ఉత్తరాంధ్ర వైసీపీకి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి షాక్ ఇచ్చారు. అలాగే ఉత్తరాంధ్ర టీడీపీ నెత్తిన జగన్ పాలు పోశారని ఆ పార్టీ నాయకులు సంబరపడుతున్నారు. తాజాగా వైసీపీ నూతన కోఆర్డినేటర్లను అధికారికంగా ప్రకటించింది. ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డిని నియమించడం చర్చనీయాంశమైంది.
గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాంధ్రలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. విజయసాయిరెడ్డి చాలా మంచి పేరు సంపాదించుకోవడంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓర్చుకోలేక ఆయన్ను మార్చారని ఆ ప్రాంత వైసీపీ నాయకులు వెటకరిస్తుంటారు. అధికారం పోయిన తర్వాత మళ్లీ విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా నియమించడంతో ఆనందంలో నోటమాట రాలేదని ఆ ప్రాంత వైసీపీ నాయకులు వ్యంగ్యంగా అంటున్నారు.
విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించడంతో తన పేరును సార్థకం చేసుకునే క్రమంలో టీడీపీని విజయ పథంలో నడిపించేలా మరోసారి తన మార్క్ విభజించు, పాలించు రాజకీయాల్ని చేస్తారని ఆ ప్రాంత వైసీపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకు చేసిన మహా మంచి చాలయ్యా, మరెవరినైనా చూడాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తదితర నాయకులు జగన్కు నెత్తీనోరు కొట్టుకుని చెప్పినా, అధ్యక్షుడు మాత్రం వినలేదు.
ఉత్తరాంధ్రలో పార్టీ గెలవకపోయినా నష్టమేమీ లేదని, తాను అనుకున్నదే జరగాలనే రీతిలో విజయసాయిరెడ్డిని నియమించారని అనుకోవాల్సి వస్తుందని ఆ ప్రాంత వైసీపీ నాయకులు తీవ్ర నిరాశ, నిస్పృహతో చెబుతున్నారు. వైసీపీ అనేది జగన్ పెట్టుకున్న పార్టీ, ఏం చేసుకోవాలన్నది ఆయన ఇష్టం అంటూ ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు నిట్టూర్చుతున్నారు.
నిజానికి ఇప్పుడిప్పుడే ఉత్తరాంధ్రలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి నియామకంతో పాత గాయాల్ని గుర్తు చేసినట్టు అవుతోందని వైసీపీ నాయకులు అంటున్నారు. మంచి కోసం చెబితే వింటే జగన్…ఇలా ఎందుకు అవుతారనే ప్రశ్న ఎదురవుతోంది.
గతం లో ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జీ గా ఉన్నప్పుడు.. కొడుకుని కన్నాడు..
మళ్ళీ ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జీ గా వెళుతున్నాడు.. ఈసారి కూతురు ని కంటాడేమో ..
ఫ్యామిలీ ఫోటో కంప్లీట్ అయిపోతుంది..
vc available 9380537747
పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు
waste
Call boy jobs available 9989793850
పూర్వ వైభవం పక్కా ఓం “శాంతి”