పరనిందే పరమార్థమా!

జగన్మోహన్ రెడ్డిని నిందించడంలోనే ఆయన అతి గొప్ప ఆనందాన్ని పొందుతున్నట్లుగా వర్తమాన పరిణామాలు కనిపిస్తున్నాయి.

‘ఆత్మ స్తుతి.. పరనింద’ సిద్ధాంతం రాజకీయ నాయకులకు అత్యంత అవసరమైన సిద్ధాంతాలలో ఒకటి. ‘నీ భజన నువ్వే చేసుకోవాలి మిత్రమా’ అనే నీతి నాయకులకు అందరికీ తెలుసు! ‘నీ ప్రత్యర్థిని ఒక విషపురుగుగా చిత్రించి జనాన్ని నమ్మించాలి మిత్రమా’ అనే కుటిల నీతి నాయకులలో తెలివైన వారికి మాత్రమే తెలుసు! చంద్రబాబు నాయుడు తెలివైన నాయకుడు మాత్రమే కాదు– ఆ సిద్ధాంతానికి అనేక కొత్త కొత్త మెలకువలను జోడించగల సృజన శీలురు, కార్య సమర్ధులు కూడా!

జగన్మోహన్ రెడ్డిని నిందించడంలోనే ఆయన అతి గొప్ప ఆనందాన్ని పొందుతున్నట్లుగా వర్తమాన పరిణామాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు రాజకీయ జీవితంలో 4.0 ఇన్నింగ్స్ లో– మరొక అంశమేదీ ఆయనకు అంతగా కిక్ ఇవ్వడం లేదంటే నమ్మవచ్చు. ఆ ధోరణుల మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ పరనిందే పరమార్థమా?’

ఇద్దరు మిత్రులు కలిసిన ఏ సందర్భాన్నయినా గమనించండి. తొలుత ఆ ఇద్దరూ తమ ఇరువురి కుశలం గురించి విచారించుకుంటారు. ఆ తర్వాత తాము సాధించిన విజయాలు, తమ గొప్పదనాల గురించి చెప్పుకుంటారు. కొంతవరకు సినిమాలు, క్రికెట్టూ, రాజకీయాలూ మీద చెత్త చర్చ నడుస్తుంది. ఆ తర్వాత కూడా వారికి సమయం మిగిలిపోతుంది. కానీ మాట్లాడుకోడానికి విషయాలు ఉండవు. అప్పుడిక మూడో మిత్రుడి గురించి మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు! తమ ఎదురుగా లేనివాడి గురించి!! వాడి లోపాలు, వాడి వెధవతనం గురించి పుంఖానుపుంఖాలుగా చెప్పుకోవడం మొదలెడతారు.. ఆ టాపిక్ లో వారికి ఇక అలసట రాదు.. కంటెంట్ అయిపోవడం అనేది కూడా ఉండదు.

కొన్ని సందర్భాల్లో ఈ వరుసక్రమం మారవచ్చు. మూడో మిత్రుడిని తిట్టుకోవడం కాస్త ముందుకు జరగవచ్చు. మరికొన్ని సందర్భాలలో అసలు మూడో మిత్రుడిని తిట్టుకోవడం కోసమే ఆ ఇద్దరూ కలవడం కూడా జరగవచ్చు. ఇతరులను నిందిస్తూ బతకడంలో అంతటి మజా ఉంటుందన్నమాట!

ఒకరిని తిట్టడం వలన ఎలాంటి ప్రత్యేకమైన ప్రయోజనం, లాభం ఉండని మామూలు వ్యక్తుల విషయంలోనే ఇంత కుటిలత్వం దాగి ఉంటే.. ఇక రాజకీయ నాయకుల సంగతి ఏమిటి? తమ ప్రత్యర్థిని నిందించడం వలన వారికి ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ప్రత్యర్థి మీద తాము చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మితే, అది ఎదుటివాడి పతనాన్ని నిర్దేశిస్తుంది. ఆటోమేటిగ్గా.. అది తమ ఉన్నతికి దారితీస్తుంది. అందుకే

‘‘ఏ నేతల చరిత్ర చూసినా..
ఏమున్నది గర్వకారణం..?
పరనిందల పారాయణంలో
తరించి పోవడమే నిత్యం!’’

