పంత్ కు ఝ‌ల‌క్, కొహ్లీకి కెప్టెన్సీ, నితీష్ కు మంచి రేటు!

ఐపీఎల్ రిటెన్ష‌న్ జాబితాలో ఆస‌క్తి దాయ‌క‌మైన అంశాలున్నాయి. రిష‌బ్ పంత్ ను ఢిల్లీ జ‌ట్టు రీటైన్ చేసుకోకుండా వ‌దిలి వేసింది. ఆర్సీబీకి మ‌ళ్లీ విరాట్ కొహ్లీ కెప్టెన్ గా రీటైన్ అయ్యాడు! తెలుగు కుర్రాడు…

ఐపీఎల్ రిటెన్ష‌న్ జాబితాలో ఆస‌క్తి దాయ‌క‌మైన అంశాలున్నాయి. రిష‌బ్ పంత్ ను ఢిల్లీ జ‌ట్టు రీటైన్ చేసుకోకుండా వ‌దిలి వేసింది. ఆర్సీబీకి మ‌ళ్లీ విరాట్ కొహ్లీ కెప్టెన్ గా రీటైన్ అయ్యాడు! తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిని రీటైన్ చేసుకుంటూ ఎస్ఆర్హెచ్ జ‌ట్టు మంచి రేటు ను పే చేస్తోంది! అక్టోబ‌ర్ 31తో రీటెయిన్ జాబితాను ఖ‌రారు చేసుకోవాల్సి ఉంది ఐపీఎల్ జ‌ట్లు. ఈ నేప‌థ్యంలో అధికారిక ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చేస్తున్నాయి.

త‌న‌కు కెప్టెన్సీని డిమాండ్ చేయ‌డంతో పాటు, కోచ్ గా ఎవ‌రుండాలి, ప్లేయ‌ర్ల ఎంపిక‌లో కూడా త‌నే కీల‌కంగా వ్య‌వ‌హారించాల‌ని రిష‌బ్ పంత్ డిమాండ్ చేయ‌డంతో.. అత‌డిని కొన‌సాగించ‌డానికి ఢిల్లీ జ‌ట్టు యాజ‌మాన్యం ఆస‌క్తి చూప‌లేద‌ట‌! కొన్నేళ్లుగా ఢిల్లీకి ఆడుతున్న పంత్ త‌ను ఆడ‌న‌ప్పుడు కూడా జ‌ట్టు ఎంపిక‌లో కీల‌క పాత్ర పోషించాడు. యాక్సిడెంట్ త‌ర్వాత ఆడ‌లేక‌పోయినా, వేలం ప్ర‌క్రియ‌లో పాల్గొన‌డంతో పాటు యాక్టివ్ గా క‌నిపించాడు. అయితే విజేత‌గా నిల‌ప‌లేక‌పోయాడు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు కూడా పంత్ పూర్తి స్థాయిలో యాక్టివ్ రోల్ కోరుకోవ‌డంతో అత‌డిని రీటెయిన్ చేయ‌డానికి ఢిల్లీ జ‌ట్టు ఓనర్లు ఆస‌క్తి చూప‌న‌ట్టుగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఢిల్లీ జ‌ట్టుకు ఇప్పుడు కెప్టెన్ ఎవ‌ర‌నేది ప్ర‌శ్న‌! ఇందుకోసం వేలంలో ఆ జ‌ట్టు శ్రేయ‌స్ అయ్య‌ర్ కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు అనే మాట వినిపిస్తోంది.

ఇక ఎన్ని మార్చినా ఆర్సీబీ ప‌రిస్థితి మార‌డం లేదు. దీంతో మ‌ళ్లీ మొద‌ట‌కు వ‌చ్చింది. విరాట్ కొహ్లీని మ‌ళ్లీ కెప్టెన్ గా నియ‌మించుకుంటూ ఆ జ‌ట్టు రీటెయిన్ చేసుకుంది. మ‌రి ఆర్సీబీని గ‌తంలో ఫైన‌ల్ వ‌ర‌కూ తీసుకెళ్లిన కొహ్లీ వ‌చ్చేసారి ఏ మేర‌కు సత్తా చూపిస్తాడో చూడాల్సి ఉంది.

ఇక 2023లో కేవ‌లం ఇర‌వై ల‌క్ష‌ల రూపాయ‌ల మొత్తంతో ఎస్ఆర్హెచ్ తో ఒప్పందం కుదుర్చుకున్న వైజాగ్ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి జాత‌కం మారింది. 2024 సీజ‌న్ లో నితీష్ రాణించాడు. దీంతో జాతీయ జ‌ట్టులో కూడా అవ‌కాశం ల‌భించింది. బంగ్లాదేశ్ తో టీ20ల‌తో జాతీయ జ‌ట్టు స‌భ్యుడు అయ్యాడు. బ్యాటింగ్ శైలి ప్రామిసింగ్ ఉండ‌టంతో.. ఇండియా ఏ జ‌ట్టులో కూడా స‌భ్యుడ‌య్యాడు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త ఏ జ‌ట్టు త‌ర‌ఫున నితీష్ ఆడుతున్నాడు. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ ప్రాబ‌బుల్స్ లో ఎంపిక‌య్యాడు. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్ లో ఇత‌డికి స‌న్ జ‌ట్టు ప్రాధాన్య‌త‌ను పెంచింది. ఆరు కోట్ల రూపాయ‌ల ధ‌ర‌తో నితీష్ ను ఎస్ఆర్ హెచ్ రీటెయిన్ చేసుకుంది. ఐపీఎల్ ఆరంభ సీజ‌న్ లో ఆరు కోట్ల రూపాయ‌లు అనేది గ‌రిష్ట ధ‌ర‌, ప్ర‌స్తుతానికి ఇది నార్మ‌ల్ నంబ‌రే అయినా, నితీష్ ఇది గొప్ప ప్రోత్సాహ‌కం అవుతుంది.

ఇక స‌న్ జ‌ట్టు ఈ ఏడాది సీజ‌న్లో ఫైన‌ల్ వ‌ర‌కూ చేర్చిన ప‌లువురు ఆట‌గాళ్ల‌ను రీటెయిన్ చేసుకుంది. కెప్టెన్ క‌మ్మిన్స్ ను 18 కోట్ల‌తో, క్లాస‌న్ ను 23 కోట్ల‌తో, హెడ్ ను 14 కోట్ల రూపాయ‌ల‌తో, అభిషేక్ శ‌ర్మ‌ను 14 కోట్ల రూపాయ‌ల‌తో హైద‌రాబాద్ బేస్డ్ జ‌ట్టు మ‌రో సీజ‌న్ కు కొన‌సాగిస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించింది.

4 Replies to “పంత్ కు ఝ‌ల‌క్, కొహ్లీకి కెప్టెన్సీ, నితీష్ కు మంచి రేటు!”

Comments are closed.