కొత్త జిల్లాల గోలేంటి?

ఏపీలో మళ్లీ కొత్తగా జిల్లాలు ఏర్పాటు అవుతాయా, వైసీపీ హయాంలో వచ్చిన జిల్లాలలో మార్పులు చేర్పులూ భారీగా జరుగుతాయా అన్న దాని మీద విపరీతమైన ప్రచారం సాగుతోంది. 2014లో విభజన తరువాత ఏపీ 13…

ఏపీలో మళ్లీ కొత్తగా జిల్లాలు ఏర్పాటు అవుతాయా, వైసీపీ హయాంలో వచ్చిన జిల్లాలలో మార్పులు చేర్పులూ భారీగా జరుగుతాయా అన్న దాని మీద విపరీతమైన ప్రచారం సాగుతోంది. 2014లో విభజన తరువాత ఏపీ 13 జిల్లాలతో ఉంది. దానికి వైసీపీ అధికారంలోకి వచ్చాక 26 జిల్లాలను చేసింది.

ఈ 26 జిల్లాలలో కొన్నింటి మీద అసంతృప్తి ఉంది. కొన్ని చోట్ల కొత్తగా జిల్లాలు కావాలని ఒక భావోద్వేతమైన డిమాండ్ కూడా ఉంది. దీంతో టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని సరిచేసి అందరికీ ఆమోదయోగ్యంగా జిల్లాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.

ఇపుడు టీడీపీ కూటమి ఆ పని మీదనే ఉందా అన్నది అంతా తర్కించుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే ఫలానా జిల్లాలు రద్దు అవుతాయి ఈ ప్రాంతాలు కొత్త జిల్లాలు అవుతాయని ప్రచారం చేస్తున్నారు. గ‌తంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లిని జిల్లాగా చేశారు.

అయితే ప్ర‌స్తుతం అనకాపల్లి జిల్లా ఎగిరిపోతుందని ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది. జిల్లాల ఏర్పాటులో విశాఖని చిన్న జిల్లాగా చేశారు అని విమర్శలు వచ్చాయి. పైగా విశాఖకు గ్రామీణ ప్రాంతం అన్నది లేకుండా విభజన జరిగింది అని కూడా అంతా పాయింటవుట్ చేశారు.

దాంతో ఇపుడు ఆ కొరతను అధిగమించేలా పూర్వం మాదిరిగానే అనకాపల్లిని విశాఖలో కలిపేస్తారు అని ఆ జిల్లాను రద్దు చేస్తారు అని ప్రచారం అయితే ఉంది. ఇది ఒట్టి గాసిప్ మాత్రమే అని ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నా ప్రచారం అలాగే సాగుతోంది.

బాపట్ల జిల్లా రద్దు అవుతుంది అన్న దాని మీద మంత్రి ఒకరు క్లారిటీ ఇస్తూ రద్దు సమస్య లేదని చెప్పారు. అలాగే అనకాపల్లి జిల్లా విషయంలో కూడా స్పష్టత వస్తే తప్ప ఈ పుకార్లు ఆగేట్లుగా లేవని అంటున్నారు. కొత్త జిల్లాల గురించి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అన్నది కూడా అంతా తర్కించుకునే పరిస్థితి ఉందిప్పుడు.

42 Replies to “కొత్త జిల్లాల గోలేంటి?”

      1. కడప జిల్లాకు పాత పేరు మాత్రమే పెట్టి ఆ జిల్లా గౌరవాన్ని పువరుద్ధరించాలి.

        ఎన్టీఆర్ జిల్లా పేరు కొనసాగింది ఆ జిల్లా గౌరవాన్ని కాపాడాలి.

          1. ఏమీ పీకుతారో. CBN నిజంగా మొండిగా వెళ్ళేవాడైతే వైఎస్ఆర్ జిల్లా లేపేస్తే మీరు చేయగలిగింది ఏమీలేదు. Don’t even think Jaglak will ever come to power again. ఒక్క chance అయిపోయింది. Jaglak will go to jail in the last one and half year of this term and as he will be disqualified for contesting elections for 7 years he will not be able to contest until 2039 elections.

      2. NTR ki YSR ki polika. Jaffa naa dash ga. Nee reddi picchi tagaleyyo. NTR is yuga purushudu. YSR will not compare to NTR’s toe nail ra jaffa.

        1. There is no issue if you like NTR and I respect that but it does not give the right to belittle others in a public forum. If you are brave enough comment with your address and belittle YSR or else STFU.

  1. ఏ జిల్ల సంగతో ఎమో…విశాఖని మాత్రం బద్నాం చెసెసెరు…తిరిగి దానిని సవరించవలసిన అవసరం చాలా ఉంది

      1. ఆలోచనలన్ని మనకేంటి లాభం అనేదాని చుట్టు తిరిగితే ఇలాగే ఉంటుంది.

        తింగరోడిని అలాగే వదిలెయ్యకండి .

        ప్యాలెస్ గాలి మరింత పిచ్చివాణ్ని చేస్తోంది.

        వాడిని వైజాగ్ లో మానసిక చికిత్స చేయించండి.

Comments are closed.