అని పాడుకోవాల్సి వస్తుంది. అకారణంగా, అసందర్భంగా, అనాలోచితంగా తమ ప్రత్యర్థుల మీద నిందలు వేసేస్తూ ఉండడం.. వాటిని ప్రజలు నమ్మితే తమకు ప్రయోజనం ఉంటుంది. నమ్మకపోయినా ప్రస్తుతానికి కోల్పోతున్నది ఏం లేదు కదా? అనే సిద్ధాంతానికి కట్టుబడడం వారి శైలి. రాజకీయ నాయకుల నిందలు ఎలా ఉంటాయంటే.. మసిగుడ్డ కాల్చి మొహాన పారేసినట్టే. మసి అంటుకోకుండా ఉండాలంటే.. అవతలి వాడే మొహం కడుక్కోవాలి. అంతేతప్ప మరొకటి జరగదు.

ప్రస్తుత రాజకీయాల్లో దేశంలోనే కురువృద్ధుల్లో ఒకడైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఇలాంటి టెక్నిక్స్ తెలియనివి కావు! ఆయన ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. నాలుగుదశాబ్దాల రాజకీయ జీవితాన్ని ఎన్నడో పూర్తిచేసుకుని ప్రస్థానం సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో.. కాస్త పరిణతితో కూడిన రాజకీయ తెలివితేటలను ప్రదర్శిస్తారని మనం అనుకుంటాం. కానీ ఆయన వ్యవహారకుశలతలో, అనుసరిస్తున్న పద్ధతుల్లో కొంత బ్యాలెన్స్ లోపించినట్టుగా కనిపిస్తోంది.

జగన్ ను దుర్మార్గుడిగా, అసమర్థుడిగా, అభివృద్ధి నిరోధకుడిగా, అవినీతిపరుడిగా చిత్రీకరించడం అనేది చంద్రబాబు యొక్క మౌలిక లక్ష్యం.ఎన్నికలకు ముందు ప్రజల్ని నమ్మించడానికి ఆయన ఇలాంటి మాటలు పదేపదే చెబుతూనే ఉండాలి.. అది ఆయన మనుగడకు అవసరం కూడా! కానీ బురద చల్లుడు అనే కార్యక్రమానికి కూడా ఒక గడువు ఉంటుందనే సంగతిని చంద్రబాబు మరచిపోతున్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం పరిపాలన పగ్గాలు చేపట్టి అయిదు నెలలు కావస్తోంది. ఇప్పటికీ తమ ప్రభుత్వాన్ని నడుపుతున్న ఏకైక చైతన్య శక్తి– ‘జగన్ ను తిట్టడం’ అన్నట్టుగా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తే ఎలాగ? ప్రజలు నవ్వుకుంటారు కదా.. నమ్మకాన్ని సడలించుకుంటారు కదా? అనేది ఆలోచించాల్సిన విషయం.

అనునిత్యం జగన్నామ పారాయణం!

ఆవు వ్యాసం మాత్రమే చదువుకుని వెళ్లిన కుర్రవాడు బడిలో టీచరు ఏ ప్రశ్న అడిగినా.. తిప్పితిప్పి ఆవు వ్యాసం వద్దకే తీసుకువచ్చినట్టుగా చంద్రబాబునాయుడు పరిపాలన ఉంటుంది. డెబ్భయి నాలుగేళ్ల అనుభవజ్ఞుడైన ఈ నాయకుడు.. ఇంట్లో ఏదో ఒక రోజున దైవనామస్మరణనైనా మరచిపోతారేమో గానీ.. బయటకు వచ్చినప్పుడు.. జగన్మోహన్ రెడ్డిని తిట్టడం మాత్రం ఏరోజూ మరచిపోరు! ఏ చిన్న కీడుగురించి మాట్లాడుకోవాల్సి వచ్చినా దానికి సంబంధించిన మూలకారణం జగన్ అని అభివర్ణించడానికి ఆయన వద్ద అనేకానేక లింకులు ఉంటాయి.

సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం మారినప్పుడు రొటీన్ గా జరిగే బురద చల్లుడు కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. దిగిపోయిన ప్రభుత్వం రాష్ట్రాన్ని ముంచేసిందని, వారి పరిపాలనలో రాష్ట్రానికి ద్రోహం జరిగిందని, వారి చేతగానితనం రాష్ట్రాన్ని ఇరవయ్యేళ్లు వెనక్కు తీసుకువెళ్లిందని ఆరోపించడం కొత్త ప్రభుత్వానికి ఉండే మొట్టమొదటి బాధ్యత. ఆ రకంగా పాత ప్రభుత్వాన్ని నిందిస్తే తప్ప తమకు మనుగడ లేదని ప్రతి ఒక్కరూ నమ్ముతుంటారు. దాదాపుగా ప్రతి కొత్త ప్రభుత్వమూ.. పాత పాలకుల తీరుమీద శ్వేతపత్రాలు విడుదల చేయడం అనేది ఇలాంటి బురద చల్లుడులో భాగమే. చంద్రబాబునాయుడు కూడా అదే పని చేశారు. వివిధ శాఖల వారీగా అనేక శ్వేతపత్రాలు విడుదల చేశారు. సాధారణంగా అక్కడితో ఆగాలి. ఆగలేదు!

జగన్ తీసుకువచ్చిన ఇసుక అమ్మకాల విధానం, ప్రభుత్వ దుకాణాల ద్వారా మద్యం విక్రయించే విధానం రెండూ చాలా దుర్మార్గమైనవని.. వాటిని మార్చాల్సి ఉన్నదని చెప్పారు. మార్చారు. అక్కడైనా ఆగి ఉండాల్సింది. అలా కూడా జరగలేదు. బుడమేరు వరద దెబ్బ దగ్గరినుంచి, రాష్ట్రంలో ఏ చిన్న దుర్ఘటన జరిగినా.. దానికి జగన్ బాద్యుడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్ ను బాధ్యుడుగా చిత్రీకరించే ధోరణులను ఎఫ్పుడు ఆపుతారు? అది మిలియన్ డాలర్ ప్రశ్న.

చంద్రబాబునాయుడు జగన్ మీద విమర్శల విషయంలో ఎంతగా శృతిమించుతున్నారంటే.. జగన్మోహన్ రెడ్డిని అసహ్యించుకునే వారికి కూడా.. ఆయన వరుస విమర్శలు చూసి వెగటు పుడుతోంది. ఈ దౌర్భాగ్యం ఎక్కడి వరకు వెళ్లిందంటే.. ట్రూఅప్ చార్జీల రూపంలో విద్యుత్తు చార్జీలను చంద్రబాబు ప్రభుత్వం పెంచింది. సూటిగా చెప్పాలంటే.. ‘రాబోయే అయిదేళ్లలో విద్యుత్తు చార్జీలు పెంచం.. వీలైతే తగ్గిస్తాం’ అని ఆయన ఎన్నికల మేనిఫెస్టో హామీకి ఈ పెంపు విరుద్ధం. అయినా పెంచారు.. అదేమని అడిగితే ‘జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిదేళ్లలో చెడగొట్టిపోయిన వ్యవహారాల తాలూకు ఫలితం ఇది’ అని బుకాయిస్తున్నారు! ఎంత చోద్యం? జగన్ అమసర్థుడని అందుకే ఇవి వచ్చాయని నిందిస్తున్నారు.

ప్రజలు నమ్మినా సరే.. బురద ఆగదు!

నోరు తెరిస్తే నిత్య బురద ప్రవాహం వెల్లువలా రాజకీయ ప్రత్యర్థుల మీదికి వెళుతూ ఉండాల్సిందే. చంద్రబాబునాయుడు చెబుతున్న మాటలన్నీ నిజమే అనుకుందాం. జగన్ అసమర్థుడనే అనుకుందాం. ఎన్నికల ప్రచార సమయంలో అదే విషయాన్ని చంద్రబాబు కొద్దిగా మార్పు చేర్పులతో కొన్ని వేల లక్షలసార్లు చెప్పి ఉంటారు కదా. ఆ విషయం ప్రజలు కూడా నమ్మారు. ప్రజలు నమ్మారు గనుకనే.. జగన్ ను అధికారానికి దూరం పెట్టారు. చంద్రబాబు మహానుభావుడని, ఆయనను మించిన సమర్థుడు లేనే లేడని ప్రజలు అనుకున్నారు గనుకనే.. ఆయన చేతిలో అనన్యమైన మెజారిటీతో అధికారం పెట్టారు. అంతా ఇలాగే జరిగింది అని అనుకుందాం.

