మీ ఎమ్మెల్యేల ప‌నితీరు ఎలా వుందంటూ ఫోన్‌కాల్స్‌!

కూట‌మి ప్ర‌భుత్వ పెద్ద‌లు అప్ర‌మ‌త్తం అయ్యారు. ముఖ్యంగా అధికారంలో కీల‌క భాగ‌స్వామి అయిన టీడీపీ అధికారాన్ని నిల‌బెట్టుకోవ‌డంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా త‌మ ఎమ్మెల్యేలు, మంత్రుల ప‌నితీరుపై టీడీపీ అధిష్టానం నిఘా పెట్టింది.…

కూట‌మి ప్ర‌భుత్వ పెద్ద‌లు అప్ర‌మ‌త్తం అయ్యారు. ముఖ్యంగా అధికారంలో కీల‌క భాగ‌స్వామి అయిన టీడీపీ అధికారాన్ని నిల‌బెట్టుకోవ‌డంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా త‌మ ఎమ్మెల్యేలు, మంత్రుల ప‌నితీరుపై టీడీపీ అధిష్టానం నిఘా పెట్టింది. ఈ క్ర‌మంలో టీడీపీ కేంద్ర కార్యాల‌యం నుంచి కార్య‌క‌ర్త‌లు, గ్రామ‌, మండ‌ల నాయ‌కుల‌కు ఫోన్‌కాల్స్ వెళుతున్నాయి.

మీ ఎమ్మెల్యే లేదా మంత్రి ప‌ని తీరు ఎలా వుంది? అంటూ ఆరా తీస్తున్నారు. శ్యాండ్‌, ల్యాండ్ త‌దిత‌ర అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారా? అని అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే వ్యాపారుల‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారా? అని ఆరా తీస్తున్న‌ట్టు టీడీపీ కార్య‌క‌ర్త‌లు చెబుతున్నారు. ప్ర‌తి విష‌యాన్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటున్నారు.

ప్ర‌భుత్వం కొలువు దీరి నాలుగు నెల‌ల‌వుతోంది. ఇంత త‌క్కువ కాలంలో కూట‌మి ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వ‌స్తోంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ జాగ్ర‌త్త ప‌డ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ ప్ర‌భుత్వ ఓట‌మి నుంచి గుణ‌పాఠం నేర్చుకోడానికి టీడీపీ రెడీ అయ్యింది.

అప‌రిమిత‌మైన అధికారం ద‌క్క‌డంతో టీడీపీ నేత‌లు చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు రెచ్చిపోతున్నార‌ని అంటున్నారు. అందుకే అధికారాన్ని కాపాడుకోడానికి ఇప్ప‌టి నుంచే చంద్ర‌బాబునాయుడు జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

12 Replies to “మీ ఎమ్మెల్యేల ప‌నితీరు ఎలా వుందంటూ ఫోన్‌కాల్స్‌!”

  1. అవును, ఇప్పటికిప్పుడు మరలా ఎన్నికలకు వెళ్తే వైసీపీ కి 151 పైనే రావొచ్చు అని తేలిందట.

    1. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన మన అన్న కి 175 కి 175 పక్కా….అందుకే అప్పుడు ఎంజో చెయ్యలేం అని ఇప్పుడు వారానికి ఒక రెండు సార్లు బెంగళూరు వెళ్లి రిలాక్స్ అయ్యి వస్తుంటారు

    2. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన మన అన్న కి 175 కి 175 పక్కా….అందుకే అప్పుడు enjoy చెయ్యలేం అని ఇప్పుడు వారానికి ఒక రెండు సార్లు బెంగళూరు వెళ్లి రిలాక్స్ అయ్యి వస్తుంటారు

    3. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన మన అన్న కి 175 కి 175 పక్కా….అందుకే అప్పుడు enjoy చెయ్యలేం అని ఇప్పుడు వారానికి ఒక రెండు సార్లు బెంగళూరు వెళ్లి రిలాక్స్ అయ్యి వస్తుంటారు

  2. విజయవాడ వరద ఖర్చుల్లో భారీ అవినీతి: 534కోట్ల.

    ఒక్కో భోజనానికి రూ.264

    కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లుగా ప్రభుత్వం రాసేసింది. వరద బాధితులకు భోజనం కోసం ఏకంగా రూ.368కోట్లుగా సర్కార్ లెక్క చెప్పింది. ఒక్కో భోజనానికి రూ.264 ఖర్చు చేసినట్టు లెక్కల్లో చూపించారు.

    రూ.534కోట్లలో ఆహారం, నీళ్లు, వసతి, పారిశుద్ధ్యం కోసం ఖర్చు చేసినట్టు తెలిపారు. అయితే, వరదల సందర్భంగా తమకు 10 రోజుల పాటు ఆహారం, నీళ్లు అందక బాధితులు గగ్గోలు పెట్టారు.

Comments are closed.