షాకింగ్.. ఇంకా పెండింగ్ లోనే కల్కి?

ప్రభాస్ తాజా చిత్రం కల్కి. థియేటర్లలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ స్టామినాను మరోసారి చూపించింది. ఓవర్సీస్ లో దుమ్ము దులిపింది. ఆ తర్వాత ఓటీటీలో కూడా…

ప్రభాస్ తాజా చిత్రం కల్కి. థియేటర్లలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ స్టామినాను మరోసారి చూపించింది. ఓవర్సీస్ లో దుమ్ము దులిపింది. ఆ తర్వాత ఓటీటీలో కూడా సత్తా చాటింది.

మరి ఇన్ని రికార్డులు సృష్టించిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ హాట్ కేకులా అమ్ముడుపోవాలి కదా. ఈ పాటికే ఏదో ఒక ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకోవాలి కదా. కానీ అలా జరగలేదు.

వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. కల్కి సినిమా శాటిలైట్ డీల్ ఇంకా పూర్తికాలేదు. ప్రారంభంలో స్టార్ మా ఛానెల్ చుట్టూ తిరిగిన ఈ సినిమా, ఇప్పుడు జీ గ్రూప్ దగ్గర ల్యాండ్ అయింది.

సినిమా శాటిలైట్ రైట్స్ తీసుకునేందుకు జీ గ్రూప్ సూచనప్రాయంగా అంగీకరించింది. రేటు కూడా లాక్ అయింది. అయితే అగ్రిమెంట్ మాత్రం ఇంకా పూర్తికాలేదని తెలుస్తోంది. మిగతా భాషల శాటిలైట్ రైట్స్ పై ఓ అవగాహనకు వచ్చిన తర్వాత అగ్రిమెంట్ చేస్తారట.

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన కల్కి సినిమా ఇంకా శాటిలైట్ డీల్ పూర్తిచేసుకోకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. శాటిలైట్ మార్కెట్ ఏ స్థాయిలో పడిపోయిందో చెప్పడానికి బహుశా కల్కికి మించిన ఉదాహరణ ఉండదేమో.

5 Replies to “షాకింగ్.. ఇంకా పెండింగ్ లోనే కల్కి?”

  1. మనకి ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం ఉన్నంతవరకే అది కూడా యాడ్స్ లేకుండా చూసే సౌలభ్యం OTT లలో ఉంటే ఇక టీవీ లలో చూసేదెవరు? న్యూస్ కూడా ఫోన్ లలో వెబ్సైటు లలో చూస్తున్నారు!

Comments are closed.