మరి చంద్రబాబునాయుడుకు తన సమర్థతను నిరూపించుకోవడానికి ఇది చక్కటి అవకాశం కదా! నిరూపించుకోవాలి కదా! జగన్ చేసిన తప్పులను దిద్దినప్పుడే కదా ఆయన సమర్థత బయటపడేది. జగన్ విద్యుత్తు విధానంలో లోపాలున్నాయని చెప్పి వాటిని చక్కదిద్దకుండా.. వాటివల్ల ఇప్పుడు ప్రజల మీద భారం పెంచితే ఎలాగ? జగన్ తప్పులను దిద్దలేకపోతే.. చంద్రబాబునాయుడు సమర్థుడని ప్రజలు ఎందుకు అనుకోవాలి? ఆ లాజిక్ ను చంద్రబాబు పట్టించుకోలేదు. ఎవ్వరూ ప్రశ్నించడం లేదు.

జగన్ ఇసుక విక్రయాల్లో తెచ్చిన విధానం తప్పు అని చంద్రబాబు అన్నారు.. ఓకే! అందులో అంతా జగనే దోచుకుంటున్నాడని చెప్పారు.. ఓకే! లిక్కర్ విధానం లోపభూయిష్టం అన్నారు.. సరే! అంతా జగన్ స్వాహా చేయడమే జరుగుతోందన్నారు.. మంచిదే! ఆ రెండు విధానాలు తప్పు అని చెప్పినప్పుడు.. వాటిని సరిదిద్దుతున్నాం అనే బిల్డప్ తో కొత్త ఇసుక విధానం, కొత్త లిక్కర్ విధానం తీసుకువచ్చారు. తాను తెచ్చిన విధానాలు మహాద్భుతాలు అన్నారు. అది కూడా మంచిదే. మరి అదే రీతిగా విద్యుత్తు చార్జీల విషయంలో జగన్ చేశారని చెబుతున్న పాపాలను సరిదిద్ది.. ప్రజల మీద వేసిన ట్రూప్ చార్జీల భారాన్ని ఎందుకు తప్పించలేకపోయారు? ఇది ప్రజలకు కలుగుతున్న సందేహం.

ఆగేదెప్పుడు?

అయిదు నెలలు గడచిపోయాయి. చంద్రబాబునాయుడు ఇప్పటికీ ప్రతి విషయంలోనూ జగన్ పాలనలోని వైఫల్యాల కారణంగా ఈ దుస్థితి వచ్చిందని చెప్పుకుంటూ తిరగడం గమనిస్తే.. రాబోయే అయిదేళ్ల పాటు కూడా జగన్ పారాయణమే నడుస్తుంటుందేమో అనిపిస్తోంది. ప్రజలు జగన్ ను మరచిపోయినా.. చంద్రబాబు ఊరుకునేలా లేరు. ప్రతిరోజూ జగన్ నిందిస్తూ తనవంతు కృషి చేసేలా ఉన్నారు.

రాజకీయ నిందలు నిజం అయి ఉండాల్సిన అవసరం లేదు. ముందే చెప్పుకున్నట్టు ప్రత్యర్థిని బద్నాం చేయడం ఒక్కటే లక్ష్యం. ఆరోపణల్ని, నిందల్ని, లోపాలను ఫ్యాబ్రికేట్ చేసి ప్రచారంలో పెట్టేయడమే! రాజకీయ వ్యూహమే అంత! కానీ, దానికి కూడా ఒక అంతూ దరీ ఉండాలి కద! ఎక్కడో ఒక చోట నిందలు మాని, పరిపాలన మీదకు దృష్టి మళ్లించాలి కదా. చంద్రబాబు ఆ పని ఇప్పట్లో చేసేలా లేరు. లేదా, పరిపాలన ఎంత బాగా చేసినా సరే.. జగన్ ను నిందించడం మానేస్తే.. మనకు మనుగడ ఉండదని ఆయన భయపడుతున్నారేమో అనిపిస్తోంది. పరనింద ఒక్కటే పరమార్థం అన్నట్టుగా ఆయన వ్యవహార సరళి సాగుతోంది. ప్రజల్లో ఈ వైఖరి చులకన కాకముందే ఆయన ఫుల్ స్టాప్ పెడితే.. ఆయన పెద్దరికానికి, ఔన్నత్యానికి గౌరవంగా ఉంటుంది.

