భారతీయ వ్యాపార దిగ్గజం రతన్ టాటా కన్నుమూత

భారతదేశంలో విలువలతో కూడిన వ్యాపారానికి చిరునామా వంటి దిగ్గజం రతన్ టాటా కన్నుమూశారు.

భారతదేశంలో విలువలతో కూడిన వ్యాపారానికి చిరునామా వంటి దిగ్గజం రతన్ టాటా కన్నుమూశారు. ఆయన వయస్సు 87 ఏళ్లు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కన్నుమూశారు. ఆయన టాటా గ్రూపు, టాటా సన్స్ సంస్థలకు ఛైర్మన్ గా సుదీర్ఘకాలం సేవలందించారు. తర్వాత టాటా ఛారిటబుల్ ట్రస్టుల సారథిగా కొనసాగుతున్నారు. ఆయనకు 2008లో భారతదేశంలో రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్బవిభూషణ్ లభించింది. 200లోనే ఆయనకు పద్మభూషణ్ లభించింది.

ముంబాయిలోని బ్రీచ్ కాండీ ఆసైుపత్రిలో అనారోగ్యంతో పోరాడుతూ ఆయన మరణించినట్లు టాటా సన్స్ గ్రూపు అధికారికంగా ప్రకటించింది.

రతన్ టాటా మరణం పట్ల భారత ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దూరదృష్టిగల వ్యాపారవేత్త రతన్ టాటా అంటూ ప్రధాని కొనియాడారు. దయగల అసాధారణ వ్యక్తి. దిగ్గజ వ్యాపారసంస్థకు నిజమైన స్థిరమైన నాయకత్వం వహించారని కితాబు ఇచ్చారు. సమాజహితం కోసం రతన్ టాటా పనిచేశారు.. ఎంతోమందికి ఆయన ఆప్తుడయ్యారు అని ఆయన మోడీ ట్వీట్ చేశారు.

1937లో డిసెంబరు 28న నావల్ టాటా- సోనీ దంపతులకు రతన్ టాటా జన్మించారు. 1990 నుంచి 2012 వరకు ఆయన టాటా గ్రూపు ఛైర్మన్ గా వ్యవహరించారు. న్యూయార్క్ కార్నల్ యూనివర్సిటీ నుంచి బీఆర్క్ డిగ్రీ చదివిన రతన్ టాటా ప్రస్తుతం టాటా సన్స్ ఛైర్మన్ గా ఉన్నారు.

రతన్ టాటా ప్రస్థానం ఒక అద్భుతం

రతన్ టాటా అమెరికా కార్నెల్ యూనివర్సిటీనుంచి బీఆర్క్ చదివిన తర్వాత 1961లో టాటా గ్రూపులో చేరారు. టాటా స్టీల్ లో షాప్ ఫ్లోర్ లో పనిచేశారు. జెఆర్‌డి టాటా రిటైర్మెంట్ తరువాత.. టాటా సన్స్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచంలోనే అత్యంత పెద్దస్థాయి వితరణ శీలురలలో రతన్ టాటా కూడా ఒకరు. ఆయన తన ఆదాయంలో 65 శాతం వరకు సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటారు. విలువలతో కూడిన వ్యాపారానికి చిరునామాగా రతన్ టాటాను చెప్పుకుంటారు.

టాటా గ్రూపును స్థాపించినటువంటి జంషెడ్జీ టాటా కుమారుడు రతన్ జీ టాటా దంపతులు, తాము నావల్ టాటాను దత్తత తీసుకున్నారు. నావల్ టాటా కొడుకే ఈ రతన్ టాటా. ఆయన పదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు. అప్పటినుంచి ఆయన తండ్రి ని దత్తత తీసుకున్న నానమ్మ నవాజ్‌బాయ్ టాటా సంరక్షణలోనే పెరిగారు.

41 Replies to “భారతీయ వ్యాపార దిగ్గజం రతన్ టాటా కన్నుమూత”

    1. ఎన్టీఆర్ కాలం నుండి సంక్షేమ పథకాలు ఉన్నాయి..

      మన కోడికత్తి సీఎం .. వాడొచ్చాాకే సంక్షేమ పథకాలు ఇచ్చాడు .. అని చెప్పుకొంటాడు..

          1. Kallallo nippulu posukovadam gurinchi nuvve cheppali. Last 2 years kukkallagaamorigina meevantivalla nollu ippudendukomoothapaddayi. Vandalamandipraanaalu teesi opposition meedaku tiyyadam. Bejawadanimunchadam opposition meedaku toyyadam, laddukalthe ani hinduvula manobhavaludebbateeyadam daani opposition meedaku toyyadam. Ippudu kothgaa chemadi I champalani try chesaru anadam……. Ivi just samples…. Every month okkoti

          2. ఇందుకేగా మీకు 11 ముష్టి వేశారు జనాలు…

            నీ జగన్ రెడ్డి అదేదో వాడి పిండాకూడు బుక్ రాస్తున్నాడంట .. వెళ్లి నీ పేరు కూడా రాయించుకో..

          3. ఆ విషయం 2029 లో ఆంధ్ర జనాలు చూసుకొంటారులే గాని.. నువ్వెళ్ళి జగన్ రెడ్డి రాసే పిండాకూడు బుక్ లో నీ పేరు రాయించుకో.. సీమ రాజా ని కూడా తీసుకెళ్ళు పాపం..

