విజయ్ దేవరకొండ కేజీఎఫ్

హీరో విజయ్ దేవరకొండ కేజీఎఫ్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? గౌతమ్ తిన్ననూరి అనే దర్శకుడు కేజీఎఫ్ సినిమా డైరక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఆ రేంజ్…

హీరో విజయ్ దేవరకొండ కేజీఎఫ్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? గౌతమ్ తిన్ననూరి అనే దర్శకుడు కేజీఎఫ్ సినిమా డైరక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఆ రేంజ్ లో ఉంటుందని అంటున్నాడు నిర్మాత నాగవంశీ.

“గౌతమ్ తిన్ననూరి కేజీఎఫ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో.. విజయ్ దేవరకొండతో అతడు చేస్తున్న మూవీ అలా ఉంటుంది. గౌతమ్ స్టయిల్ లో కేజీఎఫ్ లాంటి సినిమా తీస్తున్నాం.” ఈ సినిమాకు పెద్దగా ప్రచారం చేయడంలేదనే విషయంపై స్పందించిన నాగవంశీ.. అది దర్శకుడు గౌతమ్ స్టయిల్ అంటున్నాడు. సైలెంట్ గా అతడు సినిమా పూర్తి చేస్తాడని, ఆ టైమ్ వచ్చినప్పుడు ప్రచారం మొదలవుతుందని తెలిపాడు.

ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాను తన బ్యానర్ పై రిలీజ్ చేసిన నాగవంశీ.. అన్న ఎన్టీఆర్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని అన్నాడు. బిగ్గెస్ట్ రిలీజ్ చేస్తానని, రికార్డులు మిస్సవ్వకుండా చూసుకుంటానని ఎన్టీఆర్ అన్నకు మాటిచ్చానని, దాన్ని చేసి చూపించానని అన్నాడు.

దేవర సినిమా మొదటి రోజు వసూళ్లను 20-30శాతం పెంచి చూపించారనే విషయాన్ని ఖండించిన ఈ నిర్మాత, బయటకొచ్చిన గ్రాస్ ఫిగర్స్ అన్నీ నిజం అంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఏరియా మినహా, మిగతా అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యామంటున్నాడు.

గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగవంశీ.. తన బాబాయ్ పేరిట ప్రపంచంలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ కట్టాలనేది తన కోరికగా చెప్పుకొచ్చాడు.

3 Replies to “విజయ్ దేవరకొండ కేజీఎఫ్”

Comments are closed.