..ఎల్. విజయలక్ష్మి

39 Replies to “పరనిందే పరమార్థమా!”

  1. అయ్యొ!!

    పింక్ డిమొండ్

    నారాసుర రక్త చరిత్ర

    32 కమ్మ DSP లు

    అమరవతి లొ అందరిదీ ఒకె కులం

    స్కిల్ డెవెలొప్మెంట్ స్కాం

    ఇన్నెర్ రింగ్ రోడ్ (లెని) స్కాం

    ESI స్కాం (అచ్చెం నాయిడు)

    షర్మిల వెనుక చంద్రబాబు

    విజయమ్మ వెనుక చంద్రబాబు

    .

    ఇవ్వన్ని ఏమిటి?? ప్రతివతా పరమాన్నమా???

  2. నీచుడు జగన్ రెడ్డి చేసిన దుర్మార్గాలు కప్పెట్టడానికి కాదు కదా అధికారం ఇచ్చింది , వాటిని ఎండగట్టకుంటే అవి తప్పు అని నీలి ఎధవలకి ఎలా తెలుస్తాయి

  3. పరిపాలన అంటే ఏంటి మేడం?

    నిన్న ఆర్సెలర్ వాళ్ళు లక్షా నలభై వేల కోట్ల పెట్టుబడులకు “సిద్ధం:..

    మొన్న బీపీసీఎల్ వాళ్ళు 60 వేల కోట్లు పెట్టుబడులకు “సిద్ధం:..

    ఇలా చెప్పుకుంటూ పోతే అయిదే అయిదు నెలల్లో .. తర్వాతి మూడు తరాలకు భవిష్యత్తుకి బాటలు వేసుకొంటూ సాగుతున్నారు..

    మీ జగన్ రెడ్డి కి ఐదేళ్లు సమయం ఇచ్చినా.. కనుక్కొన్న విషయం ఏమిటో చెప్పనా..

    పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు..

    చంద్రబాబు ని నరకాసురుడు అని సంబోధించడం..

    దుష్టచతుష్టయం..

    ఈ మధ్య లోకేష్ ని పప్పు అంటున్నాడు..

    ఇవన్నీ.. మీ దృష్టిలో “పరనింద” అనిపించిందా..?

    జగన్ రెడ్డి ని తిట్టడం లో ప్రజలు ఆనందిస్తున్నారు.. ప్రజలు కోరుకున్నది చేయడమే పరిపాలకుల లక్షణం..

    అందుకే.. జగన్ రెడ్డి ని నిలువునా.. అడ్డం గా .. దిగ్గొడుతున్నారు..

    మీ కలానికి కాలం చెల్లింది.. ఇక మూసుకోండి..

  4. పాపం! జగన్ అన్న ముచ్చటపడి కట్తించున్న రిషికొండ ప్యాలెస్స్ ని సమర్దించ లెక సతమతం అవుతున్నారు బులుగు మంద!

    .

    32 లక్షల విలువ చెసె బాత్ టబ్బులు, 12 లక్షల విలువ చెసె కమ్మొడ్లు, 200 టన్నుల central air condition సిస్టం.. ఇలా చెప్పుకు పొతె ఎన్నొ! మరి ఎవి పెత్తందారి పొకడలు కాదు, అని మా పెద జగన్ కి అనిపించినది ఎమొ?

    కర్చు చెసినా ఈ బిల్లులు అన్ని పబ్లిచ్ డొమైన్ లొ ఉంచుతా, అలానె ఇక్కడె ఈ కర్చు మీద డెబేట్ కూడా పెడతాం అని చంద్రబాబు అనగానె ఇక చమటలు పట్టాయి బులుగు మందకి.

