwani happens

  7. విజయవాడ వరద ఖర్చుల్లో భారీ అవినీతి: 534కోట్ల.

    ఒక్కో భోజనానికి రూ.264

    కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లుగా ప్రభుత్వం రాసేసింది. వరద బాధితులకు భోజనం కోసం ఏకంగా రూ.368కోట్లుగా సర్కార్ లెక్క చెప్పింది. ఒక్కో భోజనానికి రూ.264 ఖర్చు చేసినట్టు లెక్కల్లో చూపించారు.

  8. ఏమి చేసినా ఇంకో 4.5 సంవత్సరాల వరకు మార్కులు పెరిగే అవకాశం లేదు

  9. “ముందుగా బ‌త‌క‌డం నేర్చుకో ఆ త‌ర్వాత నీతిగా బ‌త‌కొచ్చు అనే గ్రీకు సామెత‌ను జ‌గ‌న్‌, వైసీపీ నాయ‌కులు స్ఫూర్తిగా తీసుకోవాలి.”..lol..is this article written by MBBS?

    1. వీకెండ్ కదా, అన్నం తిన్నోడు దొరికుంటాడు ఈ ఆర్టికల్ రాయటానికి

  10. దయచేసి ఆ శీర్షికలు వ్రాసే వాడి చేతిలో మండే బొగ్గులు పెట్టండి. 4 నెలలు, 6 నెలలు, 9 నెలలు ఏమిటి అసహ్యంగా ఏదో గర్భం ఎదుగుదల సూచి లాగా.

  11. if at all the graphi raising for jagan means its because of terrible fiascos from CBN but not due to jagans aggresive activities still he is in his lethargic and stolidness mood , must get up and take a flamboyant action

  12. Like his father he must mingle with public to create trust and who should bring back every one and make them feel that he is one among them, why he is not doing still I cannot figure out, it’s first and foremost ideology of a politician or a leader

  13. next 1/175 as per Pawan. the only thing Pawan wants as he believes that automatically brings about development, like me. in 2029 also CBN is CM as per Pawan wish

  14. Whoever made this analysis are living in dreams.

    Cannot realize the real pic in the public.

    Yes, CBN did only one statement at wrong place and wrong time. That can be capitalized by your favorite Jaggu bhai, but he dropped that catch so easily.

    But you are giving so many marks to him. All the best.

  15. 1. చెత్త పన్ను తీసేశారు

    2.క్వాటర్ బాటిల్ మందు 95 కే ఇస్తున్నారు. వై చీపి కాలంలో 200 ఉండేది.

    3.3000 పెన్షన్ 4000 చేశారు మొదటి తారీకు నే అందిస్తున్నారు అందరికీ ఒలంటీర్లు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులతో. దానివల్ల రెండు లక్షల మంది వాలంటీర్లు వై చీపి కార్యకర్తలు వారికి ఇచ్చే ఐదు వేల డబ్బులు ప్రభుత్వానికి మిగులుతున్నాయి.

    4.దీపావళి పండుగ నుండి మూడు సిలిండర్లు గ్యాస్ ఇస్తున్నారు.

    5.అన్న క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేశారు ఇప్పుడు 150 క్యాంటీన్ నడుస్తున్నాయి.

    6.ఉద్యోగస్తులకు అందరికీ మొదటి తారీకున జీతాలు ఇస్తున్నారు పెన్షన్లు అందరికీ అదే రోజున రోజున ఇస్తున్నారు. అంతకుముందు ఎప్పుడు వీలు పడితే అప్పుడు ఇచ్చేవారు పది రోజులు 15 రోజులు లేట్ అయ్యేది.

    7.విశాఖపట్నం రైల్వే జోన్ శంకుస్థాపన తొందరలో జరుగుతుంది. ప్రధానమంత్రిని రమ్మని అడుగుతున్నారు శంకుస్థాపనకు డేట్ పెడతారు.

    8.వర్షాలు వరదలు వల్ల పోలవరం డ్యాం పనులు ఆగాయి డిసెంబర్ నుండి పోలవరం పనులు మొదలవుతాయి 12 వేల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి.

    9.రాజధాని పనులు ఐదు సంవత్సరాల నుండి ఆపేశారు. టెక్నికల్ గా ఐఐటీ నుండి ఓకే అని రిపోర్టు వచ్చింది. ఆ పనులు డిసెంబర్ నుండి మొదలు పెడుతున్నారు.

    10. పంచాయతీల నుండి జగన్మోహన్ రెడ్డి 1300 కోట్లు రూపాయలు లాగేశాడు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం 13500 పంచాయితీలకు 1300 కోట్ల రూపాయలు ఇచ్చారు. గ్రామాల్లో పనులు చేయడానికి.

    11. సుజల స్రవంతి మంచినీరు పథకం కేంద్రం ఇచ్చేది జగన్ ఆపేశాడు ఇప్పుడు దాన్నే మళ్లీ తీసుకువచ్చారు పనులు మొదలు పెడుతున్నారు గ్రామాల్లో అందరికీ మంచినీరు ఇవ్వటానికి.