        1. ప్రపంచం ఎంతో ముందుకు పోయినా నీలాంటి వెధవలు మాత్రం ఆదిమానవుడి దగ్గరే ఆగిపోయారు

  1. Manchi vallandaru twaraga velipotunnaaru… 5 kotla mandhi andhrulaki manchi chesina ma anna button reddanna matram inka manamunde shikkati shirunavvu chindistunnaadu

  2. రేపు ఏ భక్తుడో CEO of Tata అయితే మోడీ నెహ్రఊని విమర్శించినట్లు ఆ దిక్కుమాలిన Air India తమ మీద రుద్దాడని, ఇంకా అనేక ఆరోపణలు చేసుకొస్తాడు.

    1. దేశం కోసం ఎంతో ఖర్చు కూడా చేశారు……. టీ అమ్ముకుంటేనో, లేక పాలు అమ్ముకుంటేనో మాత్రమే సేవ కాదు.

  3. ఒక మహా వ్యాపార సామ్రాజ్యం, కావాలనుకుంటే ప్రపంచ కుబేరుడు అని పిలిపించుకునే సత్తా…టీ పొడి నుండి ఆకాశంలో ఎగిరే విమానం దాక ఎన్నో ఉత్పదకాలు, కొన్ని లక్షల జీవితాలలో ఉపాధి కొన్ని కోట్ల చిరునవ్వుల కి కారణం ఒక వ్యాపారవేత్తగా 10000 వేల కోట్ల వ్యాపారం నుండి కొన్ని లక్షల కోట్ల కి విస్తరణ, అదే సమయం లో 70%పైగా వితరణ , చాలా సాధారణ జీవితం

    అంబానీలు, అదానీలు ఇంకా పేరున్న వ్యాపారవేత్తలు చేసేది కేవలం వ్యాపారం, కానీ టాటా చేసేది దేశోద్ధారణ.,ఆర్థిక, సామాజిక సేవ.ఇది కాదనలేని సత్యం.

    పై ఆర్టికల్ పైన కూడా రాజకీయ కోణం లో కాకుండా కామెంట్స్ రాస్తే , ఒక మహానుభావుడి కి నివాళి అర్పించినవారం అవుతాం

    **మహానుభావులకు మరణం లేదు**

  4. ఒక మహా వ్యాపార సామ్రాజ్యం, కావాలనుకుంటే ప్రపంచ కుబేరుడు అని పిలిపించుకునే సత్తా…టీ పొడి నుండి ఆకాశంలో ఎగిరే విమానం దాక ఎన్నో ఉత్పదకాలు, కొన్ని లక్షల జీవితాలలో ఉపాధి కొన్ని కోట్ల చిరునవ్వుల కి కారణం ఒక వ్యాపారవేత్తగా 10000 వేల కోట్ల వ్యాపారం నుండి కొన్ని లక్షల కోట్ల కి విస్తరణ, అదే సమయం లో 70%పైగా వితరణ , చాలా సాధారణ జీవితం

    అంబానీలు, అదానీలు ఇంకా పేరున్న వ్యాపారవేత్తలు చేసేది కేవలం వ్యాపారం, కానీ టాటా చేసేది దేశోద్ధారణ.,ఆర్థిక, సామాజిక సేవ.ఇది కాదనలేని సత్యం.

    పై ఆర్టికల్ పైన రాజకీయ కోణం లో కాకుండా కామెంట్స్ రాస్తే , ఒక మహానుభావుడి కి నివాళి అర్పించినవారం అవుతాం దయచేసి ఆయనకు రాజకీయ మకిలి అంటించద్దు.

    **మహానుభావులకు మరణం లేదు**

  5. ఒక మహా వ్యాపార సామ్రాజ్యం, కావాలనుకుంటే ప్రపంచ కుబేరుడు అని పిలిపించుకునే సత్తా…టీ పొడి నుండి ఆకాశంలో ఎగిరే విమానం దాక ఎన్నో ఉత్పదకాలు, కొన్ని లక్షల జీవితాలలో ఉపాధి కొన్ని కోట్ల చిరునవ్వుల కి కారణం ఒక వ్యాపారవేత్తగా 10000 కోట్ల వ్యాపారం నుండి కొన్ని లక్షల కోట్ల కి విస్తరణ, అదే సమయం లో 70%పైగా వితరణ , చాలా సాధారణ జీవితం

    అంబానీలు, అదానీలు ఇంకా పేరున్న వ్యాపారవేత్తలు చేసేది కేవలం వ్యాపారం, కానీ టాటా చేసేది దేశోద్ధారణ.,ఆర్థిక, సామాజిక సేవ.ఇది కాదనలేని సత్యం.

    పై ఆర్టికల్ పైన రాజకీయ కోణం లో కాకుండా కామెంట్స్ రాస్తే , ఒక మహానుభావుడి కి నివాళి అర్పించినవారం అవుతాం దయచేసి ఆయనకు రాజకీయ మకిలి అంటించద్దు.🙏

    **మహానుభావులకు మరణం లేదు**

  6. పార్సీ సామాజిక వర్గం అత్యంత మైనారిటీ వర్గం అయిన కూడా , భారత దేశం లో ఎప్పుడు కూడా రిజర్వేషన్ అడగకుండా, తామే దేశానికి తమ వంతుగా అనేక వ్యాపారాలు ద్వారా ఉద్యోగాలు కల్పించారు.

Comments are closed.