    .

    ఈ భవం మొదలు పెట్తినప్పుడె అందరూ చెప్పరు ఇది జగన్ నివాసానికి అని. అయితె ఇక్కడ ఉన్న resort ని కూల్చి మరితగా పర్యాటఅబిరుద్ది చెస్తున్నం అన్న పెరు తొ పరిమిషన్లు తెచ్చుకున్నారు. అది కూడా ఇచ్చిన నిబందనలు దాటెసారు.

    ఇక రొజా గారు ఒపెన్ గానె జగన్ విసాక లొ ఉండటానికి ఈ ప్యాలెస్స్ నె బాఉంది అని మా కమిటీ నిర్నయించింది అని కూడా చెప్పారు! అలా జగన్ జలసాలకి కట్టపెడదాము అనుకున్నరు! అయితె అన్న వొడటం తొ అన్ని బొక్కలు బయట పడ్డాయి!!

    1. 2022 23 లో బకాయిలు 6 వేల కోట్లు 23 24 కు 11 వేల కోట్లు .అప్పుడు సిఎం ఎవరు .సరిగ్గా మంచి ఫిక్స్డ్ రెట్లు కు కోనుంటే ఇప్పుడీ ఎక్స్ట్రా బాదుడు తప్పేది జగన్ హయాం లో జరిగిన అతి పెద్ద తప్పిదాల్లో విద్యుత్ రంగం ఒకటి

  5. True అప్ చ్చర్గెస్ ఎందుకు వేస్తారు పీక్ టైం డిమాండ్ లో ఎక్కువ పెట్టి కొన్న విద్యుత్ బిల్ ల ను తరువాత ఇయర్ లో రికవర్ చేవతారు .ఇవి ఇయర్ తో సహా ప్రజలకు చెప్తారు .ఇప్పుడు నవంబర్ లో వేసేవి 2022 23 వి. ఒక 6 వేల కోట్లు తరువాత 23 24 వి ఒక 11 వేల కోట్లు ఉన్నాయి .గత మార్చి లోనే a వద్దింపు సిద్ధం అయ్యింది ప్రభుత్వం కూడా ఒప్పుకుంది .అంతలో ఎన్నికలు .ఇప్పుడు చెప్పండి అవి ఎవరు హాయాం లోనిబి .అదే విద్యుత్ ఒప్పందాలు సక్రమంగా చేసుంటే అధిక రేట్లకు కొనే అవసరం ఎందుకు జెన్కో ను నిర్వీర్యం చేసి ఇలా బయట కొని ……

  6. 2022 23 లో.సుమారు 6 వేల కోట్లు బకాయిలు అవి క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు అలాగే 23 24 కి 11 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. అంటే పీక్ డిమాండ్ లో రెట్ లు ఎక్కువ పెట్టి కొన్న బిల్ లు అవి. మరి ఆ టైమ్ లో పాలన ఎవరిది విద్యుత్ ఒప్పందాలు సరిగా చేసుకుని ఉంటే ముందే డిమాండ్ బట్టి ఒక్క ఫిక్స్డ్ రెట్ పెట్టుకుని ఉంటే ఇలా ఉండేదా

  7. కొరవ్వులు అన్ని రకాల చేసేయొచ్చు కానీ తరువాత వచ్చింది అవన్నీ మార్చి పోయి కళ్ళు మూసుకొని పాలించు కోవాలి ముబాయి మోడల్ ప్రకాశం వచ్చి భూ కబ్జా చేయొచ్చు ఆమెను పట్టు కోడానికి ముగ్గురు ఎస్ పీ లు పరుగులు తీయొచ్చు ఫ్లైట్ మీద .ఐఎవిన్ని బయటికి తేకూడదు

  8. ఒరేయ్ విజయలక్ష్మి గా !! ఇంకా నువ్వు మారు పేరుతో రాస్తున్నావా?? పరనింద ఒకే స్ట్రాటజీ తో ఊరేగుతున్న పులివెందుల గ్రామ సింహం ని ప్రజలు తరిమి తరిమి కొట్టిన సిగ్గు లేకుండా ఇంకా ఇలాంటి paid articles రాయించి కుంటున్న వాడికి, రాసే నీలాంటి కుక్కలకు hatsoff!!