    12. ఎవరికి ఏ పనిలో అనుభవం ఉంది ఏం పని చేయాలనుకుంటున్నారు అనే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని మొదలు పెడుతున్నారు అందరూ ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ల నేర్పు తెలివిని బట్టి వారికి ట్రైనింగ్ ఇస్తారు భవిష్యత్తు జాగాల కోసం.

    13. 6 200 పోలీసులకు ఉద్యోగాలకు తీసుకోవడానికి నిర్ణయం జరిగింది కార్యక్రమం మొదలుపెట్టారు.

    డీఎస్సీ 16వేల టీచర్ ఉద్యోగాలకి కార్యక్రమం జరుగుతూ ఉంది డిసెంబర్ లోపు నింపేస్తారు.

    14. గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో చీఫ్ మినిస్టర్ కూర్చోలేదు ఇంట్లోనే కూర్చునేవాడు.

    ఇప్పుడు అందరూ సెక్రటేరియట్ లోనే ఉంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు సీఎం గారు అక్కడే ఉంటున్నారు.

    15. ప్రపంచ బ్యాంకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ లోన్ ఇవ్వటానికి వస్తే జగన్ అండ్ గ్యాంగ్ వాళ్లను ఆపేశారు దొం గ రిపోర్టులు ఇచ్చి లోన్ ఇవ్వద్దు రాజధానికి అని. మళ్ళా వాళ్లే ఇప్పుడు వచ్చి మూడుసార్లు పర్యటించి అమరావతికి ఇప్పటికిప్పుడు నవంబర్ నుంచి 17 వేల కోట్లు ఇవ్వటానికి అగ్రిమెంట్ చేసుకున్నారు నవంబర్ 15 అవుతుంది.

    16. ఐకానికి భవంతులు అమరావతిలో నీళ్లలో మునిగి ఉన్నాయి ఐదు సంవత్సరాలు జగన్ పట్టించుకోలేదు ఇప్పుడు వాటికి నిర్మాణ కాంట్రాక్టులో తీసుక కుంటున్నారు. పనులు డిసెంబర్ నుంచి మొదలవుతున్నాయి దానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు సిద్ధం చేశారు.

    17. ఆర్టీసీ బస్సులు కొత్తవి 1500 ఇప్పటికే చాలా బస్టాండ్లకు ఇచ్చారు. అంతకు ముందు ఐదు సంవత్సరాలు ఒక్క బస్సు కూడా కొనలేదు.

    18. ఐదు సంవత్సరాలలో జగన్ 4,80,000 చెట్లను న రి కే శా డు. కొత్త ప్రభుత్వం వచ్చి కొన్ని లక్షల చెట్లు రాష్ట్రమంతా నాటారు.

    19. తుఫాన్ వరదలు వస్తే చందా వసూలు చేసి ఒక్క రూపాయి నష్టపోయిన వారికి ఇవ్వలేదు జగన్ పాలనలో కానీ కొత్త ప్రభుత్వం విజయవాడలో వరదలు వస్తే 10 రోజులు అక్కడే ఉండి అందరూ చందాలు వేసుకొని 450 కోట్లు రూపాయలు కరెక్ట్ చేసి అందరికీ సహాయం చేశారు.

    20. దగ్గర ఉండి బుడమేరకు వచ్చిన మూడు గండ్లు పూడ్చి వేశారు ఇక పరిశ్రమలు ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటికే సుమారు పది లక్షల కోట్లకు చేరుకున్నాయి ఇవన్నీ అంచలంచలుగా అమలులోకి వస్తాయి.

    21. కొత్తగా ఏడు విమానాశ్రయాలు కట్టడానికి పథకాలు రచిస్తున్నారు. ఎయిర్ కనెక్టివిటీ ఎక్కువగా చేసే ప్రయాణాలు పెంచి ఆర్థిక పుష్టి కలిగించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే బొంబాయికి రెండు ఢిల్లీకి రెండు విమానాలు ఎక్స్ట్రా గ నడిపిస్తున్నారు గన్నవరం నుండి..

    22. తిరుమలలో చక్కటి లడ్డు అందిస్తున్నారు..

    1.  తిరుమలలో లడ్డూలు కొన్న వారు చెప్తున్నార అద్భుతంగా ఉన్నాయి అని చాలా మార్పు వచ్చింది అని.

      23. లులు కంపెనీ విజయవాడ విశాఖపట్నం తిరుపతిలో 3 అంతర్జాతీయ షాపింగ్ మాల్స్ పెడుతున్నారు

      ఇలా ఒక్కొక్క ఐటమ్ చెప్పుకుంటూ పోతే 10 లక్షల కోట్ల పెట్టుబడున విషయంలో పది పేజీలు ఈక్కడ రాయవలసి వస్తది ..ఇవ్వని నీకు కనపడపోవడానికి నీలి కామెర్లు వచ్చినట్లుంది .

      ఇక జగన్ ఎన్ని మార్కులు వేస్తావో నీ విజ్ఞతకే వదిలేస్తున్న

Comments are closed.