వేట్టయాన్ కు వేటగాడు అనే టైటిల్ అనుకుంటున్నారట. కానీ అది వేరే వాళ్లు రిజిస్టర్ చేయించడంతో, ఒరిజినల్ టైటిల్ నే అలా వదిలేశారంట. దానికి దగ్గరగా తెలుగులో మరో టైటిల్ దొరకలేదంట. అయినా క్యాప్షన్ కింద ‘ది హంటర్’ అనేది ఉందిగా, అది తెలుగువాళ్లకు అర్థమౌతుంది, అదే అసలు టైటిల్ అంటున్నారు దిల్ రాజు, సురేష్ బాబు.
ఒకే టైటిల్ మీద అన్ని భాషల్లో సినిమా రిలీజైతే, సోషల్ మీడియాలో ట్రెండింగ్ కు, యూట్యూబ్ లో వ్యూస్ కు ఈజీగా ఉంటుందని, అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని, కావాలని తమిళ టైటిల్ ను తెలుగులో రుద్దడం లేదని చెబుతున్నారు. సినిమాను సినిమాగానే చూడమంటున్నారు.
సురేష్ బాబు కూడా ఇదే విషయాన్ని మరో విధంగా చెబుతున్నారు. అవతార్, టైటానిక్ సినిమాలకు పేర్లు మార్చలేదు కదా.. కాబట్టి వేట్టయన్ కూడా అలానే వస్తుందనేది ఆయన లాజిక్.
వాళ్ల సినిమా కాబట్టి వాళ్లు ఎన్ని లాజిక్స్ అయినా తీయొచ్చు. అందులో తప్పులేదు. నిజానికి భాషతో సంబంధం లేకుండా టైటిల్ పెట్టాలనే ఆలోచన మేకర్స్ కు ఉండాలి. ముందుగా ఆ ఆలోచన చేస్తే, ఇప్పుడిలా చర్చించుకోవాల్సిన అవసరం ఉండదు. వేటగాడు టైటిల్ దొరకలేదు కాబట్టి, మరో తెలుగు టైటిల్ పెట్టలేదనడం ఎంతవరకు కరెక్ట్.
ఆర్ఆర్ఆర్, అవతార్, టైటానిక్, దేవర, సలార్.. ఇలాంటి టైటిల్స్ ఏ భాషలోనైనా ఒకటే. మరి సరిపోదా శనివారం సినిమాను తమిళ్ లో రిలీజ్ చేసినప్పుడు ఎందుకు పేరు మార్చారు. పవన్ నటించిన అత్తారింటికి దారేది సినిమాకు తమిళ్ లో ఎందుకు టైటిల్ మార్చారు?
ఎందుకంటే ఇవన్నీ అచ్చ తెలుగు టైటిల్స్. మరో భాషలో యథాతథంగా అదే టైటిల్ తో రిలీజ్ చేస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది కాబట్టి. అక్కడి జనాలకు బొత్తిగా అర్థం కాదు కాబట్టి. వేట్టయాన్ అనే టైటిల్ కూడా అలాంటిదే.
“సినిమాకు భాష లేదు, ఏ భాషలో టైటిల్ అయినా పెట్టుకోవచ్చు. అయినా చేతిలో ఇంటర్నెట్ ఉందిగా” అంటూ రానా లాంటి వాళ్లు సోఫాలో బాసింపట్టు వేసుకొని ఎంతైనా చెప్పొచ్చు. కానీ సామాన్య ప్రేక్షకుడికి సినిమా కనెక్ట్ అయ్యేది ముందుగా టైటిల్ తోనే కదా. ఇది బేసిక్ లాజిక్ కదా.
ఇదేదో భాషాభిమానమో, జాత్యాహంకారమో, ప్రాంతీయ అభిమానమో కాదు. సినిమాను సినిమాగా చూడమని దిల్ రాజే అంటున్నారు. అలా చూడాలంటే ముందుగా టైటిల్ ఏంటో అర్థంకావాలి కదా, అదే సగటు ప్రేక్షకుడి ఆవేదన. సినిమా ఎంత బాగున్నా బయటకొచ్చిన తర్వాత చెప్పడానికి నోరు తిరగాలి కదా, పైపెచ్చు ఏమాత్రం అటుఇటుగా మాట్లాడినా తెలుగులో బూతు ధ్వనించే టైటిల్ ఇది.
టైటిల్ లో ఏముంది.. కంటెంట్ బాగుంటే అందరూ చూస్తారనే వాదన పైన చెప్పుకున్న ముగ్గురు వ్యక్తుల్లో వినిపించింది. మరి అలాంటప్పుడు తాముతీసే సినిమాలకు టైటిల్స్ కోసం నెలల తరబడి ఎందుకు ఆలోచన?
“సరిపోదా శనివారం సినిమా, అత్తారింటికి దారేది సినిమా తమిళ్ లో రిలీజ్ చేసినప్పుడు ఎందుకు పేరు మార్చారు.”
తెలుగులో వాటి పేర్లు కూడా ‘శనివారం’, ‘అత్తా!!!’ అని ఉంటే మార్చేవారు కాదు. అయినా తెలుగులో చదివితే ఉద్యోగాలు కూడా రావనే విషయాన్ని తెలుగు వారు గ్రహించక ఏదో భాషాభిమానం అని నక్కవాతలు పెట్టుకుంటున్నారని పరభాషా వారికి బాగా తెలుసు. English mediumx
టైటిల్ ఏదైనా మేం థియేటర్లో చూడం
పోరా థియేటర్ లో చూడని పిచ్చి ముంద ఎంత సేపు ఆన్ లైన్ చుద్దామనే పిచ్చి ముండ ఆన్ లైన్ ఇ లో చూడద్దు రా పిచ్చి వెర్రీ పుష్పం
Call boy works 9989793850
vc estanu 9380537747
Ayina Telugu yenduku manaku
School lo Telugu medium vaddanna meeku Telugu pai abhimanam poduchuku vastonda?
ఆర్టికల్ బాగుంది!