  9. చిన్న కధ చాలు. రజినికాంత్, సూపర్ స్టార్ అయ్యింది సినిమాల్లో సూపర్ విలన్స్ ఉండబట్టి. అలాగే సీబీఎన్, సూపర్ హీరో అయ్యింది రాజకీయాలలో సూపర్ నీచుడు జగన్ ఉండబట్టే. సూపర్ హీరోలు ఎంత అవసరమో, సూపర్ నీచులు కూడా అంతే అవసరం ఈ సమాజంలో.

  10. రాజకీయాలతో సంబంధం లేని ఒక మహిళ శీలాన్ని అసెంబ్లీ సాక్షిగా అవమానించినపుడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉన్న మహానుభావుడికి చెప్పాల్సింది ఈ సుద్దులు.

  11. : రాజకీయాలతో -సంబంధం లేని ఒక -మహిళ- శీలా-న్ని -అసెం-బ్లీ- సా-క్షిగా అవమానించినపుడు ముసిముసి నవ్వులు నవ్విన ఉన్న- మహా-నుభావుడికి చెప్పాల్సింది ఈ సుద్దులు.

  12. మీ వాడి తప్పులని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఒక జెనెరలైజ్డ్ ఆర్టికల్ వదిలేసావా రా విజ్జి గా?

  13. What is the purpose of RUSHIKONDA Palace?. Why did Jagan Govt build it? Dear Great Andhra Writers, Could you please answer this? We support you and Jagan and give 175/175 in next 2029 elections. But Please answer to the the public.

    Expecting a valid reason.

  14. వాడు ముమ్మాటికీ అసమర్దుడే, పరిపాలన అంటే ఏంటో తెలియని వాడికి అధికారం ఇస్తే ఎంత అసమర్ధంగా పరిపాలిస్తాడో చెప్పుకోవటానికి చరిత్రలో ఒక ఉదాహరణగా నిలిచిపోతాడు మన మాజీ ముఖ్యమంత్రి

  15. మరి మనం జోగి రమేష్ తో చెపించింది ఏమిటీ, 
    రోజా తో చెపించింది ఏమిటీ, వల్లభనేని వంశీ గాడితో చెపించింది ,
    కోడలయితో చెపించింది మరి ఇంకా ఎంత మంది తోనో చెపించింది ఏమిటీ?
  16. గత ఐదేళ్లు దుష్ట చతుష్టయం, మూడు పెళ్లిళ్లు మూడు విడాకులు అంటూ అన్నయ్య చేసిన విమర్శలను ఏమని అనాలి..

  17. “ఆత్మస్తుతి పరనింద” ఇది రాజకీయనాయకులకు అవసరమైన సిద్దాంతం……… జగన్ రాజకీయనాయకుడైతే అదేచెసి cm అయ్యాడు…….అవునా విజయలక్ష్మి గారు….

  18. 2014-19 టర్మ్ లో కూడా ప్రతిరోజు – అయితే జగన్నామ స్మరణ లేదంటే అమరావతి గ్రాఫిక్స్ ప్రచారం.

  19. హారతి మహల్.. జై లు కు పోతాడు.. మొగుడి పోస్టుకు పోటీ లేదు అని నమ్మినట్లుంది… ముందుగానే తన టేస్ట్ కు తగ్గట్లుగా ఒక తాజ్ మహల్ లెక్కన, ప్రభుత్వ ఖజానాకు హారతి ఇచ్చి మొగుడితో కట్టించిందా? తన పరివారాన్ని పంపి, బరితెగించి, రహస్యంగా ఎవరినీ అటు రానీయకుండా.. పర్యావరణ విధ్వంసానికి పాల్పడి మరీ.. వ్యవస్థల కళ్లుగప్పి, తమ విచ్చలవిడి విలాసాలకు సుమారు ఐదు వందల కోట్లు తగలెయ్యడం అంటే.. మామూలు విషయం కాదు. ఈ క్రిమినల్ కపుల్స్ కు అవినీతి సంపద దోపిడీ మీద వున్న ప్రేమకు చిహ్నం ఈ రిషికొండ ప్యాలెస్..

Comments are closed.